హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

నందమూరి బాలకృష్ణకు షాక్... పెళ్లికి వెళ్తుండగా అడ్డుకున్న జనం

నందమూరి బాలకృష్ణకు షాక్... పెళ్లికి వెళ్తుండగా అడ్డుకున్న జనం

బాలయ్యను అడ్డుకున్న గ్రామస్థులు

బాలయ్యను అడ్డుకున్న గ్రామస్థులు

హైదరాబాదు నుంచి బెంగళూరుకు చేరుకున్న బాలయ్య... అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హిందూపురంకు బయల్దేరారు.

  ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్ తగిలింది. ఓ శుభకార్యానికి వెళ్తుండగా ఆయనను గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ ఊరిని పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అనంతపురంజిల్లా లేపాక్షి మండలంలోని గలిబిపల్లి గ్రామస్తులు బాలకృష్ణను అడ్డగించారు. టీడీపీ అధికార ప్రతినిధి రమేశ్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు బాలయ్య హిందూపూరంకు వచ్చారు. హైదరాబాదు నుంచి బెంగళూరుకు చేరుకున్న బాలయ్య... అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హిందూపురంకు బయల్దేరారు. దీంతో బాలయ్య వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు కొడికొండ చెక్ పోస్టు కాపుకాశారు. ప్రధాని రహదారిపై విద్యార్థులు, గ్రామస్థులు బైఠాయించారు.

  హిందూపురం వచ్చే దారిలో గలిబిపల్లి క్రాస్ వద్ద ఆయన వెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. హిందూపురం నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. లేపాక్షి-హిందూపురం మెయిన్ రోడ్డు నుంచి గలిబిపల్లికి రోడ్డు వేసేందుకు భూమి పూజ చేసి దాదాపుగా సంవత్సరం అయ్యింది. అయినా కూడా ఇంతవరకు పనులు మాత్రం పూర్తి కాలేదు. దీంతో బాలయ్య వాహనాన్ని అడ్డుకొని గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన బాలయ్య... అధికారులతో మాట్లాడి పనులను త్వరలోనే పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో, గ్రామస్తులు వెనక్కి తగ్గి, బాలయ్య వాహనానికి దారి వదిలారు.

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Bala Krishna Nandamuri, Balakrishna, Hindupuram, TDP, Tollywood news

  ఉత్తమ కథలు