టీడీపీ యువనేత విద్యార్థులతో ఏర్పాటు చేసిన జూమ్ సమావేశంలో వైసీపీ నేతలు కొడాలి నాని (Kodali Nani), వల్లభనేని వంశీ(Vallabaneni Vamsi) ప్రత్యక్షం కావడం దుమారం రేపింది. వైసీపీ నేతలు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని టీడీపీ విమర్శిస్తుంటే.. విద్యార్థులను రెచ్చగొట్టి వారిని రాజకీయం కోసం టీడీపీ వాడుకుంటోంది వైసీపీ విమర్శిస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారం ద్వారా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓ క్లారిటీ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ(TDP) నుంచి వైసీపీలో(YSRCP) చేరిన వంశీకి.. స్థానికంగా ఉండే వైసీపీ నేతలు దుట్టా రామచంద్రారావుతో విభేదాలు తీవ్రమయ్యాయి. సమస్యను పరిష్కరించేందుకు వైసీపీ నాయకత్వం స్వయంగా రంగంలోకి దిగినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. వంశీతో కలిసి పని చేసేందుకు తాను సిద్ధంగా లేనని దుట్టా స్పష్టం చేశారు.
దీంతో వైసీపీ నాయకత్వం వీరిలో ఎవరి వైపు మొగ్గుచూపుతుందనే దానిపై చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో వంశీపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన మళ్లీ టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరిగింది. దీంతో వైసీపీలో తనకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్లే వంశీ అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారేమో అనే టాక్ మొదలైంది. అయితే ఇలాంటి ఊహాగానాలకు వంశీ లేటెస్ట్ ఎపిసోడ్‌తో చెక్ పెట్టారు.
పదో తరగతి విద్యార్థులతో టీడీపీ యువనేత లోకేశ్ ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్‌లోకి కొడాలి నాని, వంశీ సడెన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరి ఆడియోను జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన టీడీపీ టీమ్ మ్యూట్ చేసింది. దీంతో వాళ్లు లోకేశ్‌తో ఏం మాట్లాడారనే దానిపై క్లారిటీ రాలేదు. అయితే టీడీపీని ఈ రకంగా ఇబ్బందిపెట్టడం ద్వారా తాను టీడీపీ వైపు చూడటం లేదనే విషయాన్ని వల్లభనేని వంశీ క్లారిటీ ఇచ్చారని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.
10th Result: కొడాలి నాని, వల్లభనేని వంశీలపై కేసు నమోదు చేయాలి.. దొంగల్లా చొరబడతారా అని ప్రశ్న
Kodali Nani:మీలా తయారు చేస్తారా..? జూమ్ మీటింగ్ కు హాజరుపై కొడాలి వివరణ.. ఏమన్నారంటే..
ఒకవేళ వంశీకి నిజంగానే మళ్లీ టీడీపీ వైపు వెళ్లే ఆలోచన ఉండి ఉంటే.. ఆయన టీడీపీని.. అందులోనూ లోకేశ్ జూమ్ మీటింగ్‌లోకి ఈ రకంగా ఎంట్రీ ఇచ్చి ఇబ్బంది పెట్టి ఉండరని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ అంశంపై ఆ తరువాత రియాక్ట్ అయిన వంశీ.. టీడీపీ విద్యార్థులతో రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. మొత్తానికి లోకేశ్‌ను ఆన్‌లైన్‌లో టార్గెట్ చేయడం ద్వారా ఎమ్మెల్యే వంశీ మళ్లీ బ్యాక్ టు టీడీపీ అనే ప్రచారానికి చెక్ చెప్పినట్టే కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Nara Lokesh, TDP, Vallabaneni Vamsi