Home /News /andhra-pradesh /

AP POLITICS WHAT IS THE FACT AYYANNA HOUSE DEMOLISHES AT NARSIPANTAM THIS IS IRRIGATION DEPARTMENT NGS VSP

Ayyanna Patrudu: మాజీ మంత్రి అయ్యన్న కబ్జా చేశారా..? ఇరిగేషన్ శాఖ ఏం చెప్పంది..? మంత్రి ఏమన్నారంటే?

గోడ కూల్చివేతపై అయ్యన్న సతీమణి పద్మావతి, కొడుకు రాజేశ్

గోడ కూల్చివేతపై అయ్యన్న సతీమణి పద్మావతి, కొడుకు రాజేశ్

Ayyanna Patrudu: తెలుగు దేశం సీనియర్ నేత.. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై కబ్జా ఆరోపణలు నిజమేనా..? ఆయన గోడను ఎందుకు అధికారులు కూల్చాశారు.. టీడీపీ నేతలు ఇది రాజకీయ కక్ష అంటున్నారు ఆధారాలు చూపిస్తున్నారు. వైసీపీ మంత్రులు కబ్జాకు పాల్పడితే ఊరుకోవాలా? అని ప్రశ్నిస్తున్నారు.. ఇంతకీ ఏది నిజం..?

ఇంకా చదవండి ...
    Ayyanna Patrudu: తెల్లవారుజాము నుంచి నర్సీపట్నం (Narsipatnam) లో హై టెన్షన్ నెలకొంది. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని అయ్యన్న ఇంటి వెనుకాల గోడను ఇరిగేషన్‌ అధికారులు కూల్చివేశారు. మొదట నిన్నరాత్రి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu) కి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. అంతేకాకుండా అయ్యన్న పాత్రుడి ఇంటి దగ్గర పోలీసులు ఆంక్షలు విధించారు. అనుమతి లేదంటూ మీడియాను.. ఇతర టీడీపీ నేతలను (TDP Leaders) అడ్డుకున్నారు. కానీ అధికారులు అక్రమంగా బుల్డోజర్ పెట్టి తమ గోడను కూల్చివేశారని అయ్యన్న కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఇటు టీడీపీ నేతలంతా జగన్ సర్కార్ (Jagan Government) తీరుపై మండిపడ్డారు. కక్షసాధింపులో భాగంగానే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అయితే.. ఇటీవల చంద్రబాబు నాయుడు (Chandrabau Naidu) టూర్ కు వచ్చిన ఆదరణ చూసి తట్టుకోలేక.. ఇలాంటి కక్షలకు తెరలేపుతున్నారంటూ మండిపడ్డారు. ఇక ఇతర టీడీపీ నేతలైతే.. మీరు ఒక ఇంటిని కూలగొడితే.. మేం పది ఇళ్లు కూలదోస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. నేపథ్యంలో ఇరిగేషన్‌ శాఖ వివరణ ఇచ్చింది.

    రావణాపల్లి రిజర్వాయర్ బ్రాంచ్ ఛానెల్, నీలంపేట ఛానెల్, నర్సీపట్నం పట్టణ పరిధిలోని శివపురం దగ్గర నీలంపేట ఛానెల్ కు సంబంధించి ఇరిగేషన్ శాఖ గోడలు నిర్మించింది. అయితే.. సరిగ్గా ఈ గోడ కట్టిన చోటే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి నిర్మాణం చేశారన్నది ప్రధాన ఆరోపణ.. ఆ ఆరోపనలు నిజమే అంటూ.. ఇరిగేషన్ శాఖ గోడలపైనే అయ్యన్న పాత్రుడు బేస్ మెంట్ నిర్మించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఛానెల్ ఒడ్డున ఉన్న నదిలోకి పది అడుగుల వరకు ఆక్రమించారని ఇరిగేషన్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆక్రమణకు సంబంధించిన ఫోటోలను కూడా ఇరిగేషన్ శాఖ విడుదల చేసింది.



    తెలుగు దేశం పార్టీ నేతల విమర్శలను మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఖండించారు. అయ్యన్నపాత్రుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు మంత్రి. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. చంద్రబాబు అసలు ఏ పార్టీ నుండి వచ్చారు? టీడీపీలోకి వెళ్లి ఆ పార్టీని కబ్జా చేసిన వ్యక్తి చంద్రబాబు. పార్టీని, బ్యాంకు బ్యాలెన్స్ కబ్జా చేసిన వ్యక్తి చంద్రబాబని.. అందుకే పార్టీ నేతలు కూడా అదే బాటలో నడుస్తున్నారని విమర్శించారు.

    ఇదీ చదవండి : మీరు ఒక్క ఇంటిని కూల్చితే.. మేం పది ఇళ్లు కూలుస్తాం.. వైసీపీ నేతల్ని తరిమి కొడతాం..

    చంద్రబాబు తరహాలోనే అయ్యన్నపాత్రుడు నడుస్తున్నారని.. టీడీపీ నేతలే తప్పు చేసి దాన్ని బీసీలపై రుద్దటం ఏంటని ఆయన ప్రశ్నించారు. బీసీలు సెక్రటేరియట్ కి వస్తే తోక కట్ చేస్తానన్న వ్యక్తి చంద్రబాబు, అలాంటి వ్యక్తి బీసీలకి ఎలా న్యాయం చేస్తాడని? నిలదీశారు. రిషితేశ్వరి, వనజాక్షిపై దాడుల కేసుల్లో చంద్రబాబు ఏం చేశారో ప్రజలంతా చూశారని.. కానీ జగన్ వచ్చాకే బీసీలకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతోందని గుర్తు చేుశారు. చంద్రబాబు బీసీలను ఓట్లేసే యంత్రాలుగానే చూశారన్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Ayyannapatrudu, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు