AP POLITICS VERY HOT SITUATION IN CHITOOR POLITICS YCP LEADERS PUT CASES AGAINST TDP LEADERS NGS TPT
YCP Vs TDP: ఆ జిల్లాలో వైసీపీ, టీడీపీ మధ్య ముదిరిన వార్.. హత్య కేసు చుట్టూ తిరుగుతున్న రాజకీయం
ప్రతీకాత్మకచిత్రం
YCP Vs TDP: ఆ జిల్లాలో రాజకీయం పోలీసుల చుట్టూ తిరుగుతోంది. ప్రత్యర్థిపై పైచేయి కోసం కోర్టు కేసులు తప్పడం లేదు.. ముఖ్యంగా గతంలో జరిగిన ఓ హత్య చుట్టూ ఇప్పుడు జిల్లా రాజకీయాలు నడుస్తున్నాయి. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మధ్య జరుగుతున్న ఈ ప్రత్యక్ష యుద్ధంలో గెలిచేది ఎవరు..?
YCP Vs TDP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh) రసవత్తర ములుపులు తీసుకుంటున్నాయి. అధికార, విపక్షాల మధ్య రాజకీయ రగడ పెరుగుతోంది. మొన్నటి వరకు విమర్శలకే పరిమితం అయిన నేతలు.. ఇప్పుడు కేసులకు వెనుకడాడడం లేదు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా (Chitoor) రాజకీయాలు ఓ హత్య చుట్టూ ఇప్పుడు తిరుగుతున్నాయి. ఆ హత్య ఏంటంటే..? 2015 నవంబర్. చిత్తూరు మేయర్ కటారి అనురాధ (Katari anuradaha), ఆమె భర్త మోహన్ (Mohan)లను మున్సిపల్ కార్యాయలంలోనే ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది.
కటారి దంపతుల దగ్గరి బంధువైన చింటూనే ఈ కేసులో కీలక సూత్రధారిగా అభియోగాలు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే సుదీర్ఘ విచారణ జరుగుతోంది. తాజాగా కోర్టు విచారణలో ఉన్న కేసును ఈ నెల 30కి వాయిదా వేశారు. విచారణలో భాగంగా సాక్ష్యులకు సమన్లు వెళ్లాయి. ఇదే కేసులో వైసీపీ నేత బుల్లెట్ సురేష్ కూడా నిందితుడిగా ఉండడం రాజకీయం మరింత ముదిరింది. ఈ నెలాఖరున కోర్టులో ట్రయిల్ మొదలవుతుందనే కారణమో.. లేక పొలిటికల్‌గా పైచెయ్యి సాధించాలనే ఆత్రుతో ఏమో.. ఒక్కసారిగా చిత్తూరు రాజకీయం సెగలు కక్కుతోంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ సాక్ష్యులను బెదిరిస్తున్నారనేది టీడీపీ వాదన.. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కఠారి దంపతుల కోడలు.. మాజీ మేయర్ హేమలత తీవ్ర ఆరోపణలు చశారు. ఇందులో కొందరు వైసీపీ నేతల పేర్లను ఆమె బహిరంగంగానే ప్రస్తావించారామె. ఇంతలో కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న సతీష్‌ను గంజాయి కేసులో పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడం.. అతను దొరక్కపోవడంతో.. కటారి కుటుంబానికి ముఖ్య అనుచరుడిగా ఉన్న పూర్ణను స్టేషన్‌కు తీసుకెళ్లడం రచ్చ రచ్చ అయింది.
అధికార పార్టీ నేతల ఆదేశాలతోనే హేమలతతోపాటు టీడీపీ నేతలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడంతో పరిస్థితి మారిపోయింది. ఈక్రమంలో పోలీస్ జీపు ధర్నా చేస్తున్న హేమలత కాలి పైనుంచి వెళ్లడంతో ఆమెకు గాయమైంది. ఇది మరింత అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. ఇక గంజాయిని పోలీసులే తీసుకొచ్చి.. తప్పుడు కేసులు పెడుతున్నారని టీడీపీ నతలు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ.. టీడీపీ నేతలు అమర్నాథరెడ్డి తదితరులు ఆందోళనకు దిగారు.
పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. దాంతో ఈ ఆందోళనలో పాల్గొన్న అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబుతోపాటు మిగతా వాళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిగా ఉన్న వైసీపీ నేత బుల్లెట్ సురేష్ ఒత్తిళ్ల మేరకే పోలీసులు సాక్ష్యులను బెదిరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వీటిని జిల్లా పోలీసులు కొట్టి పారేసినా.. కటారి దంపతుల హత్య కేసు కోర్టులో విచారణకు వస్తున్న సమయంలో మారుతున్న పరిణామాలు ఉద్రికత్తలకు దారితీస్తున్నాయి. రెండు వర్గాలు పట్టుబిగించడంతో సమస్య శ్రుతిమించుతోంది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.