హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Balayya: మందులను దేవుడి ప్రసాదంలా సేవిస్తున్న బాలయ్య.. టీవీపై జోక్ వింటే పడి పడి నవ్వాల్సిందే..

Balayya: మందులను దేవుడి ప్రసాదంలా సేవిస్తున్న బాలయ్య.. టీవీపై జోక్ వింటే పడి పడి నవ్వాల్సిందే..

టర్కీలో బాలయ్య సందడి (Twitter/Photo)

టర్కీలో బాలయ్య సందడి (Twitter/Photo)

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Nandamuri Balayya:  టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandmuri Balakrishna) లో రెండు కోణాలు కనిపిస్తుంటాయి. ఆయన ఎంత కోపంగా కనిపిస్తారో.. అంతే స్థాయిలో ప్రేమ కూడా కురిపిస్తుంటారు. అందుకే బాలయ్యను అభిమానులు ఎంతో ఇష్టపడుతుంటారు. పలు సందర్భాల్లో ఆయన ఏంటి.. అభిమానులపై తన ప్రేమ ఎలా ఉంటుంది అని నిరూపించుకుంటున్నారు.  ఇప్పుడు షూటింగ్ కోసం టర్కీ వెళ్లిన బాలయ్య (Balayya in Turkey).. అక్కడ కూడా సందడి చేస్తున్నారు. తాజాగా అక్కడ ఆయన చేసిన పని చూసి దటీజ్ బాలయ్య అంటున్నారు ఫ్యాన్స్.. మా బాలయ్య తోపు అని గొప్పగా చెప్పుకుంటున్నారు.  ప్రస్తుతం టర్కీలోని సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య.. ఇతర మాతాలను ఎలా గౌరవిస్తారు.. హిందూ ధర్మాన్ని (Hindhu Dhramam) ఎలా ఆరాదిస్తారు అన్నది స్ఫష్టంగా కనిపించింది. గతంలో ఆయన ఓ పొలిటికల్ మీటింగ్ లో పాల్గొన్నప్పుడు.. అక్కడ నమాజ్ వినిపిస్తే.. ఒక్కసారి తన స్పీచ్ ఆపేశారు.. నమాజ్ సౌండ్ ఆగినంత వరకు తన స్పీచ్ ఆపీ.. ముస్లింల మనోభావాలను గౌరవించారు. ఇలా చాలా సందర్భాల్లో ఇతరులను బాలయ్య గౌరవిస్తూ వచ్చారు...తాజాగా హిందూ ధర్మాన్ని ఎలా పాటిస్తారో అన్నది కళ్లకు కట్టినట్టు కనిపించింది. టర్కీలో ఓ రెస్టారెంట్ లో ముస్లిం కుటుంబంతో కలిసి కూర్చున్న ఆయన.. వారితో జోక్ లు వేస్తూ మాట్లాడారు. అయితే తాను మందులు వేసుకోబేయే ముందు.. ఎదుటి వారిని ఒక నిమిషం సైలెంట్ గా వుండమని చెప్పారు. ఆ తరువాత దేవుడిని మనసులో ప్రార్ధించి.. మందులు వేసుకున్నారు.. ఇది మా బాలయ్య మన సంప్రదాయాలకు ఇచ్చే విలువ అంటూ.. అభిమానులు మరోసారి వీడియోపై కామెంట్లు చేస్తున్నారు..



ఈ సందర్భంగా తన ఎదుటు కూర్చున్న ఫ్యామిలీతో మాట్లాడిన బాలయ్య జోక్ లు పేలుస్తూ నవ్వించారు.. టీవీని దూరం నుంచి చూస్తే కళ్లకు చాలా మంచిదని.. అదే టీవీని పూర్తిగా చూడడం మానేస్తే.. మెదకు చాలా మంచింది అంటూ జోక్ లు పేల్చారు. ఈ సందర్భంగా టీవీ సీరియల్స్ పైనా సైటర్లు వేశారు.. స్టార్ హీరో అని.. ఎమ్మెల్యే అనే హోదా లేకుండా ఓ కుటుంబంతో సరదగా ఆయన గడిపిన తీరు.. ఫ్యాన్స్ ను మరోసారి ఫిదా అయ్యేలా చేసింది.
ఇదీ చదవండి : ఖాకీ కాదు కామ పిశాచి.. ఒంటరి మహిళను ఏం చేశాడంటే?
బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ చిత్రాన్ని చేస్తున్నారు. బాలయ్య బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడ ఓ అభిమాని షూట్ చేసిన వీడియో ఇలా వైరల్ అవుతోంది..

First published:

Tags: Andhra Pradesh, AP News, Bala Krishna, Bala Krishna Nandamuri, Tollywood

ఉత్తమ కథలు