హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ganta Srinivasarao: మాజీ మంత్రి గంటా పయనం ఎటు..? మహానాడుకు ఎందుకు డుమ్మా కొట్టారు..?

Ganta Srinivasarao: మాజీ మంత్రి గంటా పయనం ఎటు..? మహానాడుకు ఎందుకు డుమ్మా కొట్టారు..?

గంటా శ్రీనివాసరావు (ఫైల్)

గంటా శ్రీనివాసరావు (ఫైల్)

Ganta Srinivasrao: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రయాణం ఎంటు.. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఆయన.. ఇటీవల చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు.. అంటే మళ్లీ టీడీపీలోనే కొనసాగుతారని అనుకుంటుంటే.. మహానాడుకు డుమ్మ కొట్టారు.. మరి ఆయన మనసులో ఏముంది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇంకా చదవండి ...

  P Anand Mohan, Visakhapatnam, News18.

  Ganta Srinivasarao: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) గంటా శ్రీనావాస్ రావు (Ganta Srinivasarao) ది సపరేట్ స్టైల్.. మరే రాజకీయ నాయకుడుకి లేని ప్రత్యేకత ఆయన సొంతం. ఆయన ఏ పార్టీ తరపున నెగ్గినా.. అధికార పార్టీలోకి చేరుతారని ముద్ర ఉంది. అలాగే ఒకసారి నెగ్గిన నియోజకవర్గం కాకుండా కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందే టాలెంట్ గంటాకే సొంతం.. అతని వ్యూహం ఈ సారి బెడిసికొట్టిందో.. లేక వ్యూహం మార్చారో కానీ.. అధికార పార్టీ కండువా కప్పుకోలేకపోయారు. కారణం ఏదైనా సాధరణ ఎమ్మెల్యేగానే మూడేళ్ల కాలాన్ని సాగదీశారు. ఈ మూడేళ్లలో తను గెలిచిన పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడైనా పాల్గొన్నారా అంటే లేదనే చెప్పాలి.. ఒకటి రెండు సందర్భాల్లో మినహా.. అలా గంటా ఉండడానికి టీడీపీ అధిష్టానం (TDP Hi Command) తీరే కారణమని ఆయన అనుచరుల మాట.. ఇటీవల ఆయన తన రూటు మార్చారు.. తొలి రెండున్నరేళ్లు.. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)కి దూరంగా ఉన్న ఆయన.. ఈ మధ్యకాలమే.. జిల్లా పార్టీ కార్యాలయంలో దర్శనమిస్తున్నారు. అధికార వైసీపీపై విమర్శలు చేస్తున్నారు.. అదే సమయంలో ఎవరూ ఊహించని విధంగా పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ను పొగడ్తల్లో ముంచెత్తారు. మళ్లీ ఆయనే సీఎం అవుతారు అంటూ జోస్యం చెప్పారు. ఇలా గంటా మాటలు విన్నవారంతా.. మళ్లీ ఆయన టీడీపీలో యాక్టివ్ అవుతారని భావించారు. కానీ ఇంతలోనే అందరికీ షాక్ ఇచ్చారు ఆయన. తెలుగు దేశం పండుగలా భావించే మహానాడు (Mahanadu) కు ఆయన డుమ్మా కొట్టారు.. పార్టీ నేతలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహానాడుకు గంటా హాజరు కాకాపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది..

  ఆయన మహానాడుకు హాజరు కాకపోవడానికి ప్రధాన కారణం.. టీడీపీ అధిష్టానం తీరే అని ప్రచారం జరుగుతోంది. పార్టీలో కీలక నేతలకు కేటాయించే వరుసలో కాకుండా.. కేవలం ఎమ్మెల్యే హోదాలో ఏ గ్యాలరీ కేటాయించారని.. దీన్ని గంటా అవమానంగా భావించారని అందుకే ఆయన మహానాడుకు డుమ్మా కొట్టారనే ప్రచారం ఉంది. అయితే ఆయన మాత్రం తాను మహానాడుకు వ్యక్తిగత కారణాలతోనే హాజరు కాలేదని.. ఈ విషయాన్ని అధినేతకు చెప్పాను అంటున్నారు.

  ఇదీ చదవండి : సాధారణ రైతు కూతురు కానీ ఎందిరికో ఆదర్శం.. రెండో ప్రయత్నంలోనే సివిల్ ర్యాంక్

  మహానాడు విషయం పక్కన పెడితే.. ఆయన తరువాత ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. గంటా మొదటి నుంచి అనుసరిస్తున్న విధానాన్నే మరోసారి కూడా అమలు చేసే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు. ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా... రాబోయే  ఎన్నికల్లో నియోజకవర్గం మారుస్తారని జోరుగా పుకార్లు వినిపిస్తున్నాయి.

  ఇదీ చదవండి : సివిల్స్ లో మెరిసిన తెలుగు తేజం.. ఐదో ప్రయత్నంలో అద్బుతం విజయం.. ఎలా సాధ్యమైందంటే?

  ఈ సారి ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి గంటా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పూర్తిస్థాయి ప్లాన్ వేసుకున్నట్లు కూడా సమాచారం.  అందుకే... గాజువాక నియోజకవర్గం పరిధిలోని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమానికి గంటా తన పూర్తి మద్దతు ప్రకటించారని. స్థానికుల మద్దతు కూడగట్టుకునేందుకే... స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. తన ఎమ్మెల్యే పదవికి కూడా గంటా రాజీనామా చేస్తున్నట్లు కూడా లేఖను స్పీకర్‌కు పంపినట్లు సమాచారం. రాజకీయా వ్యూహాలు రచించడంలో గంటా అందె వేసిన చెయ్యి. అందుకే ముందుగానే గాజువాక నియోజకవర్గాన్ని గంటా సెలక్ట్ చేసుకున్నారని... ఇప్పటికే గాజువాకపై స్పెషల్ ఫోకస్ కూడా పెట్టినట్లు గంటా అనుచరుల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Ganta srinivasa rao, TDP, Vizag

  ఉత్తమ కథలు