P Anand Mohan, Visakhapatnam, News18
Ganta Srinivasa Rao: ఏ రాజకీయ పార్టీకైనా గెలిచే నేతలే కావాలి అనుకుంటారు. అందుకే పార్టీలు, నియోజకవర్గాలతో సంబంధం లేకుండా విజయం సాధించేవారు అంటే.. వాళ్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. వారికి టైమ్ తో పాటు టైమింగ్ కూడా కలిసొస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న నేతల్లో అలాంటి వారు చాలా అరుదనే చెప్పాలి. ఆ ఉన్న కొద్దివారిలో కూడా ముందు వరుసలో గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) ఉంటారు. పార్టీ ఏదైనా, నియోజకవర్గం ఎక్కడైనా ఆయన ఎంటర్ అయితే గెలిచి తీరుతారు. ఇప్పటి వరకు అదే జరిగింది. విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District)లో ఎక్కడి నుంచి పోటీ చేసినా గంటా గెలుపు పక్కా.. గత ఎన్నికల్లో కూడా భీమీలి నుంచి విశాఖ నార్త్ కు వచ్చి కూడా గెలుపు తొడకొట్టారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ (TDP) ఓటమి పాలవడంతో అధికారం లేకుండానే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మధ్యలో పార్టీ మారతారన్న ప్రచారం జరిగినా ఆయన మాత్రం టీడీపీ ఉండీ లేనట్లుగా కంటిన్యూ అవుతున్నారు. అయితే తాజాగా వైసీపీ అధినేతపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. తరువాత విశాఖలోని పార్టీ కార్యాలయానికి వెళ్లి అందరితో టచ్ లో ఉండడం. తాజాగా అధినేతను ఎయిర్ పోర్టులో కలిసి స్వాగతం పలికారు కూడా..
2019 ఎన్నికల తరువాత నుంచి టిడిపిలో ఉన్నా.లేనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. అంతేకాదు గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరేందుకు ఆయన రకరకాల మార్గాల్లో ప్రయత్నం చేసినా, అదేది వర్కౌట్ కాలేదనే ప్రచారం ఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో టిడిపి లోనే కొనసాగుతూ వస్తున్నారు. కానీ పార్టీలో ఇమడలేకపోవడమో.. లేక అధికారంలో లేకపోతే ఇమేజ్ ఉండదని భావించారో కారణం ఏదైనా... ప్రత్యామ్నాయం కోసం చాలా కాలంగా ఎదురు చూశారు. దానికి తగిన సమయం రాకపోవడం, అదే సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం.. టీడీపీ కాస్త పుంజుకున్నట్టు నివేధికలు చెబుతుండడం.. దానికి తోడు పొత్తులు ఉంటే టీడీపీ గెలిచే అవకాశం ఉందని వైసీపీ నేతలే చర్చించుకుంటున్న తరుణంలో ఆయన నిర్ణయం మార్చుకున్నారనే ప్రచారం ఉంది.
ఇదీ చదవండి : పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. సీట్లపైనా పార్టీలకు క్లారిటీ
ఇలా అనేక లెక్కలు వేసుకున్న ఆయన తిరిగి టీడీపీలో యాక్టివ్ అయ్యేందుకు ఆయన ప్రయత్నించారు. దాని ప్రభామవే ఇటీవల ఆయన స్టేట్ మెంట్లు.. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేసినా, దానిని ఆమోదించక పోవడం తో సైలెంట్ గానే ఉంటున్నారు.
ఇదీ చదవండి : అదితికి అధినేత లైన్ క్లియర్.. పూర్తి యాక్టివ్ అయిన వారసురాలు
తాజాగా విశాఖపట్నంలో టిడిపి అధినేత చంద్రబాబు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు ఆ సమావేశానికి గంటా శ్రీనివాసరావు హాజరు కాలేదు. కానీ చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన సమయంలో ఆయనకు స్వాగతం చెప్పేందుకు గంటా శ్రీనివాసరావు వచ్చారు. అక్కడి వరకు బాగానే ఉంది.. కానీ తరువాత జరిగే ఏ కార్యక్రమానికి గంటా హాజరుకాలేదు. ఏదో మొహమాటానికి ఎయిర్ పోర్టులో పలకరించినట్టు కనిపించారు. కానీ తరువాత ఎక్కడా అధినేతతో స్టేజ్ ను షేర్ చేసుకోలేదు. దీంతో ఆయన మనసులో ఏం ఉందో అధినేతకు సైతం అంతు చిక్కడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Ganta srinivasa rao, TDP