YCP No 2: అంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీలో ఇప్పుడు నెంబర్ గేమ్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అధినేత జగన్ నెంబర్ వన్ అయితే.. నెంబర్ 2 ఎవరు..? అధికారంలోకి రాకముందు నెంబర్ 2గా విజయసాయి ఉంటే.. పార్టీ పగ్గాలు చేపట్టాక సజ్జల నెంబర్ టూగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ తాజాగా మారిన పరిణమాలు ఈ నెంబర్ గేమ్ ను మార్చుతున్నాయా..?
YCP No 2: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార వైసీపీ (YCP) అంటే వన్ మెన్ షో అని చెప్పాలి. మరో మాటకు ఛాన్స్ ఉండదు.. అధినేత జగన్ (Jagan) ఏది చెబితే అదే ఫైనల్.. అయితే ఆ తరువాత స్థానం ఎవరిది అన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పుడైతే ఆ ఇద్దరిలో ఎవరు నెంబర్ టు అంటూ వైసీపీ వర్గాలే చర్చించుకుంటున్నాయి.. ఎందుకంటే నెంబర్ 2 ఎవరు అని తెలిస్తే.. వారికే తమ సమస్యలు చెప్పుకుంటే బెటర్ అనే ఆలోచనలో వాళ్లు ఉన్నారు. ప్రస్తుతం పార్టీలో జగన్ కేబినెట్ లో కీలక మంత్రులైన పెద్దిరెడ్డి (Peddireddy), బొత్స (Botsa) సీనియర్లే.. కానీ వారి సేవలను రాష్ట్రం మొత్తానికి వినియోగించుకునే అవకాశం లేదు. పెద్ది రెడ్డిని చిత్తూరు జిల్లాకు, బొత్సాను ఉత్తరాంధ్ర వరకు మాత్రమే పరిమితం చేసే అవకాశం ఉంటుంది. ఇక కేబినెట్ లో లేకపోయినా ప్రస్తుతం జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉంటోంది. పాలన పరమైన వ్యవహరాల్లో నిర్ణయం తీసుకున్న వారిలో ముందున్నది సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) మొన్నటి వరకు ఆయనే పార్టీలో నెంబర్ టూ అనే ప్రచారం ఉంది. సీఎం కు ఏ చెప్పాలి అన్నా ముందు సజ్జల దర్శన చేసుకోవాల్సిందే అనే టాక్ ఉండేది. కానీ సడెన్ గా ఇప్పుడు మళ్లీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) తెరపైకి వచ్చారు. కారణం ఏంటి..?
విజయసాయి రెడ్డి అంటే జటన్ కు నమ్మిన బంటు లెక్క.. పార్టీ పెట్టకముందు నుంచి ఆయనకు రైట్ హ్యాండ్ గా ఉంటూ వచ్చారు. వైసీపీ ఆవిర్భవించాక.. అన్నీ ఆయనే చూసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. జగన్ తర్వాత పార్టీలో కీ రోల్ విజయసాయి రెడ్డిదే. ఎన్నికల ముందు.. పార్టీలో చేరికలన్నీ.. విజయసాయిరెడ్డి అండర్లోనే జరిగాయన్నది బహిరంగ రహస్యమే. అధికారంలోకి వచ్చాక మాత్రం.. వైసీపీలో విజయసాయిరెడ్డి పాత్ర తగ్గిందనే టాక్ ఉంది. ఉత్తరాంధ్రలో పార్టీ బాధ్యతలు, జాతీయస్థాయి వ్యవహారాలు చూసుకున్నారు. విశాఖకు, దానిపైనున్న జిల్లాలకు.. ఢిల్లీకి మాత్రమే పరిమితమయ్యారు.
పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ వెంట ఉన్నవిజయసాయిరెడ్డికి.. రాజ్యసభ సీటు ఇచ్చి.. కేవలం ఉత్తరాంధ్రకు సరిపెట్టడంపై.. పార్టీలోనే రకరకాలుగా చర్చ సాగింది. ఆయన్ను పక్కన పెట్టారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఇన్నాళ్లకు.. అంటే అధికారంలోకి వచ్చిన మూడేళ్లకు.. విజయసాయిరెడ్డిని పార్టీలో కీలకం చేశారు జగన్. కొద్ది రోజుల క్రితమే.. పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలు అప్పజెప్పారు. ఇప్పుడు కొత్తగా.. పార్టీ జిల్లా అధ్యక్షులకు.. కోఆర్డినేటర్గానూ నియమించారు. మొన్నటిదాకా ఈ బాధ్యతలను సజ్జలే చూసేవారు. ఇకపై.. విజయసాయి చూసుకుంటారు.
ఇక వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి జగన్ తర్వాత నెంబర్ టు లో కనిపించారు సజ్జల. నామినేటెట్ పోస్టుల విషయంలో కావచ్చు.. పార్టీ బాధ్యతల విషయంలోనూ.. వివిధ జిల్లాల్లో వర్గ పోరు విషయంలో.. ఇలా పార్టీకి సంబంధించిన ఏ వ్యవహారమైనా సజ్జల లేకుండా సీఎం నిర్ణయాలు తీసుకోలేదేమో..? న్యాయపరమైన, విధాన పరమైన విషయాల్లో సీఎంతో పాటు సజ్జల కూడా నిర్ణయాలు తీసుకునే సమయంలో పక్కనే ఉండేవారు.. ఉద్యోగుల ఉద్యమం సమయంలోనూ.. మొన్న కేబినెట్ కూర్పు విషయంలో.. తాజాగా పార్టీ అధ్యక్షుల నియామకం విషయంలోనూ సజ్జల మార్కు కనిపించింది అన్నది బహిరంగ రహస్యమే.
ఆ లెక్కన చూస్తూనే సజ్జలే నెంబర్ టు అనడంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. కానీ పార్టీలో సరైన గుర్తింపు కోసం.. ఇన్నాళ్లూ ఓపిగ్గా వెయిట్ చేసిన విజయసాయిరెడ్డిని.. ఇప్పుడు ఈక్వెల్ చేసేశారు. విజసాయికి పార్టీకి సంబంధించి కీలక వ్యవహారాలు అప్పజెప్పి.. ప్రాధాన్యత పెంచారు. ఇది.. ఒకరిని తగ్గించి.. మరొకరిని అందలమెక్కించడం కాదు. ఇద్దరు కీలక నేతలను.. బ్యాలెన్స్ చేయడమేనని వైసీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.