హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodali Nani: కొడాలి నానికి ఏమైంది..? అలా ఎందుకు చేశారు..? మనస్థాపం చెందారా..?

Kodali Nani: కొడాలి నానికి ఏమైంది..? అలా ఎందుకు చేశారు..? మనస్థాపం చెందారా..?

కొడాలి నాని, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

కొడాలి నాని, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

Kodali Nani: ఫైర్ బ్రాండ్.. మాజీ మంత్రి కొడాలి నానికి ఏమైంది..? గత కొన్ని రోజులుగా ఎందుకిలా ఉన్నారు.. ఆయనలో మార్పుకు కారణం ఏంటి.. తీవ్రంగా మనస్థాపం చెందారా..? సీఎం జగన్ పిలిచిన ఎందుకు వెళ్లలేదు.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ అయ్యింది..

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  Kodali Nani: పొలిటికల్ ఫైర్ బ్రాండ్.. ప్రత్యర్థి పార్టీలకు మాటలతో చుక్కలు చూపించే నేత.. మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) కి ఏమైంది.. వైసీపీ (YCP) తరపున 151 మంది ఎమ్మెల్యేలు నెగ్గినా.. అందులో అధినేతకు అత్యంత సన్నిహితుల్లో కొడాలి నాని ఒకరు.. ప్రస్తుతం ఉన్న మంత్రుల కంటే ఆయనకే సీఎం దగ్గర చనువు ఎక్కువ.. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు నేరుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ని  కలవగలిగే నేత.. అంతేకాదు అధినేత అత్యధికంగా నమ్మకం పెట్టుకోగలిగిన లీడర్ గా కూడా గుర్తింపు పొందారు. అలాంటి కొడాలి నానికి ఇప్పుడు ఏమైంది..? వైసీపీ వర్గాల్లోనే ఈ చర్చ ఇప్పుడు రచ్చ రచ్చ అవుతోంది.  ఎందుకంటే.. సీఎం జగన్ పై ఎవరైనా చిన్న విమర్శ చేస్తే చాలు.. మీడియా ముందుకు వచ్చి వారిని మాటలతోనే చెడుగుడు ఆడేస్తారు.  కానీ దాదాపు పది రోజు లనుంచి ఆయన ఎక్కడా కనిపించడం లేదు.  పోనీ దానికి ఏదైనా కారణం ఉంది అనుకుంటే.. అధినేత జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. అందరి నేతలను ఆహ్వానించిన పార్టీ కీలక సమావేశానికి కూడా కొడాలి నాని హాజరు కాలేదు.. దీంతో ఆయనకు ఏమైందనే చర్చ.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.

  వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే గడప గడపకు ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేతలు అంతా తమ గ్రాఫ్ పెంచుకోవాలని జగన్ టార్గెట్ పెట్టారు. అయితే చాలామంది ఆ కార్యక్రమాన్ని లైట్ తీసుకున్నట్టు అధినేతకు రిపోర్ట్ లు అందాయి. దీంతో ఆ రిపోర్ట్ ను ముందుర పెట్టుకొని.. 27 మంది నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు జగన్.. అందులో మాజీ మంత్రి కొడాలి నాని పేరు కూడా ఉండడం ఈ చర్చకు కారణం అవుతోంది.

  ప్రోగ్రస్ రిపోర్ట్ సంగతి అలా ఉంటే.. తప్పని సరిగా అందరూ ఈ సమావేశానికి హాజరు కావాల్సిందే.. ఎలాంటి మినహాయింపులు లేవని సీఎం జగన్ పదే పదే చెబుతున్నా.. ఈ సమావేశానికి కొడాలి నాని డుమ్మా కొట్టారు. అధినేత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమావేశానికి హాజరు కాకపోవడానికి ఏదైనా బలమైన కారణముందా..? లేక నాని రాజకీయ వ్యూహంలో భాగమా అన్నదానిపై ఇప్పటికే వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నట్టు టాక్..

  ఇదీ చదవండి : ప్రభాస్ కు మంత్రి రోజా హామీ.. రెండు ఎకరాల స్థలం కేటాయింపు..!

  విజయవాడ లోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైస్సార్ పేరు మార్చినప్పటి నుంచి కొడాలి నాని సైలెంట్ గానే ఉన్నారు. అయితే ఈ విషయంపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే ఈ నిర్ణయంతో.. ఆయన రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. మరి కొడాలి నాని స్పందన ఏంటి..? తప్పనో.. ఒప్పనో ఎందుకు ఆయన చెప్పడం లేదన్నది ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు.

  ఇదీ చదవండి : కాంట్రాక్టుల పేరుతో ప్రజల సొమ్ము తిని బలిసికొట్టుకుంటున్నారు.. వైరల్ అవుతున్న చిరు ట్వీట్.. వార్నింగ్ ఎవరికి?

  గత పది రోజుల నుంచి మీడియా ముందుకు రాకపోవడం.. సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నా.. ప్రత్యర్థులకు కౌంటర్లు ఇవ్వకపోవడం.. ఇప్పుడు అధినేత నిర్వహించిన కీలక సమావేశానికి డుమ్మా కొట్టడం చూస్తే.. ఆయన మనసులో ఏదో ఉందనే చర్చ మొదలైంది. మరి ఈ అనుమానాలకు కొడాలి నానే తెరదించాల్సి ఉంది.. 

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Kodali Nani, Ycp

  ఉత్తమ కథలు