Home /News /andhra-pradesh /

AP POLITICS WHAT IS THE CHNDRABABU NAIDU STAND ON ALLIANCE WITH JANANSENA NGS

Chandrababu: జనసేనతో పొత్తు విషయంలో చంద్రబాబు ఏం చేయబోతున్నారు..? ఆ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందా..?

సీట్లపై నేతలకు చంద్రబాబు క్లారిటీ

సీట్లపై నేతలకు చంద్రబాబు క్లారిటీ

Chandrababu Naidu: వచ్చే ఎన్నికల్లో పొత్తుల అంశంపై పవన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాశారు.. తెలుగు దేశం పార్టీ ముందు మూడు ఆప్షన్లు పెట్టారు.. మరి ఆ మూడు ఆప్షన్లకు టీడీపీ అధినేత చంద్రబాబు రియాక్షన్ ఏంటి. ఇప్పటి వరకు ఆయన ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదు. కానీ ఇప్పటికే దీనిపై ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది టీడీపీ వర్గాల్లో.

ఇంకా చదవండి ...
  Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ప్రస్తుతం ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. దాదాపు అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాయి. ప్రత్యర్థి పార్టీలతో పోల్చుకుంటే అధికార వైసీపీ అందరికంటే దూకుడుగానే ఉంది. ప్రభుత్వ పరంగా చూస్తే కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తైంది. ఎన్నికల టీంను తయారు చేస్తూ.. జగన్ తన కేబినెట్ 2ను విస్తరించారు.. మాజీ మంత్రులు.. కీలక నేతలకు.. పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఇలా ఎన్నికలకు సర్వం సమాయత్తం చేస్తూనే.. మరోవైపు గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) పేరుతో నేతలంతా ప్రజల్లోనే తిరుగుతున్నారు. త్వరలోనే సీఎం జగన్ (CM Jagan) సైతం జనం బాట పట్టేయోచనలో ఉన్నారు. ఇక విపక్షాలు సైతం దూకుడు పెంచాయి.  తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party).. మహానాడు సక్సెస్ తరువాత ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు.. జిల్లాల పర్యటనకు అనూహ్య స్పందన వస్తోంది. ఇదే జోష్ తో బస్సు యాత్రకు ఆయన సిద్ధమవుతున్నారు. మరోవైపు నారా లోకేష్ (Nara Lokesh) సైతం.. ప్రజా యాత్రకు సై అంటున్నారు. కేవలం వైసీపీ, టీడీపీలే కాదు.. జనసేన సైతం ఎన్నికలకు సై అంటే సై అంటోంది. ఇప్పటికే కౌలు రైతులకు సాయం పేరుతో పవన్ కళ్యాణ్ జనంలోనే ఉంటున్నారు. ఇక దసరా తరువాత పవన్ భారీ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా రెడీ అయ్యింది. ఇలా అన్ని పార్టీలు ఢీ అంటే ఢీ అంటూ ఎన్నికల సమర శంఖం పూరిస్తున్నాయి.

  ఓ వైపు ఎన్నికల్లో గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూనే.. మరోవైపు పొత్తుల లెక్కల్లో బిజీ అయ్యారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్.. ముందస్తుగా 2023 వ సంవత్సరం లోనే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండడం తో రాష్ట్రము లో ఉన్న రాజకీయ పార్టీలు ఇప్పటి నుండి వ్యూహాత్మకంగా అడుగుగులు వేస్తున్నాయి..  ముఖ్యంగా అధికార పార్టీపై వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని..యాంటీ వోట్ బాంక్ ని తమ వైపు తిప్పుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ భావిస్తోంది. ఇందులో భాగంగా జనసేనతో పొత్తు పెట్టుకుంటే.. తప్పకుండా ఫలితం ఉంటుందని లెక్కలు వేసుకున్నారు. మొదటిలో చంద్రబాబు, పవన్ సైతం ఇదే అభిప్రాయంతో ఉండేవారు.. కానీ ఇప్పుడు వారి స్వరంలో మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు త్యాగాలకు సిద్ధం అని సంకేతం ఇచ్చిన రెండు పార్టీల అధినేతలు.. ఇప్పుడు మేం ఎందుకు తగ్గాలి అంటున్నారు.

  ఇదీ చదవండి : ఒకేసారి సొంత ఇంటికోసం ఇద్దరు మాజీ సీఎం అడుగులు.. ఇద్దరి టార్గెట్ ఒక్కటే

  ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా..? ఉండదా అన్నది చాలా ఉత్కంఠ పెంచుతోంది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు భారీ బహిరంగ సభ పెట్టిన పవన్ కళ్యాణ్.. భవిష్యత్తులో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చబోము అని చెప్పి.. టీడీపీతో పొత్తుకు సిద్ధం అనే సంకేతాలు పంపారు. అయితే మహానాడు సక్సెస్ తరువాత టీడీపీ వార్ వన్ సైడ్ అంటూ ప్రకటనలు చేసింది. దీంతో జనసేన సైతం అదే స్థాయిలో స్వరం మార్చింది.

  ఇదీ చదవండి : అధికార పార్టీ దూకుడికి ఆ జిల్లాలో స్పీడ్ బ్రేకర్లు.. సొంత నేతలే అడ్డుపడుతున్నారా..?

  2014లో మేమే వెనక్కు తగ్గాం.. మళ్లీ తామే ఎందుకు వెనక్కు తగ్గాలి అన్నది.. టీడీపీ ఆలోచించుకోవాలని పరోక్షంగా చెప్పారు జనసేనాని.. అక్కడితో ఆగకుండా కొన్ని రోజుల తరువాత.. టీడీపీకి మూడు ఆప్షన్లు పెట్టారు.. దీంతో తెలుగు దేశం పార్టీ డైలామాలో పడింది. ఇలా పవన్ కండిషన్లు పెడితే.. భారీగా త్యాగాలు చేయక తప్పదని ఫిక్స్ అయ్యింది. దీంతో అప్పటి నుంచి రెండు పార్టీల అధినేతలు పొత్తులు ఉంటాయని చెప్పడం లేదు.. ఒంటరిగానే పోరాడుతున్నామంటున్నారు.

  ఇదీ చదవండి : బీజేపీ సీనియర్ నేత దారి ఎటు..? ఆయన తీరుపై సొంత కేడర్ అసంతృప్తిగా ఉందా..? కారణం ఏంటంటే?

  పవన్ పొత్తుల విషయంలో వెనుకడుగు వేయడానికి బీజేపీ కారణమనే ప్రచారం ఉంది. ఇటీవల బీజేపీ ఇచ్చిన రూట్ మ్యాప్ లో.. టీడీపీతో కలిసి వెళ్లొద్దని.. 2024 లక్ష్యంగా కాకుండా 2029 లక్ష్యంగా పని చేయాలని జనసేనకు సూచించినట్టు సమాచారం. ప్రస్తుతం వైసీపీని ఓడించి.. టీడీపిని గెలిపించాల్సిన అవసరం అయితే తమకు లేదనే విధంగా రూట్ మ్యాప్ లో చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే రాజకీయ పరంగా.. లేదా ఆర్థిక పరంగా ఏదైనా సహాయం కావలంటే బీజేపీ అండగా నిలుస్తుందని చెప్పినట్టు సమాచారం. దీంతో ఇప్పుడు పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు చంద్రబాబు నాయుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో ఒక్క వార్త తెగ హల్చల్ చేస్తుంది.. అదేంటంటే రొటేషన్ పద్దతి లో అధికారం ని షేర్ చేసుకోవడానికి అయితే పొత్తుకు సిద్ధం అని సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.. ఏదీ ఏమైనా పవన్ ను త్వరలోనే కలిసి.. సమస్య ఏంటి.. జనసేన డిమాండ్లు ఏంటి అన్నది తెలుసుకున్న తరువాతే.. ఏదైనా హామీ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారంటూ.. రెండు పార్టీల మధ్య టర్మ్స్ కుదిరితే.. అధికారికంగా ఇద్దరు నేతలు ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు