హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Unstoppable 2: అలాంటి వ్యక్తుల్లో వైఎస్ఆర్ ఒకరు..? ఆయనపై బాలయ్యకు అంత ప్రేమకు కారణం అదేనా?

Unstoppable 2: అలాంటి వ్యక్తుల్లో వైఎస్ఆర్ ఒకరు..? ఆయనపై బాలయ్యకు అంత ప్రేమకు కారణం అదేనా?

వైఎసఆర్ ను బాలయ్య అంత అభినిస్తారా..?

వైఎసఆర్ ను బాలయ్య అంత అభినిస్తారా..?

Unstoppable 2: హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయాల్లో ఉన్న బాలయ్య.. వైఎస్ఆర్ ఫ్యామిలీపై విమర్శలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ తొలి సారి ఆయన వైఎస్ఆర్ పై మనసులో బయటపెట్టారు. ఇంతకీ రాజశేఖర్ రెడ్డిపై ఆయన ఏం చెప్పారంటే..?

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Unstoppable 2:  నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్-2 టాక్ షో సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. తాజాగా కొత్త ఎపిసోడ్ సైతం ఏపీ రాజకీయ చర్చకు దారి తీస్తోంది. కొత్త ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను ఆహా ఓటీటీ లేటెస్ట్ గా విడుదల చేసింది. అయితే ఇందులో బాలయ్య చేసిన వ్యాఖ్యలు సరికొత్త రాజకీయానికి తెరలేపింది. ఎందుకంటే నందమూరి వర్సెస్ వైఎస్ ఫ్యామిలీ రాజకీయ విబేధాలు ఇప్పటివి కాదు. చాలా సందర్భాల్లో వైఎస్ఆర్ ను విమర్శించారు.. కానీ తాజా ఎపిసోడ్ లో బాలయ్య వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా కనిపించాయి. ఇందులో బాలకృష్ణ మాట్లాడుతూ, ఇటీవల బాలయ్య కుటుంబాన్ని చూశారు, ఇప్పుడు బాలయ్య స్నేహాన్ని చూస్తారు అన్నారు. ఆ వెంటనే తన కాలేజీ స్నేహితులైన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డిలను ఆహ్వానించి, వారితో అనేక ముచ్చట్టు పంచుకున్నారు.

ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బతికుండబట్టే తాను సీఎం అయ్యానని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదాన్ని ప్రస్తావించారు. ఓ సీనియర్ మంత్రి వైఎస్సార్ ను తప్పుదోవ పట్టిస్తుండేవారని వెల్లడించారు. అనంతరం బాలయ్య అందుకుని, మనం గొప్ప నేతలను, వ్యక్తులను కోల్పోయామని, అలాంటివారిలో రాజశేఖర్ రెడ్డి ఒకరని ఆయనపై తన మనసులో ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

అయితే బాలయ్య ఆయనపై ఇలా అభిమానం చూపించడానికి బలమైన కారణమే ఉంది అంటున్నారు. ఎందుకంటే అప్పట్లో ఓ నిర్మాతపై తన ఇంట్లో బాలకృష్ణ జరిపిన కాల్పుల వ్యవహారం సంచలనంగా మారింది. ఆ తర్వాత కేసు మాఫీ అయింది. బాలకృష్ణ మానసిక పరిస్థితి సరిగా లేదని సర్టిఫికెట్ తెచ్చుకున్నారని, ప్రతివాదులు కూడా వెనక్కు తగ్గడంతో కేసు రద్దయిందనే ప్రచారం ఉంది. అయితే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. బాలకృష్ణపై ప్రతీకారం తీర్చుకోవాలనుకోలేదని, వైఎస్సార్ చలవతోనే ఆ కేసు మాఫీ అయిందనే ప్రచారం ఉంది.

ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంటే వైఎస్సార్ కి కూడా అభిమానమేనని చెబుతున్నారు. అంతేకాదు వైఎస్ జగన్ సైతం.. నందమూరి బాలయ్య అభిమాని అన్నది అందరికీ తెలిసిందే.. వారి మధ్య రాజకీయంగా మాటలు తూటాలు పేలుతున్నా.. ఆయా కుటుంబాలకు ఒకరిపై ఒకరంటే అభిమానం ఉందని ప్రచారం ఉంది. అయితే ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో బాలకృష్ణ.. వైఎస్సార్ పై తీవ్రంగా స్పందించారని, ఆయన అభిమానుల్ని కుక్కలతో పోల్చారు.. అలాంటి బాలయ్య.. ఇప్పుడు వైఎస్ర్ ఆకాశానికి ఎత్తేయడానికి అదే కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

First published:

Tags: Andhra Pradesh, AP News, Nandamuri balakrishna, Ys rajashekar reddy

ఉత్తమ కథలు