AP Politics: అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అంటే ఇదేనేమో.. ఎందుకంటే ఏపీకి చెందిన ఇద్దరు సీనియర్ రాజకీయ నేతల పరిస్థితి చూస్తే సరిగ్గా వారికి సూటవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు వారిద్దరు ఏపీ రాజకీయాలతో పాటు.. జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. అయితే పాలిటిక్స్ లో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. అధికారం ఉంటే అందలం.. లేకుంటే ఏమీ చేయలేం అనే పరిస్థితి ప్రతి రాజకీయ నాయకుడికి ఎదురవుతుంది. కొంతమంది నేతలకు వారు తీసుకునే నిర్ణయాలే ప్రతికూలంగా మారుతుంటాయి. ప్రస్తుతం ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఆ ఇద్దరు నేతలకు బాగా అర్ధమైనట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల తరువాత ఎదో ఆశించి పార్టీ మారితే... అప్పటి నుంచి ఇప్పటి వరకు వరకు వారు ఆశించిన లబ్ధి చేకూరకపోవడంతో ఏమీ చేయలేక మౌనమే బెస్ట్ అనుకుంటున్నారట.
2019 ఎన్నికల్లో టీడీపీ (TDP) ఘోర పరాభవం తరువాత బిజేపీ కండువా కప్పుకున్న సీఏం రమేష్ (CM Ramesh), సుజాన చౌదరి (Sujana Chowdary) ఇప్పుడు ఎక్కడున్నారు అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం వారి పేర్లు ప్రస్తావన కూడా ఎక్కడా వినిపించడం లేదు. ఏపీ లో ప్రస్తుతం పొలిటికల్ హీట్ నడుస్తోంది. ప్రధాని మోదీ సైతం ఏపీకి వస్తున్నారు. ఆయన సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలోనూ ఆ ఇద్దరి నేతల ప్రస్తావనే ఎక్కడా వినిపించడం లేదు.
ముఖ్యంగా గత కొంతకాలంగా ఏపీలో పొత్తులపై చర్చ జరుగుతోంది. చంద్రబాబు సైతం జనసేన, బీజేపీతో కలిసి పోటీకి వెళ్లడమే మేలు అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ నో అన్నా జనసేనతో కలిసి వస్తే మంచి ఫలితాలు వస్తాయన్నది ఆయన అంచనా.. అయితే బీజేపీ కేంద్ర పెద్దలకు మాత్రం టీడీపీతో కలిసి వెళ్లడం ఇష్టం లేదు అనే ప్రచారం ఉంది.
బీజేపీ పొత్తుకు దూరంగా ఉండడమే కాదు.. పవన్ ను సైతం టీడీపీకి దూరం చేసే ప్రయత్నం చేస్తోందనే ప్రచారం ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బీజేపీని టీడీపీకి దగ్గర చేస్తారని భావించిన ఆ ఇద్దరు నేతలు పూర్తిగా మౌన దీక్షలో ఉన్నారు. మొన్నటి వరకు చంద్రబాబు నమ్మకం కూడా అదే అని టీడీపీ వర్గాల్లో టాక్ నడిచింది. సుజనా చౌదరి.. సీఎం రమేష్ లు.. బీజేపీ పెద్దలను ఒప్పిస్తారని తెలుగు తమ్ముళ్లు భారీ ఆశలు పెట్టుకున్నాురు.. కానీ వాస్తవం అందుకు విరుద్దంగా ఉంది. వారిని బీజేపీ పెద్దలు లైట్ తీసుకుంటున్నారనే టాక్ ఉంది. అందుకే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోనే వారు సైలెంట్ గా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap bjp, AP Politics, CM Ramesh, Sujana Chowdary, TDP