హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Unstoppable 2 with NBK: బాలయ్య షోలో ఏపీ క్యాపిటల్‌ హీట్.. 3 రాజధానులపై మాజీ సీఎం, స్పీకర్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Unstoppable 2 with NBK: బాలయ్య షోలో ఏపీ క్యాపిటల్‌ హీట్.. 3 రాజధానులపై మాజీ సీఎం, స్పీకర్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

మూడు రాజధానులపై మాజీ సీఎం కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మూడు రాజధానులపై మాజీ సీఎం కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Unstoppable 2 with NBK: బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న టాక్ షో ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. రెండో సీజన్ తొలి ఎపిసోడ్ లోనే వావ బాలయ్య.. అల్లుడి లోకేష్ తో బాలయ్య చెప్పించిన విషయాలు ఏపీ రాజకీయాలను కుదిపేశాయి. మరోసారి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి తో టాక్ షో కూడా పొలిటికల్ హీట్ పెంచేలానే ఉంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

Unstoppable 2 with NBK: నందమూరి నట సింహం బాలకృష్ణ (Nandamuri Bala Krishna) హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్‌షో అన్‌స్టాపబుల్ సీజన్ 2  (Unstoppable 2 )రికార్డులు క్రియేట్ చేస్తోంది. అంతేకాదు రాజకీయంగా సంచలనంగా మారుతోంది. అయితే మొదటి సీజన్‌లో కేవలం సినిమా సెలబ్రిటీలనే ఆహ్వానించిన ఆహా నిర్వాహకులు రెండో సీజన్‌కు మాత్రం కాస్త పొలిటికల్‌ టచ్‌ ఇవ్వడం.. అందులోనూ ఎమ్మెల్యే బాలయ్య (MLA balayya) హోస్ట్ కావడంతో.. ఏపీలో ఈ టాక్ షో రాజకీయల్లో సంచలనంగా మారుతోంది. గెస్టులుగా హాజరైన వ్యక్తులు చెప్పే అంశాలు ఏపీ రాజకీయాలతో ముడిపడి ఉండడంతో ఉత్కంఠ పెంచుతోంది. సీజన్ 2 తొలి ఎపిసోడ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ని అతిథిగా ఆహ్వానించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక రెండో ఎపిసోడ్‌కు యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ హాజరు కాగా మూడో ఎపిసోడ్‌కు శర్వానంద్, అడవి శేష్ హాజరయ్యారు. ఇప్పుటు నాలుగో ఎపిసోడ్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ ఎపిసోడ్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Nallali Kiran Kumar Reddy), మాజీ స్పీకర్‌ సురేశ్‌ రెడ్డి (Suresh Reddy) ముఖ్య అతిథులుగా ఆహ్వానించి మరోసారి పొలిటికల్‌ టచ్‌ చేశారు. దీంతో వారు చేసిన వ్యాఖ్యులు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారే అవకాశం కనిపిస్తోంది.

నాలుగో ఎపిసోడ్‌కు సంబంధించి ఇప్పటికే ఒక ప్రోమోను విడుదల చేసింది ఆహా బృందం. ఇందులో కిరణ్ కుమార్ రెడ్డి, బాలకృష్ణ మధ్యల స్నేహబంధం, కాలేజ్‌ డేస్‌లో వీరిద్దరు చేసిన అల్లరి పనులను చాలా చక్కగా చూపించారు. ఆ ఎపిసోడ్ లో పెద్దగా రాజకీయల ప్రస్తావన లేదు. కానీ తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించి మరో ప్రోమో విడుదలైంది. ఇందులో మాత్రం పొలిటికల్‌ విషయాలను టచ్‌ చేశారు బాలయ్య.

United by friendship, divided by views. When both stalwarts discuss politics, debbaku thinking maarpothundhi. Don't miss episode 4, ee shukravaram aha lo!

ముఖ్యంగా ఏపీలో మూడు రాజధానులకు సంబంధించి కిరణ్‌కుమార్‌, సురేశ్‌ రెడ్డిలపై ప్రశ్నల వర్షం సంధించారు. మూడు రాజధానులకు మాజీ సీఎం, మాజీ స్పీకర్లు ఎలా స్పందించారు. వారి సమాధానం ఏమై ఉంటుంది అన్నది ఉత్కంఠ పెంచుతోంది. ప్రమో వరకు చూస్తే.. దీనికి ‘ముందు ఉన్న పరిస్థితులు వేరు.. ఇప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న లిటిగేషన్స్‌తో ‘అంటూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు కిరణ్ కుమార్..

అయితే ఆయన పూర్తి సమాధానం ఏమై ఉంటుందా అని అంతా ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇదే విషయమై ‘భిన్నత్వంలో ఏకత్వం కాదు.. భిన్నత్వమే ఏకత్వం’ అంటూ మూడు రాజధానులపై ఇంట్రెస్టింగ్‌ ఆన్సర్‌ ఇచ్చారు సురేశ్‌ రెడ్డి.

ఇదీ చదవండి : రేప్ కు గురి కాకుండా క్షణాల్లో మహిళను కాపాడిన దిశా యాప్.. అసలు ఏం జరిగింది అంటే..? యాప్ ఎలా ఉపయోగించాలి?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా రచ్చ రచ్చ అవుతున్న మూడు రాజధానులతో పాటు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోన్న పాలిటిక్స్‌పై కిరణ్‌ కుమార్‌ రెడ్డి, సురేశ్‌ రెడ్డిలు ఏం చెప్పారు.. జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టారా.. లేక ఇంకమైనా సామాధానం చెప్పారా..? అన్నది ఉత్కంఠ పెంచుతోంది. సీజన్ 2 లో నాలుగో ఎపిసోడ్ ఈ శుక్రవారం అంటే నవంబర్‌ 25న.. విడుదల కానుంది. ఆ రోజే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. తాజా ప్రోమో చూస్తుంటే.. ఈ ఎపిసోడ్ కూడ రాజకీయ రచ్చకు వేదిక అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

First published:

Tags: Andhra Pradesh, AP News, Nallari Kiran Kumar Reddy, Nandamuri balakrishna, Unstoppable With NBK S2

ఉత్తమ కథలు