AP POLITICS WHY TDP CHIEF CHANDRABABU PUT A RING ON HIS FINGER THIS IS THE SECRETE NGS
Chandrababu: చంద్రబాబు ఉంగరం వెనుక ఉన్న అసలు రహస్యం అదా..? పూర్తి క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధినేత
చంద్రబాబు రింగ్ వెనుక రహస్యం అదే
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మధ్య ఉంగరాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా చంద్రబాబు నాయుడు వేలికి ఉంగరం కనిపించడంలో అందరి ఫోకస్ దానిపైనే పడింది. దీంతో ఏంటి దీని ప్రత్యేకత..? రాజకీయ రేఖలు మారాలని ఈ రింగ్ పెట్టుకున్నారా అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి.. అయితే ఇదీ అసలు సీక్రెట్ అంటూ చంద్రబాబే స్వయంగా రివీల్ చేశారు.
Chandrababu Naidu Ring: సాధారణంగా రాజకీయ నేతలు ఏం చేసినా.. దానిపై చర్చ తప్పదు.. అందులోనూ ముఖ్యంగా వారు ధరించే వాటిలో ఏదైనా కొత్తది చేర్చినా.. స్టైలు మార్చినా దానిపై రాజకీయంగా అనేక విశ్లేషనలు వినిపిస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేవ్ రాజకీయాల్లో ఉంగరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తాజాగా తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తన ఫింగర్ కు పెట్టుకున్న రింగ్ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఈ మధ్య చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా.. అందరి చూపు ఆ వేలికి ఉన్న ఉంగరంపైనే పడుతోంది. ఆ ఉంగరం ఏంటి..? ఎవరైనా పండితులు చెప్పారా..? జాతకం బాగుండాలని పెట్టుకున్నారా..? లేక ఇంకా ఏదైనా ప్రత్యక కారణం ఉందా అంటూ ప్రశ్నలు ఎదరవుతున్నాయి. దీంతో తాను ఎందుకు ఉంగరం పెట్టాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు చంద్రబాబు. అయితే ఏ జోతిష్యుడో చెబితే తాను ఆ ఉంగరం పెట్టుకోలేదన్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?
ఆయనే స్వయంగా వివరణ ఇవ్వడంతో చంద్రబాబు ఎడమ చేతి వేలికి రింగ్‌పై క్లారిటీ వచ్చింది. కేవలం తన ఆరోగ్యం కోసమే రింగును పెట్టుకున్నాట్లుగా వెల్లడించారు. రింగ్‌లో చిప్ ఉందన్నారు. రింగులో ఉండే చిప్ చంద్రబాబు ఆరోగ్య పరిస్థతిని ఎప్పటికప్పుడు కనిపెట్టి.. ఆ వివరాలను వైద్యులకు వెల్లడిస్తుందన్నారు. దీంతో ఆయన నిజమే చెబుతున్నారా అంటూ మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్ని రోజుల నుంచి చంద్రబాబు ఎడమ చేతి వేలికి రింగ్ కనిపించడంతో మీడియాలో పెద్ద వార్తగా మారింది. జులై 1 నుంచి చంద్రబాబు ఎడమ చేతికి ఈ రింగ్ పెట్టుకున్నారు. ఆరోజు పెట్టిన ప్రెస్‌మీట్‌తో పాటు నిన్న జరిగిన మదనపల్లి మహానాడు సభలో చంద్రబాబు చేతికి రింగ్ కనిపించింది. దీంతో ఆయన రింగ్ ఇప్పుడు ఏపీలో హాట్‌టాపిక్ అయ్యింది. 40 ఏళ్ల రాజకీయం జీవితం.. సాదాసీదా జీవితం. జేబులో పెన్నుతో మాత్రమే చంద్రబాబు కనిపించేవారు. చేతికి వాచీ కూడా పెట్టుకునేవారు కాదు. కానీ ఎడమ చేతి చూపుడు వేలుకు ఇప్పుడు రింగ్ పెట్టుకుంటున్నారు. ఈ సడెన్ ఛేంజ్ వెనుక రీజనేంటి? బాబు సెంటిమెంట్‌గా మారారా? అంటూ చర్చ జరుగుతూనే ఉంది.
అయితే అనుమానాలకు తావు లేకుండా.. చంద్రబాబే పూర్తి వివరణ ఇచ్చారు. తనకు సాధారణంగా ఎలాంటి సెంటిమెంట్లు లేవని చెప్పారు. కేవలం ఆరోగ్యకారణాలతోనే పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. మరోవైపు ఆ మధ్య మంత్రి నారాయణ స్వామి పెట్టుకున్న రింగ్ కూడా హైలైట్ అయ్యంది. ఎందుకంటే ఆయన రింగ్ పై వైఎస్ఆర్ తో పాటు, వైసీపీ అధినేత జగన్ ఫోటోలను ముద్రించిన ఉంగరం ధించారు. అందుకే ఆయనకు మంత్రి పదవికి తిరిగి వచ్చిందనే ప్రచారం కూడా ఉంది. కారణం ఏదైనా రాజకీయ నేతులు పెట్టుకునే రింగ్ లు మాత్రం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.