హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Big Shock: వీర విధేయులు.. మాజీ మంత్రులకు ఊహించని షాక్.. వారిని తప్పించడానికి కారణాలు ఇవే..?

Big Shock: వీర విధేయులు.. మాజీ మంత్రులకు ఊహించని షాక్.. వారిని తప్పించడానికి కారణాలు ఇవే..?

కొడాలి నాని, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

కొడాలి నాని, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

Big Shock: ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ అధికారం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అందుకే అధిక సమయం ఇప్పుడు పార్టీకి కేటాయిస్తున్నారు. ఇతర పార్టీలతో పోల్చుకుంటే దూకుడుగా ఉన్న ఆయన.. ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల టీంను రెడీ చేసుకున్న ఆయన. వీర విధేయులు, కీలక నేతలు, మాజీ మంత్రులకు షాక్ ఇచ్చారు. కారణం ఏంటో తెలుసా?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Big Shock: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికలకు హీట్ పెరుగుతోంది. అన్ని పార్టీలు గెలుపు వ్యూహాలపై ఫోకస్ చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ అయితే 175కి 175 స్థానాల్లో నెగ్గడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. పార్టీ అధినేత.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) పదే పదే ఇదే మాట చెబుతున్నారు. 175కి 175 ఎందుకు సాధ్యం కాదని తిరిగి ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పక్షపాతం లేకుండా అన్ని వర్గాలకు మేలు చేస్తోందని.. ఎందుకు గెలిపించరని పార్టీ నేతలను, కార్యకర్తలను ప్రశ్నిస్తున్నారు. అలాగే మీరు చేయాల్సింది మీరు చేయండి.. మిగిలినది తాను చేస్తాను అనే భరోసా కల్పిస్తున్నారు. ఇలా అన్ని పార్టీలకంటే ముందే ఎన్నిక సమర శంఖం పూరించారు జగన్.. ఇందులో భాగంగా తన ఎన్నికల టీంను రెడీ చేసుకున్నారు. వైసీపీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లతో పాటు.. పార్టీ జిల్లా అధ్యక్షుల్లోనూ మార్పులు చేర్పులు చేశారు.

ఈ క్రమంలో  సీఎం జగన్ కు వీర విధేయులుగా చెప్పుకునే కొందరికి షాక్ తప్పలేదు.. రీజనల్ కోర్డినేటర్లు.. జిల్లా అధ్యక్షుల విషయంలో వారిని తొలగించి.. మరొకరికి చోటు కల్పించడం హాట్ టాపిక్ అవుతోంది. అందులో ముఖ్యంగా మాజీ మంత్రులు కొడాలి నాని (Kodali Nani) , అనిల్ కుమార్ (Anil Kumar), అవంతి శ్రీనివాస్ (Avanti Srinivas) లు ఉన్నారు. ఈ ముగ్గురికి ఊహించని షాక్ ఇచ్చారు అధినేత జగన్..

వైసీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత కొడాలి నాని.. అంతేకాదు ప్రతిపక్షాలను చెడుగుడు ఆడాలన్నా ఆయనే ముందు ఉంటారు.. జగన్ మోహన్ రెడ్డిపై ఎవరైనా విమర్శలు చేస్తూ.. ఓ రేంజ్ లో కౌంటర్లు ఇస్తారు. ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు నేరుగా ఎవరి అనుమతి లేకుండా జగన్ కు కలిసేంత చొరవ ఉన్న నేత ఆయన.. ప్రస్తుతం ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల్లో జగన్ కు అంత్యంత వీర విధేయుడు ఎవరైనా ఉన్నారు అంటే అందులో కొడాలి నాని ఒకరు.. ఇన్ని క్వాలిటీలు ఉన్నా.. ఆయన్ను ఆ మధ్య మంత్రి పదవి నుంచి తప్పించారు.. ఇప్పుడు ప్రాంతీయ సమన్వయ కర్త బాధ్యతల నుంచి కూడా తప్పించారు.

ఇదీ చదవండి : ఆ జిల్లాను వెంటాడుతున్న వర్గపోరు.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే ఫైట్.. సజ్జల దగ్గర పంచాయితీ

తాజాగా కొడాలి నాని వద్దనున్న పల్నాడు బాధ్యతలను భూమన కరుణాకర్ రెడ్డికి, గుంటూరు జిల్లా బాధ్యతలను కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త మర్రి రాజశేఖర్ కు అప్పగిస్తూ, ఈ మూడు జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా మర్రితో పాటు ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి కొత్తగా బాధ్యతలు ఇచ్చారు. ఇది నిజంగా కొడాలికి బిగ్ షాక్ లాంటిందే.. మరోవైపు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ది అదే పరిస్థితి. అలాగే ఇప్పటివరకు అనిల్ కుమార్ చూసుకున్న వైయస్సార్, తిరుపతి జిల్లాలను నెల్లూరు ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి అప్పగించింది.

ఇదీ చదవండి: గుండు గీయించుకోవడమే శాపమా..? జాబ్ నుంచి తీసేసిన అధికారులు

ఇక మాజీమంత్రి అవంతి శ్రీనివాస్‌కు హైకమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. విశాఖ జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి అనూహ్యంగా తొలగించింది. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు అవకాశం కల్పించింది. గత ఎన్నికల ముందు.. తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరిన అవంతి.. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తొలి కేబినెట్‌లో టూరిజం మంత్రిగా పనిచేశారు. అయితే, కేబినెట్‌ విస్తరణలో పదవి పోయిన తర్వాత అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది హైకమాండ్.. కానీ, ఇప్పుడు ఆ పదవి నుంచి కూడా తప్పించింది.

ఇదీ చదవండి : రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ఒకే వేదికపైకి సీఎం జగన్, చంద్రబాబు.. ఎందుకంటే..?

పార్టీ నాయకత్వంతో విభేదాలు, సమన్వయం కొరవడడంతో కొంత కాలంగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అధ్యక్షతపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.. అదే సమయంలో ఆయన వ్యక్తిగత వ్యవహారాలు దుమారం రేపాయి. మహిళలతో సంభాషణలు ఆడియోలు లీక్ అవ్వడం, అవి తన వాయిస్‌లు కాదంటూ అవంతి వివరణ ఇచ్చుకోవడం జరుగుతోంది. కానీ, ఈ వ్యవహారం పార్టీ ప్రతిష్టాతకు ఇబ్బందికరంగానే మారిందట.. ఈ నేపథ్యంలో అవంతిని మార్చి అదే సామాజిక వర్గానికి చెందిన పంచకర్లకు అవకాశం కల్పించారని ప్రచారం జరుగుతోంది. ఇక కొడాలి నాని, అనిల్ కుమార్ లు అంత్యత విధేయులైనా.. అనిల్ ను తప్పించడానికి గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం సరిగ్గా నిర్వహించకపోవడం.. అలాగే సొంత పార్టీనేతలతో విబేధాలు.. కారణమని చెబుతున్నారు. మరి కొడాలి నానిని ఎందుకు తప్పించి ఉంటారన్నదినాపై వైసీపీ నేతల ఊహకు కూడా అందడం లేదు.

First published:

Tags: Andhra Pradesh, Anil kumar yadav, Ap cm jagan, AP News, Avanti srinivas, Kodali Nani

ఉత్తమ కథలు