హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodali Nani: కొడాలి నాని మౌనానికి అర్థం ఏంటి..? విమర్శలపై ఎందుకు స్పందించడం లేదు?

Kodali Nani: కొడాలి నాని మౌనానికి అర్థం ఏంటి..? విమర్శలపై ఎందుకు స్పందించడం లేదు?

జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని (file)

జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని (file)

Laxmi Parvathi: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు విషయంపై లక్ష్మీ పర్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశ్వ విద్యాలయానికి పేరు మార్పు అనేది చాలా చిన్న అంశం అన్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)కి ఏమైంది..? ఫైర్ బ్రాండ్ గా.. ప్రతిపక్ష పార్టీలపై ఓ రేంజ్ లో విరుచుకుపడే ఆయన.. ఎందుకు సైలెంట్ అయ్యారు..? వ్యూహత్మక మౌనం పాటిస్తున్నారా..? లేక వేరే రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా..? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ( NTR Health University) ని.. వైఎస్ఆర్ హెల్త్ యూనివిర్శిటీ పేరు మార్చినప్పటి నుంచి.. ఏపీ రాజకీయాల్లో దుమారం రేగుతోంది. వైసీపీని, సీఎం జగన్ (CM Jagan) ను టార్గెట్ చేసి.. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై కొడాలి నాని స్పందించాలని అన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. సాధారణంగా జగన్ ను చిన్న మాట అంటేనే.. మీడియా ముందుకు వచ్చి.. ప్రత్యర్థులను చెడుగుడు ఆడే.. కొడాలి నాని.. ఈ విషయంలో ఎదుకు నోరు మెదపడం లేదు.

  సాధారణంగా నందమూరి కుటుంబం అంటే కొడాలి నానికి కాస్త అభిమానం ఉంది. అందులోనూ సీనియర్ ఎన్టీఆర్ అన్నా.. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అన్నా గౌరవిస్తారు.. ఇలాంటి సమయంలో  ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు మార్పు అంశం వ్యక్తిగతంగా ఆయనకు కాస్త ఇబ్బంది అనిపించినా.. కనీసం ఆదే విషయం అధినేతకు తెలియ చేయొచ్చు.. వల్లభ నేని సైతం.. ఇది మంచి నిర్ణయం కాదంటూ ఆ రోజే కామెంట్ చేశారు. కానీ కొడాలి నాని మాత్రం.. ఇది తప్పనో.. రైట్ అనో.. లేదా మరేదో ఒక అంశం మాట్లాడుతారని అంతా ఎదురుచూస్తున్నారు.

  కానీ కొడాలి నాని దీనిపై స్పందించడం లేదు.. మొన్నటి వరకు అంటే ఒకే.. ఇటు నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్  మాట్లాడిన తరువాత అయినా.. కొడాలి నాని స్పందిస్తారని అంతా ఊహించారు.. ఎందుకంటే తారక్ ఈ విషయం స్పందించినా.. జగన్ నిర్ణయాన్నిఎక్కడా తప్పు పట్టలేదు.. దీంతో ఆయన మనవడే తప్పు కాదనప్పడు... తాను ఎలా తప్పు పడతానని కొడాలి నాని స్పందిచినా ఎవరూ అభ్యంతరం చెప్పేవారు కాదు.. అయినా ఆయన మౌనంగానే ఉన్నారు.

  ఇదీ చదవండి : నేడు తిరుమలకు సీఎం జగన్ .. శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. ఈ సారి సామాన్యులకు అదిరే ఆఫర్

  ఇక బాలయ్య అయితే రెండు అడుగులు ముందుకే వేసి.. సీఎం జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టారు మార్చాయడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు. కొడాలి నానితో సహా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన నేతలను టార్గెట్ చేస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సన్నాసులు,  పీతలు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీంతో కచ్చితంగా కోడాలి.. బాలయ్యకు కౌంటర్ ఇస్తారని భావించారు. అయినా కొడాలి నాని మౌనంగానే ఉంటున్నారు..?

  ఇదీ చదవండి : సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు కొత్త జీవితం ఇచ్చిన టీటీడీ బర్డ్స్.. దేవుడే కాపాడాడంటున్న యువతి కుటుంబం

  మంత్రిగా ఉన్నప్పుడు కానీ.. అంతకుముందు కానీ.. మాజీ మంత్రి అయిన తరువాత కానీ.. కొడాలి ఎప్పుడు ఇలా సైలెంట్ గా కనిపించలేదు. చంద్రబాబు నాయుడు, లోకేష్ లేదా ఇతర టీడీపీ నేతలు జగన్ విమర్శిస్తే.. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే కౌంటర్లు ఇస్తారు.. కానీ ఈ సారి ఎందుకు సైలెంట్ గా ఉన్నారన్నది అంతు చిక్కడం లేదు.

  ఇదీ చదవండి : ఏపీలో 62 లక్షల మందికి గుడ్ న్యూస్.. ఇకపై ఎక్కడ కవాలంటే అక్కడే లబ్ధి.. పూర్తి వివరాలు ఇవే

  ప్రస్తుతం కొడాలి నాని తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆ మధ్య కేబినెట్ నుంచి తొలగించారు. జగన ను అభిమానించే నేతగా.. ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు. కానీ తన సమాజిక వర్గం నుంచి ఒక్కరి కూడా కేబినెట్ పదవి ఇవ్వకపోవడంతో.. ఆ వర్గంలో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఈ విషయంలో ఇంతకాలం తనకు సోపర్ట్ గా నిలిచిన సామాజిక వర్గ పెద్దలు సైతం నానిపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. ఆ గాయం నుంచి కోలుకోకముందే.. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మార్పు మరో దెబ్బగా మారింది. ఎన్టీఆర్ పేరు మార్పు విషయంలో జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తే సొంత సామాజిక వర్గం నుంచి తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుంది. అది తన నియోజకవర్గం గుడివాడలో గెలుపుపై ప్రభావం చూపించే అవకాశం ఉందనే.. ఆయన స్పందించడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Jr ntr, Kodali Nani

  ఉత్తమ కథలు