AP POLITICS VERY RARE CULTURE IN ANANTAPURAM DISTRICT ROLLAMANDALAM BUTTHAPPALA FESTIVAL IN LAKHSIMI NARSIMHA SWAMY UTSAVALU NGS
Rare Culture: సంతానం లేక ఇబ్బంది పడుతున్నారా..? ఆర్థిక సమస్యలు వేదిస్తున్నాయా? వారి కాలి స్పర్శ తగిలితే చాలా.. కోరికలు నెరవేరినట్టేనా..!
భూతాలప్ప పండుగ
Lakshmi Narsimha swamy Temple: సంతానం లేని వారు.. దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొందరు వైద్యుల చుట్టూ తిరుగుతారు. మరి కొందరు గుళ్లు.. గోపురాల చుట్టూ తిరుగుతూ దేవుడిపైనా భారం వేస్తారు. ఇక ఆర్థిక ఇతర సమస్యలు ఉన్నవాళ్లు.. సైతం దేవుడిపైనే నమ్మకం పెట్టుకుంటారు.. అయితే ఆ భయం లేదంటున్నారు కొందరు.. వారి పాద స్పర్శ తగిలితే చాలు మీ కోరికలు తీరుతాయి అంటున్నారు.
Lakshmi Narsimha swamy Temple: కొన్ని సంప్రదాయాలు చాలా వింతగా.. కొత్తగా నిపిస్తాయి. కొన్ని ప్రమాదకరంగా కూడా ఉంటాయి. అయితే వాటిని పాటించే వారికి అవి అలవాటైపోతాయి. కొత్తగా చూసేవాళ్లకు మాత్రం ఇదేం వింత ఆచారం అనిపిస్తోంది. అలాంటి ఆచారమే అనంతపురం జిల్లా రోళ్లమండలంలో ఉంది. సాధారణంగా చాలామంది సంతనం లేని వారు.. సంతానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.. కొంతమంది గుళ్లు, గోపురాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కొందరు పూజలు హోమాలు చేయిస్తుంటారు. వాటిని పెద్దగా నమ్మని వారు వైద్యుల చుట్టూ తిరుగూతూ ఉంటారు. అయితే సంతానం కలగకపోతే.. రోళ్ల మండలం కేంద్రంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు రండి అంటున్నారు అక్కడి స్థానికులు.. కేవలం సంతానలేమి సమస్యలు మాత్రమే కాదు.. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, నిరుద్యోగం ఇలా ఏ సమస్య అయినా.. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చి.. వాళ్ల పాద స్పర్శ తాకితే మీ కోరికలు నెరవేరుతాయి అంటున్నారు.. స్పర్శ తగిలితే కోరికలు తీరడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? కానీ నిజం అన్నది స్థానికుల నమ్మకం..
అనంతపురం జిల్లాలోని రొళ్ల మండల కేంద్రంలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రస్తుతం వైభవంగా జరుగుతున్నాయి. అయితే దీంతో పాటు ఇక్కడ జరిగే భూతప్ప ఉత్సవాలకు ఏపీ, కర్ణాటక(Karnataka) నుంచి వేలాదిగా భక్తులు ఎప్పుడు తరలి వస్తుంటారు. ఈ సారి కూడా భారీగా జనం పోటెత్తారు. ఎందుకంటే ఒక్కసారి భూతప్పల కాలి స్పర్శ కోసం, వేల సంఖ్యలో భక్తులు తడిబట్టలతో బోర్లా పడుకొని వేచి చూస్తారు. అలా అక్కడ పడుకున్ని ఉన్నవారిపై ఉర్రాల శబ్దాలకు అనుగుణంగా నడుస్తూ, భక్తులను కాలితో తొక్కుకుంటూ వెళ్లారు భూతప్పలు. ఇలా జరగడం ఇదే తొలి సారి కాదు.. ఎన్నో ఏళ్లగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
ఆ తరువాత లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి అరటిపండ్లు కలిపిన బొరుగుల రాసులో తలదూర్చి నైవేద్యాన్ని భుజించారు. భూతప్పల స్పర్శ తర్వాత మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలల్లో భూతప్పల ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. భూతప్పల స్పర్శ తగిలితే పిల్లలు లేనివారికి పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి వ్యాధులు నయమవుతాయని, ఇళ్లలో ఉన్న కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు భక్తులు.
ఆ నమ్మకంతోనే ఇలా ప్రతి ఏడాది భారీగా ఈ ఉత్సవాలకు భక్తులు పోటెత్తుతున్నారు. భూతప్పల కాలి స్పర్శ కోసం తడిబట్టలతో బోర్లా పడుకొని మొక్కులు తీర్చుకుంటామని చెబుతున్నారు భక్తులు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.