AP Employess Fight: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సర్కార్ వర్సెస్ ఎంప్లాయీస్ (Government vs employees) పోరు మరింత తీవ్రం అవుతోంది. ఎన్ని సార్లు చర్చలు జరిగినా.. ఉద్యోగుల డిమాండ్లు నెరవేరడం లేదు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ఎందుకంటే ఫస్టు తారీఖు వెళ్లినా జీతాలు రాని పరిస్థితి. జీతం ఎప్పుడొస్తుందా..? అని ఎదురు చూడాల్సిన దుస్థితి.. అంతేకాదు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల గురించి కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేకపోవడంతో ఉద్యోగులు లేని ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల దుస్థితి అంతా ఇంతా కాదు అంటున్నాయి కొన్ని ఉద్యోగ సంఘాలు.
ముఖ్యంగా తమకు రావాల్సిన బకాయిల కోసం ఉద్యోగ సంఘాల నేతలు తమ గోడును గవర్నర్ కు విన్నవించుకున్నారు. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి అంటూ గవర్నర్ బిశ్వభూషన్ కు కలిసారు.
ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను… పేరుకుపోయిన జీపీఎఫ్, మెడికల్ క్లయిమ్స్, డీఏలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం చెల్లించడం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు వాపోయారు. వెంటనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వానికి మార్గనిర్దేశనం చేయాలని గవర్నర్ ను కోరారు.
ఇదీ చదవండి : చిరంజీవి కాంగ్రెస్‌తోనే కొనసాగుతారా..? రాహుల్‌కి రాసిన ఆ లేఖలో ఏముంది..?
అయితే గవర్నర్ కు ఫిర్యాదు చేసి కేవలం ఊరుకోవడమే కాదు.. ఏపీ ఉద్యోగులు మళ్లీ ఉద్యమ బాట పడుతున్నారు. కలిసి పోరాటం చేయాల్సిన సంఘాల నేతలే ఇప్పుడు కయ్యానికి దిగుతున్నారు. ఇప్పటికిప్పుడు పోరాటం చేయాలా? వద్దా? అనే విషయంలోనే గొడవ పడుతున్నారు. ఒక సంఘం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తే మరో సంఘం తీవ్రంగా తప్పుబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వెనుక ఏదో శక్తి ఉందన్న ఎన్జీవోల సంఘం ఆరోపణ సంచలనం రేపుతోంది. గతేడాది ఉమ్మడిగా పోరాటం చేసిన సంఘాల నేతల మధ్య ఇప్పుడు చిచ్చు పెడుతోంది ఎవరు? నిజంగానే ఉద్యోగ సంఘాల్ని కొన్ని శక్తులు నడిపిస్తున్నాయా?
ఇదీ చదవండి : వైసీపీకి ఏపీ ప్రజలు మరో ఛాన్స్ ఇస్తారా..? మైనస్.. ప్లస్ పాయింట్లు ఏంటి..?
2022 ప్రారంభంలో కలిసి పోరాటం చేసి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని ఒప్పించి ఏపీలోని ఉద్యోగ సంఘాల నేతల మధ్య ఇప్పుడు తీవ్రమైన విభేదాలు వచ్చాయి. ప్రభుత్వాన్ని కాదని గవర్నర్ దగ్గరకు వెళ్లి ఒక సంఘం నేతలు ఫిర్యాదు చేయడం పెద్ద రచ్చకే దారితీస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న సూర్యనారాయణ గవర్నర్ హరిచందన్‌ను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. జీతాల కోసమే అడుక్కునే పరిస్థితి వస్తే ఇక పోరాటం తప్పదని డేట్‌లు కూడా ప్రకటించారు. అయితే ఏపీ ఎన్జీవోల సంఘం అభిప్రాయం వేరేలా ఉంది. ఇప్పటికిప్పుడు పోరాటం చేయొద్దని ప్రభుత్వంతో సఖ్యంగా ఉండి పనులు చేయించుకోవాలన్నది ఆ సంఘం వాదన.. కానీ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం మాత్రం వెనక్కు తగ్గేదేలే అంటోంది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, AP News, Employees