హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan vs Ali: ఆ మూడు చోట్లలో పవన్ పోటీ ఎక్కడ..? ప్రత్యర్థిగా అలీ ఢీ కొట్టేనా..?

Pawan vs Ali: ఆ మూడు చోట్లలో పవన్ పోటీ ఎక్కడ..? ప్రత్యర్థిగా అలీ ఢీ కొట్టేనా..?

పవన్ కళ్యాణ్, అలీ (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్, అలీ (ఫైల్ ఫోటో)

Pawan Kalyan vs ali: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే ప్లేస్ ఫిక్స్ అయ్యిందా..? ఆ మూడు చోట్లలో ఏది ఆయన తనకు సేఫ్ అనుకుంటున్నారు..? నిజంగానే చెప్పినట్టు.. పవన్ కు వ్యతిరేకంగా అలీ పోటీ చేసే అవకాశం ఉందా..?

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18.

Pawan vs Ali:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాల్లో బిజీ అయ్యాయి. ఇక గెలుపు గుర్రాలను రెడీ చేసే పనిలో పడ్డారు. అలాగే ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలి అన్నదానిపైనా లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పుడు జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) పోటీ చేసే సీటు పైనా జోరుగా చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడంతో.. ఈ సారి ఎన్నికలను పవన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందులోనూ ఈ సారి తెలుగు దేశం (Telugu Desam) తో పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో పవన్ గెలుపు పక్కా అని అంచనా వేస్తున్నారు.

ఇప్పటి వరకు పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నదానిపై క్లారిటీ లేదు. ఆయన అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు.. పొత్తులు.. సీట్లు పై పూర్తి క్లారిటీ వచ్చిన తరువాతే ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తాను అన్నదానిపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే జనసేన వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం ఆ మూడు స్థానాల్లో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంది అంటున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ఓ వార్త చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు అలి పవన్ కళ్యాణ్ పై పోటీ చేయాలి అనుకుంటున్నారంటూ ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇటీవల అలీ సైతం అదే మాట చెప్పాడు.. సీఎం జగన్ ఆదేశిస్తే పవన్ పై పోటీ చేయడానికి సిద్ధం అంటూ కామెంట్ చేశారు. దీంతో అది నిజమే అని.. ఆయన ఎదో అనుకోకుండా అన్నమాట కాదని.. కచ్చితంగా పవన్ పై పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడంటూ చర్చ జరుగుతోంది.

ఇదీ చదవండి : రథసప్తమికి జోరుగా ఏర్పాట్లు.. ఆ రోజు ఇలా చేస్తే కోరికలు తీరినట్టే

2019 ఎన్నికల సమయంలో అలీ వైసీపీ తరపున ప్రచారం చేశారు. కానీ అలీ ప్రచార బాట పట్టిన చోట్ల వైసీపీ ఓటమి చెందడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అప్పుడు కేవలం పార్టీ తరపున ప్రచారానికే పరిమితమైన అలీ.. ఇప్పుడు నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టాలని ఫిక్స్ అయ్యారు. అయితే నిజంగాన పవన్ కు వ్యతిరేకంగా పోటీ చేస్తారా..? లేక ఎదో అనుకుండా ఆ మాట చెప్పారా అన్నదానిపై చర్చ జరుగుతోంది.

ఇదీ చదవండి : మీరు ట్రాఫిక్ పోలీస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి

మరోవైపు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఈ మూడు నియోజకవర్గాల్లో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అందులో భీమవరం, పిఠాపురం, అనంతపురం అర్బన్ లలో ఒక ప్లేస్ నుండి పోటీ చేస్తారని జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ మూడు కాదంటే..? తిరుపతిలో పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. మరి అలీ వీటిలో ఒక నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఉందా..? ప్రస్తుతం మూడు చోట్లా బలమైన వైసీపీ సిట్టింగ్ లే ఉన్నారు. మరి వారిని తప్పించి అలీకి అవకాశం ఇస్తారా..? ఏదీ ఏమైనా పవన్ పై అలీ పోటీ పై క్లారిటీ రావాలి అంటే..? ముందు పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది తేలాల్సి ఉంది..

First published:

Tags: Ali, Andhra Pradesh, Ap cm jagan, AP News

ఉత్తమ కథలు