Home /News /andhra-pradesh /

AP POLITICS WHO LEAKED EX MINSTER ANIL KUMAR YADAV AUDIO CALL ON LOAN APP HARASSMENT NGS

Anil Kumar Yadav: కావాలనే ఆయన్ను టార్గెట్ చేస్తున్నారా? మరి మాజీ మంత్రి ఆడియో లీక్ చేసింది ఎవరు..?

మాజీ మంత్రి అనిల్ కుమార్ (ఫైల్)

మాజీ మంత్రి అనిల్ కుమార్ (ఫైల్)

Anil Kumar Yadav: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీలో గ్రూపు రాజకీయాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి ఆడియో లీక్ వ్యవహారంపై ఇప్పుడు అనుమానాలు పెరుగుతున్నాయి. ఆయన వాయిస్ లీక్ చేసింది ఎవరు..? ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nellore, India
    Anil Kumar Yadav: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఆన్ లైన్ లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు పెరిగాయి. వీరి బారిన పడి చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అయితే సంబంధం లేని వారిని సైతం కొందరు ఇరికిస్తున్నారు. వారి వేధింపులపై పోలీసులు నిఘా పెట్టినా ఆగడం లేదు. తాజాగా మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అప్పు చేయకపోయినా.. లోన్‌ యాప్‌ ఏజెంట్ల ఫోన్‌ వేధింపులకు బాధితుడిగా నిలిచారు. ఆయన ఫోన్‌ ఆడియో సంభాషణ బయటకు రావడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇదే
    అంశం వైసీపీలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ మంత్రి ఫోన్‌ ఆడియో ఎలా లీకైంది? పోలీసుల దగ్గర నుంచి ఎలా బయటకు వచ్చింది? ఎవరి ఆదేశాలు పనిచేశాయి? అనే ప్రశ్నల చుట్టూ ప్రస్తుతం చర్చ నడుస్తోంది. సమస్య తాడేపల్లి వరకు వెళ్లడంతో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.

    లోన్‌ యాప్‌ సంస్థల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ ఎలా ఉంటాయనేదానికి అద్దంపట్టే సంభాషణ ఇది. మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ను పదే పదే ఫోన్‌లో వేధించడం సంచలనంగా మారింది. ఆ విషయాన్ని మాజీ మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ విషయం లీక్‌ కాకుండా అనిల్‌ అండ్‌ కో జాగ్రత్త పడింది.



    ఆ ఆడియో బయటకు రావడం కలకలం రేగింది. అనిల్‌ శిబిరానికి మాత్రం ఆ ఆడియో లీకేజీ పెద్ద షాకే ఇచ్చిందట. ఇది ఎలా జరిగింది? మీడియాకు ఎవరు ఇచ్చారు? అని ఆరా తీస్తున్నారట. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలతో ఉన్న వర్గపోరుపై ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు ఆయన ఆడియో కావాలనే ఎవరో లీక్ చేశారన్న విషయం తాడేపల్లి వరకు వెళ్లినట్టు టాక్. లోన్‌ యాప్‌ ఏజెంట్ల నుంచి అనిల్‌తోపాటు మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డికి కూడా ఇలాగే ఫోన్లు వచ్చాయి. ఆ కాల్స్‌ మంత్రి పీఏ రిసీవ్‌ చేసుకున్నారు. దానిపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ఇదీ చదవండి : వరలక్ష్మీ వ్రతం మహత్యమా..? గడప ముందుకే వచ్చి పిండకుండానే పాలిస్తున్న గోమాత.. మీరే చూడండి

    మంత్రి కాకాణి ఫోన్‌ ఆడియో సంభాషణ బయటకు రాకపోవడం.. తన కాల్ రికార్డింగ్స్‌ మాత్రమే లీక్‌ కావడంతో అనిల్ వర్గం అనుమానాలు పెరగడానికి కారణమవుతోంది. తన ఆడియో ఎందుకు బయటకొచ్చిందన్నదే మాజీ మంత్రి ఆవేదన. సొంత పార్టీలోని ప్రత్యర్థి వర్గాల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తాడేపల్లికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అక్కడ నుంచి ఆడియో లీకేజీపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. అసలు మాజీ మంత్రి అనిల్‌ లోన్‌ యాప్‌ దగ్గర అప్పు చేయలేదు. అప్పుడు చేసిన వ్యక్తితో పరిచయం కూడా లేదు. వాళ్లే ఆయనకు ఫోన్‌ చేసి వేధించారు. అనిల్‌ ఫిర్యాదుతో లోన్‌ యాప్‌ నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. వాళ్ల నుంచి ఫోన్లు.. ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు కూడా. వాటిల్లోనే ఫోన్‌ వాయిస్‌ ఉందట. మరి.. పోలీసుల దగ్గరున్న వాయిస్‌ ఎలా బయటకు వచ్చిందన్నదే అనిల్ అండ్‌ కో ప్రశ్న..  ఎవరి ఆదేశాలతో బయటకు వచ్చింది? అనే క్రమంలో జిల్లా మంత్రి పాత్రపై అనిల్‌ వర్గం ఆరోపిస్తోంది.

    ఇదీ చదవండి : ఒక్కసారి ఈ జెండాను చూడాలంటే కష్టమే..? త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ.. పొడుగు ఎంతంటే?

    ఈ సమస్య తాడేపల్లిలోని పార్టీ పెద్దల దగ్గరకు చేరడంతో.. మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్‌ మధ్య ఉన్న విభేదాలు మరోసారి చర్చల్లోకి వస్తున్నాయి. కాకాణి వర్గం పిన్‌ డ్రాప్ సైలెన్స్‌లో ఉంటే.. అనిల్ శిబిరం మాత్రం కుతకుతలాడుతోంది. అందుకే ఫోన్‌ ఆడియో లీకేజీపై వైసీపీ పెద్దలు ఆరా తీస్తున్నట్టు సమాచారం.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Anil kumar yadav, AP News, Nellore Dist

    తదుపరి వార్తలు