Home /News /andhra-pradesh /

AP POLITICS WHO WILL BE NEXT CM OF ANDHRA PRADESH HOW MANY SEATS WILL BE YCP WIN 2024 ELECTIONS NGS

AP Political Survey: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. అధికారం ఏ పార్టీది? ఎవరికి ఎన్నిఅసెంబ్లీ సీట్లు

 చంద్రబాబు, జగన్, పవన్.. (ఫైల్)

చంద్రబాబు, జగన్, పవన్.. (ఫైల్)

AP Political Survey: ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిది..? వైసీపీ తిరిగి అధికారం చేపడుతుందా? టీడీపీకి పూర్వ వైభవం వస్తుందా..? జనసేన, బీజేపీ పరిస్థితి ఏంటి..? అసెంబ్లీ సీట్లలో ఏ పార్టీనిక ఎన్ని సీట్లు వస్తాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India
    AP Political Survey: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో చాలా రోజుల నుంచి ఎన్నికల వాతావరణ మొదలైంది. అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లాయి. మరోవైపు జాతీయ సర్వేలు హల్ చల్చేస్తున్నాయి. ఆ మధ్య ఇండియా టీవీ ఏపీలో ఎంపీ సీట్లు ఏ పార్టీకి ఎన్ని వస్తాయి.. అసెంబ్లీ సీట్లలో ఎవరికి ఎన్ని వస్తాయన్నదానిపై క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఇండియా టుడే –సీ ఓటర్‌ కలిసి మూడ్ ఆఫ్ ది నేషన్ (Moon of the Nation) పేరుతో నిర్వహించిన సర్వే లో.. ఏపీలోని పరిస్థితిపైనా క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. అధికార వైసీపీ (YCP) మళ్లీ ఘన విజయం సాధిస్తుందని సర్వే స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగి 40 నెలలు పూర్తవుతున్నప్పటికీ.. ప్రజల్లో పార్టీకి ఏ మాత్రం ఆదరణ తగ్గలేదని సర్వే స్పష్టం చేసింది. అంతే కాదు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) క్రేజ్ పెరుగుతోంది.. స్థానిక ఎమ్మెల్యేలపై మాత్రం కాస్త వ్యతిరేకత పెరిగిందని సర్వేలో స్పష్టం చేసింది. సీఎంగా ఆయనకు ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోందని.. ప్రస్తుతం 57 శాతం మంది ప్రజలు జగనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారంటే సర్వే చెప్పింది. ఇక జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రంలో ఏమాత్రం ప్రభావం చూపబోవని ఈ సర్వేలో వెల్లడైంది.

    మొత్తం 2,41,553 మంది అభిప్రాయాలను తీసుకుని.. 96,676 మందితో నేరుగా సర్వే చేసిన సిబ్బంది మాట్లాడినట్టు సమాచారం. ఆ అంశాలను ఇండియా టుడే చానల్‌ పూర్తిగా విశ్లేషించింది. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో వైఎస్సార్‌సీపీకి ప్రజలు ఘన విజయాన్ని అందిస్తే.. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌కు, ఆ పార్టీకి ప్రతి ఎన్నికలోనూ ఓట్ల శాతం పెరుగుతూనే వస్తోందని.. తాజాగా సీఓటర్‌–ఇండియా టుడే సర్వే.. ఏకంగా 57 శాతం మంది సీఎంగా వైఎస్‌ జగనే కావాలంటూ బలంగా కోరుకున్నట్లు స్పష్టం చేసింది.



    తాజా సర్వే చెబుతున్న లెక్క ప్రకారం ఏపీలో మళ్లీ వైఎస్ జగన్‌దే హవా కొనసాగే అవకాశం ఉంది. ముందుగా ఎంపీ సీట్ల విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. అధికార వైసీపీకి 18 ఎంపీ సీట్లు, ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి 7 సీట్లు దక్కే అవకాశం ఉందని తేల్చింది. అలాగే అసెంబ్లీ స్థానాల్లోనూ ఇదే విధమైన పరిస్థితి నెలకొందని క్లారిటి ఇచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 126 అసెంబ్లీ స్థానాలు వస్తాయని పేర్కొంది. ఇక మిగతా స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభావం చూపనున్నాయంది. అయితే అందులోనూ టీడీపీకి మిగిలిన సీట్లు వస్తాయని.. జనసేన, బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితయ్యే అవకాశం ఉందని తేల్చి చెప్పింది ఆ సర్వే..

    ఇదీ చదవండి : తిరుమలకు అనూహ్యంగా పెరిగిన రద్దీ.. సర్వ దర్శనానికి ఎంత టైం పడుతోంది అంటే?

    అయితే గత నెలల ఇండియా టీవీ సైతం సనర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 19 స్థానాలు, టీడీపీకి 6 స్థానాలు లభిస్తాయని పేర్కొంది. అలాగే వైసీపీకి 133 అసెంబ్లీ సీట్లు వస్తాయని ఇండియా టీవీ దేశ్ కీ ఆవాజ్ సర్వే అంచనా వేసింది.. అయితే ఇండియా సర్వేతో పోలిస్తే.. ఒక ఎంపీ సీటు.. 7 ఎమ్మెల్యే సీట్లు సీఎం జగన్ కు తగ్గినట్టే.. అది కూడా నెల రోజుల వ్యవధిలోనే ఇలా తగ్గడం విశేషం.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Chandrababu Naidu, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు