Home /News /andhra-pradesh /

AP POLITICS WHY BJP LEADERS SILENT ON FREE RATION LAST THREE MONTHS AP GOVERNMENT STOP SUPPLY NGS

AP Free Ration: అంతన్నారు.. ఇంతన్నారు.. ఆ విషయంపై సైలెంట్ అయ్యారు.. ఏపీ బీజేపీ నేతల తీరుపై అనుమానాలు

ఫ్రీ రేషన్ విషయంలో చేతులెత్తేస్తున్న సర్కార్

ఫ్రీ రేషన్ విషయంలో చేతులెత్తేస్తున్న సర్కార్

AP Free Ration: ఏపీ ప్రభుత్వం తీరుపై పలు సందర్భాల్లో బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఏ విషయం దొరుకుతుందా విమర్శించడానికి అన్నట్టు కొందరు నేతలు రెడీ గా ఉంటారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ కీలకమైన విషయంలో ఏపీ బీజేపీ నేతలంతా సైలెంట్ అయ్యారు.. పోరాడాల్సిన అంశాన్ని పక్కన పెట్టేయడంపై ఇఫ్పుడు అనుమానాలు పెరుగుతున్నాయి.

ఇంకా చదవండి ...
    AP Free Ration: కరోనా కష్ట కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచిత బియ్యం అందిస్తోంది. అయితే ఈ ఉచిత బియ్యం పంపిణీ గత మూడు నెలులుగా ఏపీలో నిలిచిపోయింది. దేశంలో అన్ని రాష్ట్రాలు అందిస్తున్నా మన రాష్ట్రంలో జగన్ సర్కారు నిలిపివేసింది. ఇలా ఉచిత బియ్యం నిలిపివేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏప్రిల్ వరకూ అందించి తరువాత ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసింది. అందుకు ప్రధాన కారణం తమపై ఆర్థిక భారం పడుతోందని..ఇకపై బియ్యం అందించలేమని ఏపీ అధికారులు చెబుతున్నారు. 2020 మార్చిలో కొవిడ్ వ్యాప్తి ప్రారంభమైంది. ప్రజా జీవితం అతలాకుతలమైంది. ఉపాధి లేక నిరుపేద కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం పంపిణీని ప్రారంభించింది. గత రెండేళ్లుగా బియ్యం అందిస్తూ వచ్చింది. అయితే కొవిడ్ తగ్గుముఖం పట్టినా బియ్యం పంపిణీ మాత్రం నిలిచిపోలేదు. సెప్టెంబరు వరకూ అందించాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చాలా రాష్టాల్లో ఈ ప్రీ బియ్యం పథకం కొనసాగుతోంది కూడా.. కానీ ఏపీలో మాత్రం మే, జూన్ నెలలకు సంబంధించి పేదలకు ఉచిత బియ్యం అందలేదు.

    జూలై నెలా ప్రశ్నార్థకమే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వద్ద నాన్ సార్టెక్స్ బియ్యం నిల్వలు లేకపోవడమే ఇందుకు కారణం అని అధికారులు చెబుతున్నారు. దీంతో ఏపీలో నిరుపేద రేషన్ లబ్ధిదారులు ఎదురుచూపులు తప్పడం లేదు. అదిగో ఇదిగో అంటూ చెబుతూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వలేమని చేతులెత్తేయడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పక్క రాష్ట్రాల్లో అందించి ఇక్కడ మాత్రం విస్మరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు.



    ఏపీ వ్యాప్తంగా 1.45 కోట్ల రేషన్ కార్డులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం అందించనున్నట్టు ప్రకటించింది. పేదలకు మెరుగైన ఆహారం అందించడంలో భాగంగా సన్న బియ్యం అందించనున్నట్టు చెప్పుకొచ్చింది. తరువాత మాట మార్చింది. కేవలం బియ్యంలో ఉన్న నూకలు తీసి నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తోంది. ఇందుకుగాను మిల్లర్లకు సార్టెక్స్ మిషన్లు పెట్టుకోవాలని ఆదేశించింది. దీంతో అదనపు భారమైనా ప్రభుత్వ ఆదేశాలతో మిల్లర్లు సార్టెక్స్ మిషన్లు అమర్చుకున్నారు. ఇంతలో కేంద్ర ప్రభుత్వం కొవిడ్ నేపథ్యంలో ఉచిత బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. నెలలో తొలి పక్షం రెగ్యులర్ గా రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన బియ్యం అందిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత బియ్యాన్ని రెండో పక్షంలో అందిస్తూ వస్తున్నారు. మొన్న ఏప్రీల్ వరకూ రెండు కోటాల బియ్యం పంపిణీ సక్రమంగా జరిగేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద నాన్ సార్టెక్స్ బియ్యం నిల్వలు నిండుకోవడంతో అప్పటి నుంచి ఉచిత కోటాను నిలిపివేసింది.

    ఇదీ చదవండి : పొత్తుపై చంద్రబాబు పునరాలోచనకు కారణం అదేనా? టీడీపీది విశ్వాసమా..? అతి విశ్వాసమా..?

    రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారుడికి అందించే రేషన్ బియ్యం వాటాలో కేంద్ర ప్రభుత్వం వాటాయే సింహభాగం. కిలో బియ్యం 35రూపాయలలుగా నిర్ణయిస్తే.. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా 30 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం వాటా 5 రూపాయలు రేషన్ పంపిణీ నిర్వహణ బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదే. జగన్ సర్కారు అందిస్తున్న నాణ్యమైన బియ్యం పంపిణీకి మరో 1.50 అదనంగా ఖర్చవుతోంది.అంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్కో కిలో బియ్యంపై ఖర్చు చేస్తోంది అక్షరాల 6.50 అన్న మాట. మరోవైపు జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఏపీలో గుర్తించిన రేషన్ కార్డులు కేవలం 80 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాజకీయ లబ్ధి కోసం ఇబ్బడిముబ్బడిగా రేషన్ కార్డులు మంజూరు చేసింది. వాటి సంఖ్య 1.45 కోట్లకు పెరిగింది. కేంద్రం మాత్రం తాను గుర్తించిన 80 లక్షల కార్డులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి నగదు చెల్లింపులు చేస్తోంది. అంటే మిగతా 45 లక్షల కార్డులకు ఉచిత బియ్యం అందించాల్సిన బాధ్యత రాష్ట్రంపై పడింది.

    ఇదీ చదవండి : దసరా పొలిటికల్ బరిలో పవన్.. బస్సు యాత్రకు అసలు కారణం అదేనా? ప్రజలకు ఏం చెప్పనున్నారు?

    అయితే కొవిడ్ సమయంలో ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నప్పుడు బీజేపీ నేతలు హాడావుడి అంతా ఇంతా కాదు.. అంతన్నారు ఇంతన్నారు హడావుడి చేశారు. రేషన్ డిపోల దగ్గరకు వెళ్లి ప్రధాని మోదీ అందిస్తున్న బియ్యంగా చెప్పుకొచ్చారు. అసలు రాష్ట్ర ప్రభుత్వ పాత్రే లేదని తేల్చారు. ఏకంగా రేషన్ డిపోలు, బియ్యం తరలించే లారీలకు మొదీ బొమ్మలతో కూడిన ఫ్లెక్సీలను వేలాడదీశారు. ఇంతలా హాడావుడి చసిన నేతలు.. ఇప్పుడు గత మూడు నెలలుగా ఉచిత రేషన్ పంపిణీ నిలిచిపోయినా ఎందుకు సైలెంట్ గా ఉన్నారో బీజేపీ కార్యకర్తలకే అర్థం కావడం లేదంటున్నారు. అయినదానికి కానిదానికి హడావుడి చేసే బదులు పేదల బియ్యం కోసం పోరాడడం లేదని లోలోన మదనపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడేందుకు మంచి అస్త్రం దొరికినా రాష్ట నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆలోచిస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, AP News, Free Ration

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు