Big Shock to YCP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ (YCP)కి ఊహించని షాక్ లు తగులుతున్నాయి. కచ్చితంగా ఏడుకి ఏడు ఎమ్మెల్సీ సీట్లు నెగ్గాల్సిన చోట కూడా టీడీపీ (TDP) జెండా ఎగురవేసింది. టీడీపీకి 19 మంది ఎమ్మెల్యే మద్దతు ఉంటే.. 23 సీట్లు వచ్చాయి. అందులో ఇద్దరు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల ఓట్లు పడినా.. తమదే విజయం అని వైసీపీ మొదటి నుంచి ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ ఊహించని రీతిలో పంచమర్తి అనురాధ (Panchamarthi Anuradha) గెలుపొందింది. దీంతో వైసీపీ నుంచి రెండు ఓట్లు టీడీపీకి క్రాస్ అయ్యాయి. అయితే అంతా టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లిన ఎమ్మెల్యేలు.. టీడీపీకి ఓటు వేసి ఉంటారని అంచనా వేశారు. కానీ వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలే టీడీపీ ఓటు వేశారు అంటున్నారు. ఉండవల్లి శ్రీదేవీ, మేకాపాటి చంద్రశేఖర్ రెడ్డిలు టీడీపీకి ఓటు వేసినట్టు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు కాకుంటే.. టీడీపీ నుంచి వచ్చిన వాసుపల్లి గణేష్, కరణం బలరాం లు ఓటు వేసే అవకాశం ఉందని మరో వర్గం చెబుతోంది.
వైసీపీ వర్గాల్లో మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టడానికి ముందే.. వైసీపీ చెందిన ఇద్దరు ఎమ్మెల్యే చంద్రబాబుకు టచ్ లోకి వచ్చి ఉంటారు అని ప్రచారం జరుగుతోంది. వారి దగ్గర నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తరువాత.. అనురాధను నిలబెట్టి ఉంటారు అంటున్నారు.
తాజా ఫలితాలపై సీఎం జగన్ సైతం సొంత పార్టీ నేతలపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అలాగే ఇంటలిజెన్స్ అధికారుల తీరుపైనా సమీక్ష చేసే అవకాశం ఉంది. సొంత పార్టీ నేతలు.. చంద్రబాబుకు టచ్ లోకి వెళ్లినా ఎందుకు గుర్తించలేకపోయారని ప్రశ్నించినట్టు సమాచారం. అయితే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఓట్లు కచ్చితంగా టీడీపీ పడతాయని మొదటి నుంచి వైసీపీ అంచనా వేసింది. అంతకంటే ఒక్క ఓటు కూడా టీడీపీకి పడకూదని.. వైసీపీ అధికార పార్టీ అన్ని రకాల చర్యలు తీసుకుంది. కానీ ఫలితం మాత్రం తేడా కొట్టింది.
ఇదీ చదవండి : వైసీపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచమర్తి అనురాధ గెలుపు
అనురాధ విజయంతో వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థి కోలా గురువులు ఓటమి పాలయ్యారు. ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన జయమంగళం గెలుపొందగా.. గురువులు ఓటమి పాలయ్యారు. ఇద్దరికీ మొదటి ప్రాధాన్య ఓట్లలో 22 రాకపోవడంతో.. రెండో ప్రాధాన్య ఓట్లు పరిగణలోకి తీసుకున్నారు. అయితే కోలా గురువులకు ఓటు వేయాలని సూచించిన జాబితాలోనే ఉండవల్లి శ్రీదేవి ఉండడంతో.. ఆమె క్రాస్ ఓటు వేశారని ప్రచారం జరుగుతోంది. కానీ రెండో ప్రాధాన్య ఓటు ద్వారా జయమంగళం విజయం సాధించారు. ఇటీవల టీడీపీ నుంచి వైసీపీ లో చేరిన జయమంగళం ఓటమి పాలయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap mlc elections, AP News, TDP