హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: గన్నవరంలో ఏం జరుగుతోంది? వంశీ-రాధ మధ్య ఏకాంత చర్చలు.. మ్యాటర్ అదేనా..?

AP Politics: గన్నవరంలో ఏం జరుగుతోంది? వంశీ-రాధ మధ్య ఏకాంత చర్చలు.. మ్యాటర్ అదేనా..?

రాధాతో వల్లభనేని వంశీ ఏకాంత చర్చలు..?

రాధాతో వల్లభనేని వంశీ ఏకాంత చర్చలు..?

AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఇప్పటికే ప్రధాన పార్టీల్లో వర్గ పోరు రచ్చ రచ్చ అవుతోంది. దీంతో పార్టీ నుంచి ఎవరు ఎప్పుడు జంప్ కొడతారో అన్నది ఉత్కంఠ పెంచుతోంది. ఇలాంటి సమయంలో గన్నవరంలో వల్లభనేని వంశీ, వంగవీటి రాధాలు ఏకాంతంగా చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది.

ఇంకా చదవండి ...

Gannavaram Politics: గన్నవరం రాజకీయాలు (Gannavaram Politics) ఆసక్తికరంగా మారాయి. వైసీపీ వర్గ పోరు (YCP Internal Fight) తారా స్థాయికి చేరింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు.  అధికార పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గిన వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) వైసీపీకి జై కొట్టినప్పటి నుంచి పరిస్థితి వేడి వేడిగా మారింది. ఆ విబేధాలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. తాజాగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా వల్లభనేని వంశీ వ్యాఖ్యలకు దుట్ట రామచంద్ర, యార్లగడ్డ ఇద్దరూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మట్టి తవ్వకాల్లో అక్రమాలు జరిగాయి అంటూ ఆయక వల్లభనేనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను విలనో, హీరోనో గన్నవరం ప్రజలకు తెలుసునని. అతనో హీరో మహేష్ బాబు, అతని పక్క ఉన్న వ్యక్తి హీరో ప్రభాస్ కాదు కదా' అంటూ వంశీ తనదైన శైలిలో ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఆ వ్యాఖ్యలపై దుట్ట, యార్లగడ్డ తీవ్రంగా స్పందించారు. వల్లభనేని లాగ సంస్కారం లేకుండా తాము మాట్లాడలేం అని యార్లగడ్డ అంటే.. వంశీకి వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తే సపోర్ట్ చేసేది లేదంటూ దుట్టా చెప్పారు. ఇలాంటి సమయంలో గన్నవరంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

కృష్ణా జిల్లా గన్నవరంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓ ఫంక్షన్ లో ఎమ్మెల్యే వంశీ, టీడీపీ నేత వంగవీటి రాధ (Vangveeti Radha) కలుసుకున్నారు. కేవలం కలుసుకుని ఉంటే పెద్ద ఆసక్తి ఉండేది కాదేమో.. ఎదో అనుకోకుండా కలుసుకుని ఉంటారని అంతా లైట్ తీసుకునే వారు. కౌగిలించుకుని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. కాసేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. ఆ తర్వాత వంగవీటి రాధ భుజం మీద చెయ్యి వేసి నడుస్తూ దగ్గరుండి రాధను కారెక్కించారు వంశీ. గన్నవరం రాజకీయాలు హాట్ హాట్ గా మారిన సమయంలో వీరిద్దరూ ఏం చర్చించి ఉంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మీటింగ్ ను రెండు పార్టీల అధిష్టానాలు ఎలా పరిగణిస్తాయో చూడాలి.

వంగవీటి రాధ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ.. వైసీపీకి మద్దుతుగా ఉన్నారు. అయితే ప్రస్తుతం వైసీపీలో వల్లభనేని వంశీ, గన్నవరం నియోజకవర్గంలో ఆ పార్టీ నేతల మధ్య పోరు నడుస్తోంది. వల్లభనేని వంశీపై దుట్టా రామచంద్రరావు ఫైర్ అవుతున్నారు. ఇక మరో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుతోనూ విభేదాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో వల్లభనేని వంశీ వంగవీటి రాధను కలవడం చర్చకు తెరలేపింది.

ఇదీ చదవండి : శ్రీవారి భక్తులకు శుభవార్త.. వేలానికి సిద్ధమైన స్వామి వారి వస్తువులు..? వేలంలో ఎలా పాల్గొనాలి అంటే..?

ఇద్దరూ ఏకాంతంగా చర్చలు జరపడం మరింత పొలిటికల్ హీట్ పెంచింది. ఇద్దరు నేతలు ఏం చర్చించారు అనేది దానిపై ఆసక్తి నెలకొంది. నియోజకవర్గంలో వైసీపీ నేతల నుంచి వంశీకి సహకారం లేకపోవడంతో రాధతో తన పొలిటికల్ ప్రయాణంపై చర్చించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Vallabaneni Vamsi, Vangaveeti Radha

ఉత్తమ కథలు