Home /News /andhra-pradesh /

AP POLITICS VISAKHA MP MVV SATYANARAYNA GAVE CLARITY ON LAND GRABBING COMPLAINTS NGS VSP

MP vs SP: ఇక జిల్లాలో వ్యాపారం చేయను.. వైసీపీ ఎంపీ ప్రతిజ్ఞ.. ఎస్పీ ఏమన్నారంటే..?

ఎంవీవీ సత్యనారాయణ వర్సెస్ ఎస్పీ

ఎంవీవీ సత్యనారాయణ వర్సెస్ ఎస్పీ

MP vs SP: తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై వైసీపీ ఎంపీ తీవ్రంగా స్పందించారు. తాను రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని.. తన కారణంగా అధినేతకు చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో.. ఇకపై ఆ వ్యాపారం చేయనంటూ ప్రతిజ్ఞ చేశారు.

ఇంకా చదవండి ...
  P Anand Mohan, Visakhapatnam, News18,                              MP Vs SP:  విశాఖలో ఎంపీ వర్సెస్ ఎంపీగా ముదిరిన  వివాదానికి ఎండ్ కార్డు వేసే ప్రయత్నం చేశారు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MP MVV Satyanarayana).. అసలు తనకు భూ కబ్జాలు (Land Grabbing) చేయాల్సిన అవసరం లేదంటూ స్వయంగా వివరణ ఇచ్చారు.  విశాఖ కే చెందిన ఇంటలిజెన్స్ ఎస్పీ మధు (SP Madhu) స్థలాన్ని తాను ఆక్రమించుకొనే ప్రయత్నం చేసినట్టుగా వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. రోడ్డు మధ్యలోనే ఈ స్థలం ఉందన్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాంతమంతా రోడ్డే అనుకొన్నామని ఆయన వివరణ ఇచ్చారు. ఇకపై విశాఖ (Visakha)లో వ్యాపారం చేయనంటూ ప్రతిజ్ఞ చేశారు. తన వల్ల పార్టీకి, సీఎం జగన్‌ (CM Jagan)కు చెడ్డపేరు రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంచలన ప్రకటన చేశారు. కేవలం వైసీపీ ఎంపీని కావడంతోనే తనపై బురద జల్లుతున్నారని.. ఇకపై వీటన్నింటికి చెక్‌ పెట్టాలని అనుకుంటున్నట్టు స్పష్టం చేశారు.

  ఎస్పీ మధుతో పాటు మరో నలుగురు కలిసి 500 గజాల స్థలాన్ని  ఎల్లపు ఈశ్వర్ వద్ద కొనుగోలు చేశారన్నారు.  ఆ స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం ఎస్పీ ప్రయత్నిస్తున్న విషయాన్ని తనకు కొందరు సమాచారం ఇచ్చారన్నారు.  ఈ విషయమై తాను పోలీసులకు, మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసిన మాట వాస్తవమేనన్నారు.

  ఇదీ చదవండి : మాజీ జేడీ ఆ పార్టీలో చేరుతున్నారా..? ఆయన టార్గెట్ ఎవరు..? పార్టీలో చేరేందుకు కండిషన్లు ఉన్నాయా..?

  తన స్థలంలో గోడ నిర్మించుకొంటుంటే అడ్డుకొన్నారని తాను చెప్పానని ఎస్పీ మధు  చెప్పారన్నారు. కానీ  ఓ వర్గం  మాత్రం ఎంపీ  ఈ భూమిని ఆక్రమించుకొంటున్నారని తప్పుడు ప్రచారం చేశారన్నారు. సొంత  స్థలంలోనైనా ఏదైనా అనుమతులు వచ్చిన తర్వాతే నిర్మాణాలు చేయాలన్నారు.. కానీ ఎస్పీకి చెందిన భూమిలో కూడా అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారని ఎంపీ వివరించారు.

  ఇదీ చదవండి: తుది దశకు చేరిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ.. రేపే తుది నోటిఫికేషన్..

  ప్రభుత్వ నిబంధనలను తాము కానీ, తమ సంస్థ కానీ ఉల్లంఘించలేదని  స్పష్టం చేశారు. ఎస్పీ మధుకు ఈ భూమిని విక్రయించిన వ్యక్తి ఆయనను మోసం చేశారని విశాఖ ఎంపీ చెప్పారు. మధు కొనుగోలు చేసిన 500 గజాల స్థలంలో 300 గజాల భూమి వివాదంలో ఉందన్నారు. 150 గజాలకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు క్లియరెన్స్ ఇచ్చారని ఎంపీ వివరించారు. అయితే ఎస్పీ మధు తన స్థలంలో గోడ నిర్మాణానికి సంబంధించి తమకు అభ్యంతరం లేదన్నారు.

  ఇదీ చదవండి: ఏపీలోని స్కూల్స్ లో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం.. టీచర్లకు.. స్టూడెంట్స్ కూ మొబైల యాప్..

  అర్ధరాత్రి గోడ నిర్మించేందుకు పూనుకోవడంతో పాటు అనుమతి లేకుండా గోడ నిర్మిస్తున్నారని తాను నిలిపివేయాలని అధికారులను కోరానని ఎంపీ సత్యనారాయణ తెలిపారు. ఈ గోడ నిర్మించేంత వరకు  ఈ స్థలం ఎస్పీ  మధుది అనే విషయం తమకు తెలియదన్నారు. లేఔట్‌లో కూడా ఈ ప్రాంతాన్ని రోడ్డుగానే చూపారని ఎంపీ వివరించారు. రోడ్డు మధ్యలో ఎస్పీ స్థలం ఉందని ఎంపీ చెప్పారు. అయితే ఇదంతా రోడ్డే అనుకొన్నామన్నారు.

  ఇదీ చదవండి:రోజాకు అధినేత ఇచ్చిన ఆదేశాలేంటీ? అందుకే ఆమె ఆ ప‌ని చేసిందా?

  తన స్థలాన్ని ఎంపీ కబ్జా చేశారని ఎక్కడా చెప్పలేదన్నారు ఇంటలీజెన్స్ ఎస్పీ మధు. కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని కొందరు అడ్డుకున్నారని మాత్రమే తాను చెప్పానన్నారు. తన స్థలాన్ని ఎంపీ కబ్జా చేయలేదని స్పష్టతనిచ్చారు. కాంపౌండ్ వాల్ కోసం జీవీఎంసీ అనుమతి తీసుకోవాలంటే.. ఖచ్చితంగా తీసుకుంటానన్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Visakhapatnam, Vizag, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు