హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics : ఏపీలో బీజేపీ మూడు నెలల ప్లాన్ ఏంటి.. ప్రతి వ్యూహాల్లో వైసీపీ ప్రభుత్వం

AP Politics : ఏపీలో బీజేపీ మూడు నెలల ప్లాన్ ఏంటి.. ప్రతి వ్యూహాల్లో వైసీపీ ప్రభుత్వం

ఏపీలో బీజేపీ మూడు నెలల ప్లాన్ ఏంటి.. ప్రతి వ్యూహాల్లో వైసీపీ ప్రభుత్వం

ఏపీలో బీజేపీ మూడు నెలల ప్లాన్ ఏంటి.. ప్రతి వ్యూహాల్లో వైసీపీ ప్రభుత్వం

AP Politics : ఎన్నికల టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. తాజాగా మూడు నెలల అంశం ఒకటి వైసీపీలో అంతర్మథనానికి కారణమైంది. అదేంటి? దానిపై వైసీపీ ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది? తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

AP Politics : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతోందనే ప్రచారం మొదలైంది. ఇందుకు కొన్ని అంశాలు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఐతే.. వైసీపీ ప్రభుత్వానికి 2024 మే వరకూ ఐదేళ్లు పూర్తవుతాయి. అంటే.. ఇంకా 18 నెలల టైమ్ ఉంది. కానీ అంతవరకూ పాలన కొనసాగించకుండా.. ముందే ఎన్నికలకు వెళ్లిపోవడం మేలనే అభిప్రాయంలో వైసీపీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా చేసిన ఓ ప్రకటన.. వైసీపీలో కలకలం రేపినట్లు తెలుస్తోంది.

ఈమధ్య ఓ టీవీ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన సోమూ వీర్రాజు.. తాము ఏపీలో అధికారంలోకి రావడానికి మూడు నెలలు చాలు అన్నారు. ఈ కొద్ది కాలంలోనే అంతా తారుమారు అయిపోతుందనీ.. వైసీపీ ప్రభుత్వం గద్దె దిగిపోయి.. తాము అధికారంలోకి వచ్చేస్తామని అన్నారు. అప్పటివరకూ వాళ్లు మైండ్ గేమ్ ఆడుతున్నట్లే.. మేమూ మైండ్ గేమ్ ఆడతామని అన్నారు. దీనిపై వైసీపీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి.. బీజేపీ వేచి చూసే ధోరణి అవలంభిస్తూ.. 2024 ప్రారంభం నుంచి వైసీపీపై రాజకీయ ఎటాక్ చేసే అవకాశం ఉందనే వాదన వైసీపీ వర్గాల్లో ఉంది. అలా బీజేపీ వేసుకున్న ప్లాన్‌ను దెబ్బ కొట్టాలంటే.. 2023లోనే ఎన్నికలకు వెళ్లిపోవడం బెటర్ అనే అభిప్రాయం పార్టీలోని కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది.

జోరుగా ప్రతిపక్షాలు :

ఇటు జనసేన , అటు టీడీపీ కూడా ఎన్నికలకు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాయి. పాదయాత్రలు, ర్యాలీలు, మీటింగ్‌లతో క్షేత్రస్థాయిలో మరింత బలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఐతే.. ఎన్నికలకు ఇంకా టైమ్ ఉందనే ఉద్దేశంతో... ప్రతిపక్షాలు కాస్త నెమ్మదిగా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి. ఇవి 2024లో ఎన్నికల నాటికి రెడీ అవుతున్నాయి. ఈ వ్యూహాలకు దెబ్బ కొడుతూ.. 2023లోనే ఎన్నికలకు వెళ్లిపోతే.. ప్రతిపక్షాలకు దెబ్బ కొట్టినట్లు అవుతుందనే అభిప్రాయం పార్టీలోని కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. 2018లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలాంటి వ్యూహంతోనే భారీ విజయం సాధించారని చెబుతున్నారు.

తేడా ఏముంది? :

ఇప్పుడు ఏపీలో మరో వాదన కూడా వైసీపీని కలవర పరుస్తోంది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ఐదేళ్లలో రాజధానికి సంబంధించి ఎలాంటి చెప్పుకోతగ్గ అభివృద్ధీ చెయ్యలేదనీ.. అందువల్ల ప్రజలు వైసీపీకి అధికారం ఇస్తే.. వైసీపీ కూడా ఈ మూడున్నరేళ్లలో రాజధానికి సంబంధించి ఎలాంటి ప్లానూ లేకుండా.. కాలయాపన చేసిందనీ.. వచ్చే 18 నెలల్లో కూడా ఇలాగే కానిచ్చేస్తే.. మరో ఐదేళ్లు వృథా అయిపోయినట్లే అవుతుందనే అభిప్రాయం ప్రజల్లో ఉందని వైసీపీ భావిస్తోంది. ప్రజలు ఇలాగే భావిస్తే.. తిరిగి టీడీపీ వైపు చూసే ప్రమాదం ఉంటుంది కాబట్టి.. నవరత్నాల పథకాలను పక్కాగా అమలు చేస్తూ.. త్వరగా ఎన్నికలకు వెళ్లడం ద్వారా మరోసారి అధికారాన్ని దక్కించుకోవచ్చనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది.

China - Covid 19 : చైనాలో భారీ క్వారంటైన్ క్యాంప్ .. జోరుగా కొత్త కేసులు

ఇలా ఏపీ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. ఏపీలో కంటే తెలంగాణలో ముందుగా ఎన్నికలు రావాల్సి ఉంది. కానీ రాజకీయ వేడి.. తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువగా ఉందనే వాదన వినిపిస్తోంది.

First published:

Tags: AP News, Somu veerraju, Telugu news, Ys jagan

ఉత్తమ కథలు