హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Unstoppable 2: సీఎం సీఎం అంటూ కోలాహలం.. సందడిగా బావతో బాలయ్య టాక్ షో.. మంత్రుల సెటైర్లు.. ఏమన్నారంటే?

Unstoppable 2: సీఎం సీఎం అంటూ కోలాహలం.. సందడిగా బావతో బాలయ్య టాక్ షో.. మంత్రుల సెటైర్లు.. ఏమన్నారంటే?

బావతో బాలయ్య టాక్ షో

బావతో బాలయ్య టాక్ షో

Unstoppable 2: బాలయ్య క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన ఎక్కడకు వెళ్లినా జై బాలయ్య అనే నినాదం హోరెత్తుతుంది. తాజాగా బావాను బాలయ్య ఇంటర్వ్యూ చేస్తుంటే.. సీఎం సీఎం అంటూ అభిమానులు హల్ చల్ చేశారు.. మరోవైపు ఈ టాక్ షో పై ఏపీ మంత్రులు సెటైర్లు వేస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Unstoppable 2: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం.. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. టాక్ షోకు హాజరు కావడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. అందుకు కారణం ఆ టాక్ షోను హోస్ట్ చేస్తున్నది నందమూరి బాలయ్యే (Nandamuri Balayya).ఇప్పటికే అన్‌స్టాపబుల్ (Unstoppable ) సీజన్ వన్ సూపర్ సక్సెస్ అయ్యింది. బాలయ్య క్రేజ్ ను రెట్టింపు చేసింది. ఆ షో సక్సెస్ కు తోడు.. అఖండ సినిమా (Akhanda) తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు నందమూరి హీరో.. ఇలా జోష్ లో ఉన్న ఆయన.. ఇప్పుడు అన్‌స్టాపబుల్ సీజన్ 2తో ప్రజల ముందుకు వస్తున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ఇది టెలికాస్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన ప్రీ ఫంక్షన్‌ కూడా గ్రాండ్ జరిగింది.

  తొలి ఎపిసోడ్ కు గెస్ట్ గా చంద్రబాబు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. వీరిద్దరి మధ్య ఎలాంటి చర్చ జరుగుతుంది. వియ్యంకులైన వీరు.. ఎప్పుడు సరదగా మాట్లాడుకోవడం.. అభిమానులు చూసి ఉండరు.. దీంతో ఇప్పుడు టాక్ షోలో వీరి మధ్య మాటలు ఎలా ఉంటాయని తెలుసుకోవాలని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. తొలి సీజన్ లో డేరింగ్ ప్రశ్నలతో గెస్ట్ లను షేక్ చేసిన.. బాలయ్య మరి బావతో ఆటాడుకుంటారా.? లేకా మర్యాద ఇస్తూ.. అడిగి అడగనట్టు వదిలేస్తారా? అసలు వీరిద్దరి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయి అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  టీడీపీ , నందమూరి అభిమానులు ఈ షో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే.. ఇటు సోషల్ మీడియాలో దీనిపై సెటైర్లు పేలుతున్నాయి. ఇటు వైసీపీ మంత్రులు సైతం.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. చంద్రబాబు అసెంబ్లీని కాదని బామ్మర్ది షోకు వెళ్లారని ఎద్దేవా చేస్తూ మంత్రి అంబటి ట్వీట్ చేశారు. చంద్రబాబు బామ్మర్ది షోకు వెళ్లగా.. సీఎం జగన్ మాత్రం జనంలోకి వెళ్తున్నారని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అందుకే ‘175 అన్‌స్టాపబుల్’ అంటూ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

  ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో 175 సీట్లే లక్ష్యంగా వైసీపీ వ్యూహారచనలు చేస్తోంది. సీఎం జగన్ సైతం ప్రతి సమీక్షలో ఇదే విషయం నేతలకు చెబుతున్నారు. ఆ దిశగా అందర్నీ సిద్ధం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తే 175 సీట్లు సాధించడం అసాధ్యమేమీ కాదని జగన్ పదే పదే చెప్తున్నారు. అందుకే అంబటి.. ఇలా సెటైర్లు వేశారు జగన్ 175 అన్‌స్టాపబుల్ అంటూ జనాల్లోకి వెళ్తుంటే.. చంద్రబాబు అసెంబ్లీకి డుమ్మా కొట్టి.. బావమరిది షోకు వెళ్లారంటూ ఎద్దేవ చేశారు.

  ముఖ్యంగా ఈ షో ద్వారా ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి దించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సమయంలో ఏం జరిగిందనే అంశంపై బాలకృష్ణ, చంద్రబాబు అన్‌స్టాపబుల్ సీజన్ 2 షోలో క్లారిటీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ అంశంపై ఇద్దరు ఓపెన్ గా మాట్లాడి. అసలు ఏం జరిగింది అన్నదానిపై క్లారిటీ ఇస్తే.. మరో అశం రాజకీయాల్లో చర్చగా మారుతోంది. టీడీపీ శ్రేణులకు ఇది ఒక బూస్ట్ గా మారుతందని అంచనా వేస్తున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Ambati rambabu, Andhra Pradesh, Ap cm jagan, Chandrababu Naidu, Nandamuri balakrishna

  ఉత్తమ కథలు