హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ యూటర్న్.. టీడీపీ గొప్ప పార్టీ అంటూ పొగడ్తలు.. కారణం అదేనా..?

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ యూటర్న్.. టీడీపీ గొప్ప పార్టీ అంటూ పొగడ్తలు.. కారణం అదేనా..?

వల్లభనేని సైలెన్స్ కు కారణం అదేనా?

వల్లభనేని సైలెన్స్ కు కారణం అదేనా?

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ యూటర్న్ తీసుకోవాలి అనుకుంటున్నారా.. మొన్నటి వరకు జగన్ కు జై కొట్టి.. ఎమ్మెల్యేగా నెగ్గిన తెలుగు దేశం పార్టీకి దూరమయ్యారు.. అక్కడితోనే ఆగలేదు చంద్రబాబు, లోకేష్ లపై తీవ్రస్థాయి విమర్శలు చేశారు.. అలాంటి వంశీ.. తాజాగా టీడీపీ గొప్ప పార్టీ అంటూ వ్యాఖ్యలు చేయడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయన ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నదానిపై అటు వైసీపీ సైతం ఆరా తీస్తోంది.

ఇంకా చదవండి ...

  Vallabhaneni Vamsi: ఆంధ్రప్రేదశ్ (Andhra Pradesh) రాజకీయాల్లోగన్నవరం ఎమ్మెల్యే వల్లభ నేని వంశీ (Vallabaneni Vamsi) హాట్ టాపిక్ అవుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గాలిలోనూ టీడీపీ తరపున నెగ్గి తన బలం నిరూపించుకున్నారు. అయితే వైసీప అధికారంలోకి రావడంతో మొదట వంశీ సైలెంట్ అయ్యారు. కానీ తరువాత పరిణామాల నేపథ్యంలో ఒక్కసారి తన రూటు మార్చారు. టీడీపీ (TDP) నుంచి గెలిచి. అయితే టీడీపీ నుంచి గెలిచి జగన్ కు జై కొట్టిన నేతలు ఎవరూ చంద్రబాబును, లోకేష్ ను ఏమీ అనలేదు.. జగన్ పాలన నచ్చి టీడీపీకి దూరం అయ్యామని చెబుతూ వచ్చారు. కానీ వల్లభనేని మాత్రం.. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) లపై తీవ్ర విమర్శలు చేశారు. జై సీఎం జగన్ (CM Jagan) అంటూ.. వైసీపీ (YCP) గూటికి చేరారు.. అలా వంశీ టీడీపీ దూరం కావడానికి చాలా కారణాలే ఉన్నాయి. నారా లోకేష్ తో చాలా విషయాల్లో గ్యాప్ ఉండడం.. పరోక్షంగా తనను లోకేష్ టార్గెట్ చేశారనే అనుమానాలు వంశీకి ఉన్నాయి. దీనికితోడు.. వైసీపీలో ఉన్న అప్పటి మంత్రి కొడాలి నాని (Kodali Nani)తో ఉన్న సాన్నిహిత్యం.. అన్ని విషయాల్లో కొడాలి అండగా ఉంటారనే నమ్మకంతో సైకిల్ దిగారనే ప్రచారం ఉంది. అందుకే చంద్రబాబు, లోకేష్ లపై ఆ స్థాయిలో విమర్శలు చేశారు.. అలాంటి వంశీ ఇప్పుడు సడెన్ గా తెలుగు దేశాన్ని పొగడడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

  గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత వల్లభనేని వంశీకి, టీడీపీకి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు ఆయన దూరమయ్యారు. తాజాగా హనుమాన్ జంక్షన్ లో ఓ క్రికెట్ టోర్నీ బహుమతి ప్రదానోత్సవానికి వచ్చిన వల్లభనేని వంశీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ టీడీపీని విమర్శించలేదన్నారు. ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ చాలా గొప్పదని అభివర్ణించారు. టీడీపీ చెడ్డదని తాను ఎప్పుడూ అనలేదని వివరణ ఇచ్చారు. కేవలం లోకేశ్ చేతుల్లోకి వచ్చిన తర్వాత పార్టీ విధానాలు దెబ్బతిన్నాయని మాత్రమే విమర్శించానని స్పష్టం చేశారు. కానీ ఇంత సడెన్ గా ఆయన టీడీపీని ఎందుకు పొగడాల్సి వచ్చంది అన్నదే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది..

  ఇదీ చదవండి : జూన్ నుంచి జనంలోకి జనసేన.. ఉత్తరాంధ్రలో నాగబాబు పర్యటన.. అజెండా ఇదే

  ప్రస్తుతం గన్నవరం వైసీపీ రాజకీయాలు హాట్ హాట్ గానే ఉన్నాయి. వల్లభనేని వంశీగా.. వైసీపీలో ఉన్న నేతలంతా ఏకతాటిపైకి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో వంశీకి పోటీ చేస్తే వ్యతిరేకంగా పని చేస్తామని.. ఆయనతో కలిసి పని చేసే ప్రసక్తి లేదని అధిష్టానానికే నేరుగా చెప్పారు. వంశీని వైసీపీ కావాలి అంటే.. ఎప్పటినుంచో వైసీపీ లో ఉన్న నేతలను అధిష్టానం వదులుకోవాల్సి వస్తుంది. అందుకే రెండు వర్గాల మధ్య రాజీకి అధిష్టానం ప్రయత్నాలు చేసింది.. అందర్నీ కలుపుకొని వెళ్లాలని వంశీకి సూచించింది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వంశీ పేరు వింటేనే అక్కడి వైసీపీ నేతలు భగ్గు మంటున్నారు.

  ఇదీ చదవండి : చంద్రబాబుకు ఇదే ఫైనల్ ఎలక్షన్.. మహనాడుకు వచ్చింది అంతా వారే..

  తాను వంద శాతం వైఎస్సార్‌సీపీలోనే ఉంటానని వైఎస్సార్‌సీపీ నేత దుట్టా రామచంద్రరావు స్పష్టం చేస్తూనే... ఎమ్మెల్యే వంశీతో కలిసి పనిచేయనని తేల్చి చెప్పారు. ఎవరు చెప్పినా ఇది మారదని.. సజ్జలతో కూడా ఇదే చెప్పానన్నారు. 2024లో వంశీకే వైఎస్సార్‌సీపీ సీటు ఇస్తే ఓటు వేసి ఇంట్లో కూర్చుంటానన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు భార్యనే దూషించిన వ్యక్తి వంశీ.. అలాంటి వ్యక్తి ఏదైనా చేయగలరని.. కార్యకర్తల ఆవేదనను జగన్ దృష్టికి తీసుకువెళతాను అన్నారు. వైఎస్సార్‌సీపీ తమ పార్టీ అన్నారు. వైసీపీ నేతుల గట్టిగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ అధినేత జగన్.. టీడీపీ నుంచి వచ్చిన తనకు టికెట్ ఇస్తారని వందం శాతం చెప్పలేమని ఆయన అనుచరులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆయన.. టీడీపీని పొగిడి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, TDP, Vallabaneni Vamsi

  ఉత్తమ కథలు