హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Unstoppable 2: అన్ స్టాపబుల్-2 సెట్ కు ఇంటి భోజనం పట్టుకొచ్చిన ప్రభాస్.. బాలయ్యకు ఇష్టమైన వంటకాలు ఇవే..

Unstoppable 2: అన్ స్టాపబుల్-2 సెట్ కు ఇంటి భోజనం పట్టుకొచ్చిన ప్రభాస్.. బాలయ్యకు ఇష్టమైన వంటకాలు ఇవే..

బాలయ్యకు ఇష్టమైన ఇంటి భోజనం తెచ్చిన ప్రభాస్

బాలయ్యకు ఇష్టమైన ఇంటి భోజనం తెచ్చిన ప్రభాస్

అన్ స్టాపబుల్ టాక్ షో సీజన్ 2.. లేటెస్ట్ ఎపిసోడ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.. అందుకు కారణంగా లేటెస్ట్ ఎపిసోడ్ షూటింగ్ .. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చారు. అంతేకాదు చాలా విషయంలో బాలయ్యతో పంచుకున్న ఆయన.. బాలయ్యకు ఎంతో ఇష్టమైన భోజనం ఇంటి నుంచి పట్టుకొచ్చినట్టు తెలుస్తోంది.. అవి ఏంటో తెలుసా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Unstoppable 2: నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) ఆహా ఓటీటీ (OTT) వేదికపై రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. టాక్ షోతో ఓటీటీ ఫ్లాట్ ఫాంను షేక్ చేస్తున్నారు. ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ 2 షో (Unstoppable 2 Show ) కి హోస్ట్ గా చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం విజయవంతంగా రన్ అవుతోంది. గతంలో వచ్చిన అన్‌స్టాపబుల్ ప్రోగ్రాం సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో అదే ఊపులో ఈ ప్రోగ్రాం రెండో సీజన్ నడిపిస్తున్నారు. సెకెండ్ సీజన్ లో తొలి ఎపిసోడ్ కోసం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), లోకేష్ (Lokesh) లను తీసుకొచ్చి ఈ సీజన్‌కి పర్ఫెక్ట్ ఓపెనింగ్ ఇచ్చిన బాలకృష్ణ.. తదుపరి ఎపిసోడ్స్ లో కూడా అదే హవా నడిపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ సెలెబ్రిటీలు ఈ షోకి వచ్చి బాలయ్య వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.తాజా ఎపిసోడ్ కోసం ప్రభాస్ తో పాటు ఆయన స్నేహితుడైన మరో హీరో గోపీచంద్‌ కూడా అన్‌స్టాపబుల్ వేదికపైకి వచ్చేశారు.

తాజాగా ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా ఫినిష్ కావడంతో ఆహా టీమ్ ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోస్ వదిలింది. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా కొన్ని విషయాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకడైన ప్రభాస్ మాంచి భోజనప్రియుడు.. అంతేకాదు అతిథులకు అదిరిపోయే రుచులతో విందుభోజనాలు ఏర్పాటు చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా.

తాజాగా, ప్రభాస్ అన్ స్టాపబుల్-2 టాక్ షోకు విచ్చేశారు. తన మిత్రుడు, టాలీవుడ్ హీరో గోపీచంద్ తో కలిసి లేటెస్ట్ ఎపిసోడ్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ చిత్రీకరణకు వస్తూ, తమ ఇంటి నుంచి నోరూరించే వంటకాలను కూడా తీసుకువచ్చారని తెలుస్తోంది. వేటమాంసం కూర, పీతల ఇగురు, చేపల పులుసు, కోడికూర, సాంబారు, పప్పు, ఆవకాయ తదితర వంటకాలతో హోస్ట్ నందమూరి బాలకృష్ణకు పసందైన విందు ఏర్పాటు చేశారట. బాలయ్యకు ఇష్టమైన వంటకాలు ఏంటో ముందే తెలుసుకున్న ప్రభాస్ ఆ మేరకు తన ఇంట్లో వండించినట్టు తెలిసింది.

ఇదీ చదవండి : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి గంటా.. ఏం చెప్పారంటే..?

సాధారణంగా ప్రభాస్ అంటే డార్లింగ్.. డార్లింగ్ అంటే ప్రభాస్.. ఇదే కదా ట్రెండ్. ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ యంగ్ రెబల్ స్టార్ పై ప్రశ్నల వర్షం కురిపించారట నందమూరి బాలకృష్ణ . ముఖ్యంగా ప్రభాస్ పెళ్లిపై స్పెషల్ ఫోకస్ పెట్టి జనాల్లో ఉన్న అనుమానాలకు ఆన్సర్ రాబట్టే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.

ఇదీ చదవండి : వైసీపీ ప్రభుత్వంపై భారీ కుట్ర.. సంచలనంగా మారిన మంత్రి వ్యాఖ్యలు

నందమూరి బాలకృష్ణ, ప్రభాస్‌ ఇద్దరూ ఒకే వేదిక పంచుకోవడం ఇదే తొలిసారి.. దీంతో ఇటు నందమూరి.. అటు రెబస్టార్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అంటున్నారు. ఎంతో రిజర్వుడుగా ఉండే ప్రభాస్ ఒకవైపు, రఫ్ అండ్ టఫ్ గా డీల్ చేసే బాలయ్య మరో వైపు ఉండటంతో ఈ కార్యక్రమం ఎలా ఉండబోతోందో అంటూ వీక్షకులు క్యూరియాసిటీ ఫీలవుతున్నారు. ఇప్పటికే బాలయ్య అభిమానులు, ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. నెటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి : ఎడతెరిపి లేని వానలతో ఆహ్లాద‌క‌రంగా తిరుమల.. ఎటు చూసినా సుందర దృశ్యాలే

బాహుబలి మొదటి పార్ట్ సినిమా రాక ముందు స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కె. రాఘవేంద్రరావు నిర్వహించిన ఈటీవీ టాక్ షో సౌందర్య లహరిలో ప్రభాస్ చివరిసారిగా కనిపించాడు. అయితే అన్ స్టాపబుల్ మాత్రం ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా అన్ స్టాపబుల్ షోకు రాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. షూటింగులతో బిజీగా గడుపుతోన్న పవన్ కళ్యాణ్ తో బాలయ్య అన్ స్టాపబుల్ మరో సంచలనానికి దారితీయనుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్  షోకు వచ్చేందుకు అంగీకరించారని తెలుస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Nandamuri balakrishna, Prabhas, Unstoppable With NBK S2

ఉత్తమ కథలు