Home /News /andhra-pradesh /

AP POLITICS VZM ASHOK GAJAPATHI RAJU AS NEW TRUST BOARD CHAIRMAN WHAT ABOUT SANCHAITHA NGS VZM

Ashok Gajapathi Raju: పంతం నెగ్గించుకున్న అశోక్ గజపతి రాజు.. మరి సంచయిత భవిష్యత్తు ఏంటి..?

సంచయిత భవిష్యత్తు ఏంటి..?

సంచయిత భవిష్యత్తు ఏంటి..?

Asokh Gajapati Raju: మాజీ కేంద్ర మంత్రి.. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తన పంతం నెగ్గించుకున్నారు. సింహాచలం దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా ప్రభుత్వమే ఆయనను నియమించాల్సి వచ్చింది. అయితే మరి సంచయిత భవిష్యత్తు ఏంటన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

ఇంకా చదవండి ...
    Ashok Gajapathi Raju:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు (Ashok Gajapati Raju) వర్సెస్ ఏపీ ప్రభుత్వం (AP Government) అన్నట్టు సాగిన వివాదానికి ఇక తెరపడుతుందా..? ఎందుకంటే ఆయన చేసిన.. రాజకీయ, న్యాయ పోరాటలు గెలుపొందాయి.  వద్దు అంటూ పక్కన పెట్టిన ప్రభుత్వమే. ఆయనను పాలకమండలి చైర్మన్ గా తిరిగి పునర్ నియమించింది. తాజాగా విశాఖ జిల్లా (Visakha District)లోని సింహాచలం ఆలయానికి (Simhachalam Temple) కొత్త పాలకవర్గాన్ని నియమించింది. రెండేళ్ల కాలపరిమితితో పాలకవర్గాన్ని నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజును ఛైర్మన్‌గా కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  మరో 14 మందిని పాలకమండలి సభ్యులుగా నియమించింది.

     అశోక్‌ గజపతిరాజు విషయంలో గతంలలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చనీయాంశం కావడం, కోర్టుల్లో ప్రభుత్వానికి మొట్టికాయలు పడడంతో... ఈసారి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నియామకం చేపట్టింది.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చి 2020లో సింహాచలం, రామతీర్ధం వంటి దేవస్ధానాల ట్రస్ట్ బోర్డులను, మాన్సాస్ ట్రస్ట్ బోర్డును రద్దు చేస్తూ.. కొత్త పాలకమండళ్లను నియమించింది. పూసపాటి వంశ పారంపర్యంగా వస్తున్న వారి కుటుంబ సభ్యులను ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమించాలన్న నిబంధనలను అణుగుణంగానే .. గత ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజును ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా తొలగిస్తూ.. సింహాచలం, రామతీర్ధం సహా ఆలయాలు, మాన్సాస్ ట్రస్ట్ బోర్డుల ఛైర్‌పర్సన్‌గా ఆనందగజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును నియమించింది.

    ఇదీ చదవండి : కొత్త మంత్రుల జాబితా రెడీ? మళ్లీ కొనసాగేది ఎవరు.. ఏ లెక్కన ఎవరికి ఛాన్స్..?

    అలాగే ఆమెతో పాటు, సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రాత్రికి రాత్రి జీవోలను ఇచ్చి.. ఆ జీవోలను ప్రభుత్వ వెబ్ సైట్ లో పెట్టకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. ఇలా ప్రభుత్వ నిర్ణయాలు.. అప్పట్లో విమర్శల పాలయ్యింది. అయితే రొటేషన్ పద్ధతిలో సంచయితకు అవకాశం ఇచ్చినట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఆ వెంటనే ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్‌గా తనను తొలగించడాన్ని సవాల్ చేస్తూ అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఛైర్మన్‌ను నియమించిందని.. వంశ‌పార‌ప‌ర్యంగా వ‌స్తున్న ట్ర‌స్టు కాబట్టి వ‌య‌సులో పెద్ద‌వారు ట్ర‌స్టీగా ఉండాల‌ని కోర్టుకు వివరించారు. ప్రభుత్వం కూడా తాము నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే నియామ‌కం చేశామ‌ని వాదించింది. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్నా హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టివేసి అశోక్ గజపతిరాజును పునర్నియమించాలంటూ ఆదేశించింది.

    ఇదీ చదవండి : పంతం నెగ్గించుకున్న అశోక్ గజపతి రాజు.. మరి సంచయిత భవిష్యత్తు ఏంటి..?

    సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సంచయిత గజపతి రాజు, ఏపీ సర్కార్ డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించింది. విచారణ జరిపిన డివిజన్ బెంచ్ కూడా .. ఏపీ ప్రభుత్వానికి, సంచయిత గజపతిరాజుకు షాకిచ్చింది. మాన్సాస్‌ చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజును కొనసాగించాలని హైకోర్టు కొద్ది నెలల క్రితమే ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం, సంచయిత గజపతి రాజు వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. మాన్సాస్‌ చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు కొనసాగుతారని సింగిల్ బెంచ్‌ గతంలో ఇచ్చిన తీర్పును సీజే డివిజనల్ బెంచ్‌ సమర్థించింది. ఇక తప్పని సరి పరిస్థితుల్లో అశోక్ గజపతినే చైర్మన్ గా కొనసాగిస్తూ.. మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది జగన్ సర్కార్.

    ఇదీ చదవండి : తెలివిమీరుతున్న దొంగలు.. సిగ్నల్ వైర్ కట్ చేసి మరి ఎక్స్ ప్రెస్ రైల్లో భారీ దోపిడీ

    ప్రస్తుతం నియమించిన ట్రస్ట్ బోర్టులో సభ్యులుగా పంచాది పద్మ, వంకాయల సాయినిర్మల, శ్రీదేవివర్మ పెన్మత్స, సువ్వాడ శ్రీదేవి, దశమంతుల రామలక్ష్మి, ఎం.రాజేశ్వరి, సంపంగి శ్రీనివాసరావు, పిల్లా కృష్ణమూర్తిపాత్రుడు, కె.నాగేశ్వరరావు, బయ్యవరపు రాధ, దొడ్డి రమణ, గంట్ల శ్రీనుబాబు, వారణాసి దినేష్ రాజ్‌, ఆర్‌. వీర వెంకట సతీష్‌‌లు ఉన్నారు. వీరిలో దొడ్డి రమణ గాజువాక ప్రాంతంలో వైసీపీ తరఫున కార్పొరేటర్‌గా పోటీచేసి ఓడిపోయారు. అలాగే దినేష్ రాజ్ మార్చితో ముగిసిన గత పాలకవర్గంలోనూ సభ్యుడిగా ఉన్నారు.. ఆయనకు మరోసారి అవకాశం కల్పించారు.

    ఇదీ చదవండి : పరిశ్రమలు మూత పడాలి అనుకుంటున్నారా..? ప్రభుత్వ నిర్ణయంతో పారిశ్రామిక వేత్తల ఆందోళన

    ఇంతవరకు బాగానే ఉంది. మరి ఇంతకాలం అధికార వైసీపీని నమ్ముకుని అశోక్ గజపతి రాజుపై పోరాటం చేసిన.. సంచయిత గజపతి రాజు పరిస్థితి ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. ఆమెను ఎలాగూ అశోక్ గజపతి రాజు అడుగుపెట్టనీయరు. మరోవైపు స్థానికంగా రాజకీయాల్లో ఎప్పుడు జోక్యం చేసుకోలేదు కాబట్టి.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం.. వచ్చిన అధికార వైసీపీ తరపున సీటు దక్కించుకోవడం కష్టమే.. ఎందుకంటే ఇప్పటికే వైసీపీలో భారీగా పోటీ నెలకొంది. దీంతో ఆమె త్వరలోనే బీజేపీలో అధికారికంగా చేరుతారనే ప్రచారం సాగుతోంది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Vizianagaram

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు