AP POLITICS WHO WILL BE GET CABINET BERTH IN YCP WOMEN MLAS ROJA TILL WAITING FOR MINSTER POST NGS BK
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ లో కొత్త మహిళా మంత్రులు ఎవరు..? రేసులో ఉన్నది వీరే..
మహిళా ఎమ్మెల్యేల్లో మంత్రి పదవి దక్కేదెవరికి..?
AP Cabinet Reshuffle: జగన్ కొత్త కేబినేట్ లో స్థానం కోసం మహిళా ఎమ్మెల్యేలు చాలామందే పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ముగ్గురు మంత్రులు.. తమ పదవికి రాజీనామా చేయక తప్పదని తెలుస్తోంది. మరి వారి స్థానంలో చోటు దక్కించుకునేది ఎవరు అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
M BalaKrishna, Hyderabad, News18. AP Cabinet Reshuffle: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కేబినేట్ లో మార్పులు చేర్పులు ఉంటాయన్నదానిపై అధినేత స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు. అది ఎప్పుడన్నది ఇంకా తేలాల్సి ఉంది. మార్పు తప్పదని తేలిపోవడంతో వైసీపీ (YCP) నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే మంత్రి పదవుల్లో ఉన్నవారు తమ పదవికి ఎలాంటి గండం వస్తోందో అని టెన్షన్ పడుతుంటే వచ్చే రెండేళ్లైన మంత్రిగా ఉండి కల నేరవేర్చుకునే అవకాశం వస్తుందో రాదో అని ఆశావాహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కేబినేట్ లోకి కొత్త మంత్రులను తీసుకునే అంశంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan Mohan Reddy) చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలతో అటు ఆశావాహులలో ఇటు ఇప్పటికే మంత్రులగా ఉన్న వారిలో టెన్షన్ మరింత పెరిగింది. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలలో ఈ సారి కేబినెట్ లో స్ధానం కోసం గట్టిపోటి నెలకొంది. పార్టీ నుండి మొత్తం 14 మంది మహిళా ఎమ్మెల్యేలుండగా.. వీరిలో పుష్పశ్రీవాణి, మేకతోటి సుచరిత, తానేటి వనితలకు జగన్ మొదటి కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. త్వరలో కేబినేట్ లో జరగబోయే మార్పులు చేర్పుల్లో దాదాపుగా ఈ ముగ్గురు మహిళా మంత్రులను బాధ్యతలనుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరి స్థానంలో ఎవరెవరికి అవకాశం దక్కుతుందనే అంశం ఇప్పుడు అటు పార్టీలోని ఇటు రాజకీయంగా చాలా ఆసక్తిగా మారింది.
జిల్లాల వారీగా మంత్రి పదవుల రేసులో ఉన్న ఎమ్మెల్యేలను ఒకసారి పరిశీలిస్తే.. ఉత్తరాంధ్ర నుండి రెడ్డి శాంతి ( తూర్పు కాపు), ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వి కళావతి, పుష్పశ్రీవాణి , భాగ్యలక్ష్మీ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీరిలో మంత్రి పదవి ఎవరి వరించబోతుందనేది ఉత్కంఠగా మారింది. ఉభయ గోదావరి జిల్లాలలో తానేటి వనిత ( SC), ఎన్.ధనలక్ష్మీ ( ST) లు ఉన్నారు. ఇక గుంటూరు జిల్లా నుండి మేకతోటి సుచరిత (SC), విడదల రజనీ (BC), ఉండవల్లి శ్రీదేవి (SC), అనంతపురం జిల్లా నుండి ఉషాశ్రీచరణ్ ( BC), జొన్నలగడ్డ పద్మావతి (SC),చిత్తూరు జిల్లా నుండి రోజా కి ఇప్పటికే జగన్ స్పష్టమైన హామీ ఇచ్చినట్టు ప్రచారం ఉంది.
కర్నూల్ జిల్లా నుండి కె. శ్రీదేవి, కడప జిల్లాలో దాసరి సుధ ( SC) ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న సీనియారిటీ , సామాజిక , ప్రాంతాల సమీకరణాలు దృష్ట్యా రోజా , రెడ్డి శాంతి , కళావతి, విడదల రజనీ , ఉషాశ్రీచరణ్, జొన్నలగడ్డ పద్మావతిలు మంత్రి పదవుల పేర్లు బలంగా వినబడుతున్నాయి.
ఉత్తరాంధ్రకే చెందిన సీనియర్ మంత్రి బొత్సను కొనసాగిస్తే రెడ్డి శాంతికి చోటు దక్కకపోవచ్చు. ఇటీవలే ఆమె సోదరుడికి ఎమ్మెల్సీ పదవి కూడా దక్కింది. సీనియర్ ఎమ్మెల్యేలు రాజన్నదొర లేదా తెల్లం బాలరాజు ( ST)ను మంత్రి వర్గంలో తీసుకుంటే ఎస్.టి వర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్యేలకు బెర్తు దక్కకపోవచ్చు. కొంతమంది మహిళా ఎమ్మెల్యేలకు కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా ఆయా జిల్లాల సమీకరణాల రీత్యా వారి ఆశలకు గండిపడే అవకాశం కనిపిస్తోంది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.