హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ సైలెంట్ కు కారణం ఏంటి..? గన్నవరంపై టీడీపీ స్పెషల్ ఆపరేషన్!

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ సైలెంట్ కు కారణం ఏంటి..? గన్నవరంపై టీడీపీ స్పెషల్ ఆపరేషన్!

వల్లభనేని సైలెన్స్ కు కారణం అదేనా?

వల్లభనేని సైలెన్స్ కు కారణం అదేనా?

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ యాక్టివ్ రాజకీయాలకు దూరమవుతారా..? వైసీపీ నుంచి టిక్కెట్ దక్కే అవకాశం లేదా..? ప్రస్తుతం ఎందుకు సైలెంట్ అయ్యారు..? రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారే గన్నవరం సీటుపై టీడీపీ ఫోకస్ చేసిందా? ఇప్పటికే ఆపరేషన్ మొదలెట్టిందా..?

ఇంకా చదవండి ...

Vallabhaneni Vamsi: మొన్నటి అసెంబ్లీ సమావేశాలకు ముందు హాడావుడి చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభ నేని వంశీ  (Vallabaneni Vamsi) ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.. టీడీపీ (TDP) నుంచి గెలిచి.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) లపై తీవ్ర విమర్శలు చేశారు. జై సీఎం జగన్ (CM Jagan) అంటూ.. వైసీపీ  (YCP) గూటికి చేరారు.. కానీ ఇప్పుడు పూర్తి సైలెంట్ అయ్యారు. ఆ మధ్య వల్లభనేని వ్యతిరేకులంతా.. కూడబల్లుకుని ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) కి లేఖలు రాశారు.. గన్నవరంలో వంశీకి సీటు ఇస్తే ఓడిస్తామని.. కాదని ఎవరికి ఇచ్చినా గెలిపించుకుంటా అంటూ ఘాటుగా లేఖలు రాశారు. ఇప్పుడు మరో అంశం తెరపైకి వచ్చింది. తాజాగా‘గడగడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) పేరుతో అధికార పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఇది తమ ఇంటి పండుగ అని.. తమ కుటుంబ పండుగకు మమ్మల్ని మాత్రమే మాత్రమే నిర్వహించుకోనివ్వండి. బయటి వారి జోక్యం అవసరం లేదు అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. అంటే నేరుగా వల్లభనేని వంశీని ఉద్దేశించే ఆ నియోజకవర్గంలో ఈ ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి.

గన్నవరం ప్రస్తుతం నియోజకవర్గంలో వంశీ వ్యతిరేకులంతా ఒకే గూటికి చేరుతున్నారు. ఇప్పటివరకూ నియోజకవర్గ నేతలుగా ఉన్న వెంకటరావు, రామచంద్రరరావు వర్గీయులు ఏకతాటిపైకి వచ్చి వల్లభనేని వంశీపై యుద్ధం ప్రకటించారు. ఈ పరిణామాలన్నీ తనకు వ్యతిరేకంగా ఉండడం.. ఇదే సమయంలో విజయసాయి రెడ్డి యాక్టివ్ గా ఉండడం.. మరోవైపు తన్న సన్నిహితుడు కొడాలి నానికి మంత్రి పదవి పోవడం.. అన్ని వల్లభనేని వ్యతిరేకంగానే కనిపిస్తున్నాయి. అందుకే ఆయన సైలెంట్ అయిపోయారన్న టాక్ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.

ఇదీ చదవండి : టీడీపీ-జనసేన-బీజేపీ కలిస్తే గెలుపు గ్యారంటీ..? పవన్ కు కాపు సంక్షేమ నేత లేఖ

తన స్నేహితుడు నాటి మంత్రి కొడాలి నాని తో కలిసి వైసీపీకి మద్దతుగా తన వాయిస్ వినిపించారు. వైసీపీలో తన బెర్త్ ను ఖాయం చేసుకునేందుకు తెగ దూకుడు ప్రదర్శించారు. కానీ పరిస్థితి చూస్తే అంతా అనుకూలంగా కనిపించడం లేదు. తన విషయం పార్టీ కీలక నేతలతో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దాలని ప్రయత్నించినా.. వ్యతిరేక వర్గం స్పీడ్ గా పావులు కదుపుతోంది. విజయసాయి రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం వారికి ప్లస్ అవుతోంది. కొద్ది కాలం క్రితం వంశీకి వ్యతిరేకంగా గన్నవరం వైసీపీ కార్యకర్తలు పార్టీ ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డిని కలిసి..వంశీకి ఇన్ ఛార్జ్ పదవి ఇస్తే గన్నవరంలో పార్టీ గెలవదని.. మరెవరికి టికెట్ ఇచ్చినా భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టం చేసారు. లేఖ కూడా అందించారు.

ఇదీ చదవండి : ఏపీ సర్కార్ కు షాక్.. సీఎంకు కన్వాయ్ కష్టాలు.. రాష్ట్రానికి అవమానం అన్న చంద్రబాబు

ఆది నుంచి వల్లభనేని వంశీ రాకను నియోజకవర్గంలోని వైసీపీ నేతలు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇందుకు చాలా కారణాలున్నాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వల్లభనేని వంశీ దూకుడుగా వ్యవహరించారు. వైసీపీ శ్రేణులపై కేసులు పెట్టించారు. ఆర్థిక మూలాలపై సైతం దెబ్బతీశారు. అందుకే వంశీ రాకను వైసీపీ కీలక నాయకుల నుంచి ద్వితీయ శ్రేణి నాయకులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ది గా వంశీ పోటీ చేస్తారనే ప్రచారంతో పార్టీ లోని వ్యతిరేక శ్రేణులు ఒక్కటయ్యారు. ఎవరికి సీటు వచ్చినా..వంశీకి మాత్రం సీటు దక్కకుండా చూడాలనే వ్యూహంతో వ్యవహరిస్తున్నారు.

ఇదీ చదవండి : ఒకటి ఆదానీ ఫ్యామిలీకి.. మరొకటి మెగా ప్రొడ్యూసర్ కు.. ఒక్క సీటుపైనే సందిగ్ధం.. విజయసాయి సంగతి ఏంటి..?

ఇదే సమయంలో గన్నవరం స్థానంపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వైసీపీలో విభేదాలను చూసి సరైన క్యాండేట్ ను బరిలో దించాలని ఆలోచిస్తున్నారు. అందుకే ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు తో పాటు కుమారుడు లోకేష్ సైతం ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో వంశీని తెగ్గొట్టాలని భావిస్తున్నారు. కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే వైసీపీలో గౌరవం లేదు.. టీడీపీ చూస్తే పగతో ఉండడంతో రాజకీయంగా సైలెంట్ కావడమే మంచిదన్న భావనలో వంశీ ఉన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, TDP, Vallabaneni Vamsi, Ycp

ఉత్తమ కథలు