హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kanna: జనసేన అన్నారు.. టీడీపీ వైపు వెళ్తున్నారా..? అసలు కారణం ఇదే..?

Kanna: జనసేన అన్నారు.. టీడీపీ వైపు వెళ్తున్నారా..? అసలు కారణం ఇదే..?

కన్నా లక్ష్మీనారాయణతో నాదెండ్ల మనోహర్ భేటీ (ఫైల్ ఫోటో)

కన్నా లక్ష్మీనారాయణతో నాదెండ్ల మనోహర్ భేటీ (ఫైల్ ఫోటో)

Kanna: రేపో మాపో ఆయన జనసేనలో చేరడం ఖాయం అన్నారు. సీటు కూడా ఫిక్స్ అయ్యిందని ప్రచారం జరిగింది.. కానీ ఇప్పుడు ఆయన మనసు మారిందా.. జనసేన కాకుండా టీడీపీలో చేరేందుకు ఫిక్స్ అయ్యారా..? అందుకు కారణం ఏంటి..?

  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Kanna Political Game:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  (Andhra Pradesh Politics) ఇప్పుడు కన్నా లక్ష్మీ నారాయణ హాట్ (Kanna Lakshmi Narayana) టాపిక్ అయ్యారు. బీజేపీ (BJP) కి ఆయన రాజీనామ చేస్తారు అన్నది అందరూ ముందుగా ఊహించిందే.. అయితే ఆయన పార్టీ మారడంపై నే వివిధ రకాల ఊహాగానాలు ఉన్నాయి. చాలాకాలంగా ఆయన జనసేన (Janasena) లో చేరుతారు అంటూ ప్రచారం ఉంది. పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన అనుచరులు గతంలోనే చెప్పారు.. మరోవైపు ఆ మధ్య నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) .. ప్రత్యేకంగా కన్నాతో భేటీ అయ్యారు. ఆ సమావేశం తరువాతే అనుచరులకు కన్నా క్లారిటీ  ఇచ్చారంటే.. బీజేపీకి బైబై  చెపుతున్నా అని.. త్వరలోనే జనసేనలో  చేరుతున్నామని ముఖ్య అనుచరులకు హింటు కూడా ఇచ్చారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు సీన్ మారిందా..  ఆయన చూపు జనసేన నుంచి టీడీపీ వైపు మారింది. అందుకు కారణం ఏంటి..?

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పది రోజుల క్రితం కన్నా.. టీడీపీ నేతలతో హైదరాబాద్ లో సమావేశం అయినట్టు తెలుస్తోంది. ఆ సమావేశంలో కన్నా మనసులో మాట బయట పెట్టారని.. వెంటనే టీడీపీ నేతలు అధినేతతో మాట్లాడి.. సత్తెనపల్లి సీటు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

తనకు కావాల్సిన హామీ టీడీపీ నుంచి రావడంతో సైకిల్ ఎక్కడమే మేలని ఆయన ఫిక్స్ అయినట్టు ఓ వర్గం చెబుతోంది. ఈ నెల 23 లేద 25 తేదీల్లో ఆయన చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇదీ చదవండి : స్వర్ణరథంపై శ్రీ కళ్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి కటాక్షం.. వైభవంగా బ్రహ్మోత్సవాలు

అయితే జనసేనలో చేరాలి అనుకున్న ఆయన.. టీడీపీ వైపు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని.. ఆయన ముఖ్య అనుచరులను అడిగితే ఆసక్తికరమైన సమాధానం చెబుతున్నారు. జనసేన -టీడీపీ పొత్తు అధికారికంగా ఖరరై ఉంటే.. జనసేనలో చేరి సత్తెనపల్లి నుంచి పోటీ చేసేవారని.. కానీ ఇప్పటికే జనసేన పొత్తుపై ఎలాంటి హామీ ఇవ్వడం లేదని.. ఇలాగే ఆలస్యం చేస్తే అనుకున్న సీటు దక్కకపోయే ప్రమాదం ఉందని కన్నా ఆలోచన మార్చుకున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి : శివరాత్రి రోజు ఈ శివాలయాన్ని దర్శించుకుంటే చాలు.. ఎన్నో జన్మల పుణ్యం

అలాగే  ఒకవేళ టీడీపీ, జనసేన పొత్తు లేకుండా.. జనసేనలో చేరితే భారీగా నష్టం తప్పదని ఆయన అభిప్రాయపడుతున్నారంట.. ఎందుకంటే టీడీపీతో జనసేన జత కలవకపోతే.. బీజేపీతో కలిసే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అదే జరిగితే తాను బీజేపీని వీడడంలో అర్థం లేదని.. ఎదో ఒక రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారని ఆయన అనుమానించినట్టు తెలుస్తోంది. అంతేకాదు జనసేన సైతం కన్నాను పార్టీలోకి  ఆహ్వానించడంలో కాస్త వెనుకబడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీతో జనసేన పొత్తు కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో బీజేపీ నేత జనసేనలో చేరితే.. అది ఇరు పార్టీల సంబంధంపై ప్రభావం చూపుతుందని.. అందుకే పవన్ వేచి చూసే ధోరణి ఆవళంభించారని రాజకీయ వర్గాల సమాచారం.. ఇలా పవన్  ఆలస్యం చేస్తుండడంతోనే కన్నా.. టీడీపీ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Janasena, Kanna Lakshmi Narayana, TDP

ఉత్తమ కథలు