ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు ప్రస్తుతం పొత్తుల చుట్టూ తిరుగుతున్నాయి. టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పొత్తులపై కామెంట్స్ చేయడంతో అధికార పార్టీ నేతల నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు వస్తున్నాయి. రాష్ట్రంలో వైసీపీ (YSRCP)ని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ కలిసి రావాలని, అవసరమైతే తాము త్యాగాలకూ సిద్ధమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. తమకు ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే భయపడుతున్నారో, ఎవరికైతే ప్రజల మద్దతు లేదో, వారు ఇంకొకరి మద్దతు కోసం ఎదురు చూస్తుంటారన్నారు. బాబుకు గెలుపుపై నమ్మకం లేదని., ఆయన పట్ల ప్రజలకు విశ్వసనీయత లేదని విమర్శించిన విజయసాయి రెడ్డి.., ఇతరులపై ఆధారపడి ప్రయోజనం పొందిన తర్వాత వారిని వెన్నుపోటు పొడిచే తత్వం చంద్రబాబుదన్నారు.
వచ్చే 20, 25 ఏళ్లపాటు జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని.., వైయస్సార్సీపీనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్కు గతంలో కంటే ఇంకా ఎక్కువ సీట్లు ఓట్లు, సీట్లు వస్తాయన్నారు. ప్రజలే చంద్రబాబును దించేశారని.., చంద్రబాబు మనస్తత్వం దుర్మార్గమైందన్నారు. వెన్నుపోటు పొడిచే మనస్తత్వం.. నిలకడలేని తనం చంద్రబాబున్నారు. బాబుకు అధికారం దాహం తప్ప, తన సామాజిక వర్గాన్ని పెంచుకోవడం తప్ప వేరే ధ్యాసలేదన్నారు. ప్రతి కుటుంబంలో సంతోషం చూడాలన్న భావన చంద్రబాబులో ఏనాడూ లేదని విజయసాయి రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో అత్యాచారాల వెనుక ఉన్నది టీడీపీ నేతలేనంటూ విజయసాయి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ కార్యకర్తలు నాయకులే అత్యాచారాలు చేస్తున్నారని.., ఇది ముమ్మాటికి నిజం. ఇవాళ సమాజంలో అశాంతి, అకృత్యాలు, ముఖ్యంగా నేరాలు ఎవరైనా చేస్తున్నారంటే.. అది టీడీపీ నేతలు.. కార్యకర్తల చేత, కొందరు గుండాలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించి క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారన్నారు.
బాబు వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala RamaKrishna Reddy) స్పందించారు. ఎన్నికలలో పొత్తులపై టీడీపీ, జనసేన నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తే వారు సమన్వయంతో ప్రకటనలు చేస్తున్నట్లుగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా వ్యతిరేక ఓటు చీలకూడదని ప్రకటించారని.., బీజేపీలో కూడా టీడీపీ ఏజంట్లు సుజనా చౌదరిలాంటి వాళ్లు ఉన్నార కాబట్టి.., రేపు వాళ్ళు కూడా అదే స్టేట్ మెంట్ ఇస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు సజ్జల. చంద్రబాబు అధికారంలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలి... అధికారంలో లేకపోతే చీలకూడదని భావిస్తుంటారని సజ్జల విమర్శించారు. దానికి తగ్గట్లు పవన్ కళ్యాణ్, చంద్రబాబు స్టేట్ మెంట్లు ఇస్తుంటారన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Vijayasai reddy