Home /News /andhra-pradesh /

AP POLITICS WHY JANASENA CHIEF PAWAN KALAYN READY TO BUS YATRA FROM DASARA NGS

Pawan Kalyan Bus Yatra: దసరా పొలిటికల్ బరిలో పవన్.. బస్సు యాత్రకు అసలు కారణం అదేనా? ప్రజలకు ఏం చెప్పనున్నారు?

పవన్ కళ్యాణ్ (file)

పవన్ కళ్యాణ్ (file)

Pawan Kalyan Bus Yatra: పార్ట్ టైం పొల్టీషియన్ అంటూ విమర్శలు ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్.. ఇక రాజకీయాలపై సీరియస్ ఫోకస్ చేస్తున్నారు. ఈ దసరా నుంచే పొలిటికల్ బరిలో దిగుతున్నారు. అయితే ఇంత సడెన్ గా బస్సు యాత్ర ఎందుకు చేపడుతున్నారు..? ఈ యాత్రలో ప్రజలకు ఆయన ఏం మెసేజ్ ఇవ్వనున్నారు.

ఇంకా చదవండి ...
  Pawan Kalyan Bus Yatra: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సార్వత్రిక ఎన్నికలకు దాదాపు రెండేళ్లకు పైగా సమయం ఉంది. కానీ ముందస్తు ఎన్నికలు తప్పవని విపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అందుకే విపక్ష పార్టీలన్నీ ఇప్పటి నుంచే ఎన్నికలపై ఫోకస్ చేస్తున్నాయి. ఇక జనసేన (Janaesena) సైతం జనం బాట పట్టింది. 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క సీటును గెలుచుకున్న ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో మాత్రం అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రైతులు, పేదల ఇళ్లల్లో తిరుగుతూ వారికి అవసరమైన సాయం చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). కేవలం అర్బన్ లో మాత్రమే ఉండే ఆదరణ ఇప్పుడు.. గ్రామీణ ప్రాంతాల్లోనూ పెరుగుతోంది. అందుకే జనసైనికులు సైతం ఉత్సాహంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

  త్వరలో జనసేన బస్సు యాత్ర చేపట్టనున్నారు అధినేత పవన్.  అందుకు సంబంధించిన కార్యాచరణను పార్టీ నాయకులు సిద్ధం చేస్తున్నారు. బస్సు యాత్రలో ఏయే అంశాలతో ప్రజలను ఆకట్టుకోనున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ బస్సు యాత్ర కోసం పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్ లను ఈ ఐదు నెలల్లో పూర్తి చేసి అక్టోబర్ 5 నుంచి ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్రకు కారణం ముందస్తు ఎన్నికలకన్నా మరేదో కారణం అయ్యి ఉంటుందని జనసైనికులు భావిస్తున్నారు.

  సభలు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా జనసేన ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది. గత ఎన్నికల్లో ఘోర పరాభావం తరువాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన పవన్ ఆ తరువాత గ్రామాల్లో తిరగడం మొదలుపెట్టారు. మొదట రైతు సమస్యలను తెలుసుకునేందుకు పంటపొలాల దగ్గరకు వెళ్లారు. రైతుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అని ఆయన నినదిస్తున్నారు. ఆ తరువాత గ్రామాల్లో, పట్టణాల్లో నెలకొన్న ఇతర సమస్యలపై దృష్టి సారించారు. ముఖ్యంగా గ్రామాల్లో రోడ్ల పరిస్థితిపై జనసేన సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. కొన్ని గ్రామాల్లో జనసైనికులు సొంత డబ్బులతో రోడ్లు వేయించి ఆకట్టుకున్నారు. ఈ పరిస్థితిని గమనించిన వైసీపీ ప్రభుత్వం చాలా గ్రామాల్లో రోడ్లు వేసేందుకు నిధులు జారీ చేసింది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని కదిలించిన జనసేన అక్కడితో మరిన్ని సమస్యలపై పోరాడాలని నిర్ణయించుకుంది.

  ఇదీ ,చరవండి : ఆ జిల్లాలో వైసీపీ, టీడీపీ మధ్య ముదిరిన వార్.. హత్య కేసు చుట్టూ తిరుగుతున్న రాజకీయం

  ప్రజలను వంచిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యమని పవన్ పదే పదే చెబుతున్నారు. ఇందులో భాగంగా పలు పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకోవడానికైనా సిద్ధం అని చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకుంటానన్న పవన్.. మరి కలిసివస్తే టీడీపీని కూడా కలుపుకుపోతారా..? అనేది తేలనుంది. ఒకవేళ అలయన్స్ తో ఎన్నికల బరిలోకి దిగితే అన్ని పార్టీలు కలిసి హామీలను నిర్ణయించే అవకాశం ఉంది. కానీ పవన్ ఇప్పుడే బస్సు యాత్ర చేపట్టడం ద్వారా ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వగలుగుతారన్నది హాట్ టాపిక్ గా మారింది.

  ఇదీ ,చరవండి : ఆ జిల్లాలో వైసీపీ, టీడీపీ మధ్య ముదిరిన వార్.. హత్య కేసు చుట్టూ తిరుగుతున్న రాజకీయం

  జనసేన బస్సు యాత్ర త్వరలో తిరుపతి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేపట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా జనసేనకు పట్టున్న 30 నియోజకవర్గాలను ఎంచుకొని ఆయా ప్రాంతాల్లో ఎక్కువ రోజులు సాగేలా ప్లాన్ చేస్తున్నారు. అవసరమైన కొన్ని చోట్ల పాదయాత్ర చేపట్డాలని కూడా జనసేనాని నిర్ణయించారు. గత ఎన్నికల్లో గెలుపు దగ్గరికి వచ్చిన తాను ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచే తీరుతామని చెప్పనున్నారు. గత ఎన్నికల్లో ‘జగన్ ఒక్క చాన్స్ ’ లాగానే తమకూ ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరనున్నట్లు తెలుస్తోంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Pawan kalyan

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు