హోమ్ /వార్తలు /andhra-pradesh /

ఆ విషయంలో చిరు భయపడ్డాడా? అందుకే ఈవెంట్ హైదరాబాద్‌కు మార్చేశారా?

ఆ విషయంలో చిరు భయపడ్డాడా? అందుకే ఈవెంట్ హైదరాబాద్‌కు మార్చేశారా?

Megastar Chiranjeevi Photo : Twitter

Megastar Chiranjeevi Photo : Twitter

ఆచార్య ప్రిరిలీజ్ ఈవెంట్‌కు సీఎం జగన్ ముఖ్య అతిథిగా వస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే అకస్మాత్తుగా ఆచార్య టీం వేదికను విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మార్చేసింది.

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా ఆచార్య( Acharya). మరికొన్ని రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)కూడా ఈ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీగా మారింది. ఈ క్రమంలో ఆచార్య ప్రి రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా చేయాలని ఆచార్య టీం భావించింది. విజయవాడలో ఈ ఈవెంట్ నిర్వహించి.. సీఎ జగన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని ఆచార్య టీం అనుకున్నారు. చిరు కొత్త చిత్రం ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను విజయవాడలో నిర్వహించబోతున్నారని.. దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(AP CM YS Jagan Mohan Reddy) ముఖ్య అతిథిగా రాబోతున్నారని ప్రచారం జరగడం.. ప్రముఖ మీడియాలో సైతం దీని గురించి వార్తలు రావడం తెలిసిందే.

  ఐతే ఈ సమాచారం బయటికి రావడం ఆలస్యం.. సోషల్ మీడియాలో చిరు మీద తీవ్ర  విమర్శలు వ్యక్తమయ్యాయి.  దీంతో  ఆ నిర్ణయంతో వెనక్కి తగ్గారు. ముఖ్యంగా మెగా  అభిమానుల నుంచే వస్తున్న నెగెటివిటీ చూసి భయపడ్డారా? ఔననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. మెగా ఫ్యాన్స్(Mega Fans) చిరు నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఓవైపు ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గట్టిగా పోరాడుతుంటే.. ఇంకోవైపు జగన్‌ను తన సినిమా వేడుకకు చిరు ముఖ్య అతిథిగా పిలిచి ఆయనతో సన్నిహితంగా మెలిగితే.. పొగడ్తలు గుప్పిస్తే ఏమైనా బాగుంటుందా అంటూ అందరూ చిరును తప్పుబట్టారు.

  రాజకీయంగా ఏపీలో వేడి రాజుకుంటున్న సమయంలో, ప్రభుత్వంపై పవన్ ఎటాక్ మరో స్థాయికి చేరుతున్న తరుణంలో ఈ కలయికి ఎంతమాత్రం మంచిది కాదని.. పవన్‌కు బాగా డ్యామేజ్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో చిరు వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. దీంతో వేదికను కూడా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మార్చేశారు.  ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను (Acharya pre release event) ఈ నెల 23న హైదరాబాద్‌లోనే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

  జగన్ ముఖ్య అతిథిగా ప్రి రిలీజ్ ఈవెంట్ మాత్రం లేదనే అంటున్నారు. ‘ఆచార్య’ టీం అయితే అసలు ముందు నుంచి ఈ ఆలోచన లేదన్నట్లుగా అంటోంది. అసలు ఈవెంట్‌కు అసలు ఏర్పాట్లే జరగలేదని.. జనాల స్పందన ఎలా ఉంటుందో చూడటానికి పీలర్ వదిలారని.. రెస్పాన్స్ చూశాక వెనక్కి తగ్గారని అంటున్నారు. ఇందులో ఏది నిజమో కానీ.. ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్లో జగన్ పాల్గొనడం లేదు అన్న సమాచారం మాత్రం మెగా అభిమానులకు గొప్ప ఊరటనిస్తోంది. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన మరో విషయం ఏంటంటే... సీఎంగా వచ్చి నాలుగేళ్లు అయిన జగన్ ఇప్పటివరకు ఏ సినిమా కార్యక్రమానికి రాలేదు. దీంతో ఆయన కూడా దీనికి నిరాకరించి ఉంటాడని పలువురు చర్చించుకుంటున్నారు. మరి ఈ ఈవెంట్‌కు జగన్ కాకుండా ముఖ్య అతిథిగా ఎవరు వస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Acharya, Ap cm jagan, Chiranjeevi, Pawan kalyan, Ram Charan

  ఉత్తమ కథలు