AP POLITICS VERY BIG SHOCK TO YCP IN EAST GODAVARI DISTRICT KEY LEADER AND STATE LEVEL IN CHARGE RESIGNED NGS GNT
Big Shock to YCP: ఆ జిల్లాలో వైసీపీ బిగ్ షాక్.. పార్టీకి రాష్ట్ర కార్యదర్శి రాజీనామా..? అందుకేనా?
రాజోలులో వైసీపీ బిగ్ షాక్
Big Shock to YCP: ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీకి షాక్ లు తప్పడం లేదు.. ముఖ్యంగా పలు నియోజకవర్గాల్లో వర్గ పోరుతో అధిష్టానానికి తలనొప్పులు పెరుగుతున్నాయి. తాజాగా రాజోలు పార్టీ ఇంఛార్జ్.. రాష్ట్ర కార్యదర్శి పార్టీకి రాజీనామ చేయడం కలకలం రేపింది. ఆయన రాజీనామాకు కారణం ఏంటంటే?
Big Shock to YCP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార పార్టీలో వర్గ పోరు తారా స్థాయికి చేరింది. ఇప్పటికే పలు జిల్లాల్లో నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు.. నిత్యం పంచాయితీలు పెట్టుకుంటున్నారు. కొన్ని పంచాయితీలు అధిష్టానం వరకు చేరాల్సి వస్తోంది. ఇదే సమయంలో కొందరు పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాల సంగతి ఎలా ఉన్నా.. కోనసీమ (Konaseema) లో పార్టీకి ఊహించని షాక్ తగిలింది. అధికార పార్టీ వైసీపీ (YCP) లో చాలాకాలం నుంచి వర్గ విభేదాలు ఉన్నా, అవి ఇప్పుడు ముదిరి పాకాన పడినట్టు క్లారిటీ వచ్చేసింది. కొత్తగా వచ్చినవారికి అధిక ప్రాధాన్యత ఇస్తుండడం.. ఎప్పటినుంచో పార్టీని నమ్ముకున్నవారికి ఇబ్బందికరంగా మారింది. ఇదే పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. మొదట మంత్రి వర్గ విస్తరణతో.. పలువురి నేతల మధ్య విబేధాలు బహిరంగం అయ్యాయి. కీలక నేతలు సైతం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ వేడి చల్లారకముందే.. ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకోవడంతో పరిస్థితులు మరింత ముదిరాయి. ఇప్పటికే గన్నవరం (Gannavaram) నియోజకవర్గం పంచాయతీ ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. అదే సమయంలో ఇప్పుడు రాజోలు వైసీపీ వార్తల్లోకి వచ్చింది.
ముఖ్యంగా ఎన్నికల తరువాత కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి పెత్తనాన్ని ఎప్పటినుంచో పార్టీలో ఉన్నవారు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు రాజీనామాలు చేయడం మొదలు పెట్టారు. అయితే ఈ సారి ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాష్ట్ర కార్యదర్శి రుద్రరాజు వెంకటరామరాజు రాజీనామా చేశారు. కేవలం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పదవికి మాత్రమే కాకుండా ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా స్వయంగా ప్రకటించారు.. ఏదో అలగడం కాదు.. నేరుగా రాజీనామానే ఆయన ప్రకటించారు.
తన అనుచరులతో రాజీనామా లేఖలను పార్టీ కార్యాలయంకు పపించారు. రాజీనామా ఎందుకు చేస్తున్నారో కూడా వెల్లడించారు. ఇప్పటి వరకు పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నవారిని పక్కన పెట్టి కొత్తగా జనసేన నుంచి పార్టీలోకి వచ్చినవారికి ప్రముఖ్యత పెరుగుతోందిని ఆరోపించారు. వైసీపీ కోసం ఎన్నికలలో పని చేసిన వారిని పక్కన పెట్టి జనసేన నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయడంపై రుద్రరాజు మండిపడ్డారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వ మూడేళ్ల పాలన పైనా వెంకటరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనతో పాటు మరో వేయి మందికి పైగా కార్యకర్తలు వైసీపీకి రాజీనామా చేస్తున్నారని ఆయన తెలిపారు.
ఆయన రాజీనామా చేయడంతో భవిష్యత్తు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే తనకు తెలుగుదేశం నుంచి ఆహ్వానం వచ్చిందన్నారు. కార్యకర్తలతో కలిసి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు వెంకటరామరాజు. ఆయన వ్యాఖ్యలు బట్టి చూస్తే కచ్చితంగా టీడీపీలో చేరే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. గత కొంతకాలం నుంచి తెలుగు దేశం పార్టీ నేతలు సైతం అదే మాట చెబుతున్నారు. త్వరలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయి అంటున్నారు.. వాటికి ఇది ఆరంభం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.