హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Delhi: 2ఏళ్లలో స్టార్టప్ రిజిస్ట్రేషన్ ఏపీలో 65శాతానికి పెరిగింది..ఎంపీ నత్వానీ ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం

Delhi: 2ఏళ్లలో స్టార్టప్ రిజిస్ట్రేషన్ ఏపీలో 65శాతానికి పెరిగింది..ఎంపీ నత్వానీ ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం

Parimal Natwani(file)

Parimal Natwani(file)

Delhi: గడిచిన రెండేళ్లలో ఏపీలో స్టార్టప్ రిజిస్ట్రేషన్‌లు ఎంత శాతం పెరిగాయని రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీసోమ్‌ ప్రకాష్ సమాచారం ఇచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో గత రెండేళ్లలో స్టార్టప్‌ల సంఖ్య 65శాతానికి పెరిగింది. 2020-2022లో 231 నుండి 382కు పెరిగింది. జాతీయ స్థాయిలో పరిశ్రమల ప్రోత్సాహం మరియు అంతర్గత వాణిజ్య విభాగం (DPIIT) ద్వారా స్టార్టప్‌లుగా గుర్తించబడిన సంస్థల సంఖ్య 2020-2022లో 14,498 నుండి 26,542కి పెరిగింది. వాణిజ్య మరియు పరిశ్రమలశాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్ ప్రకాష్ (Som Prakash )శనివారం మార్చి 24 2023న రాజ్యసభలో పార్లమెంటు సభ్యుడు పరిమల్ నత్వానీ(MP Parimal Natwani)అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ సమాచారాన్ని అందించారు.

ఏపీ స్టార్టప్ రిజిస్ట్రేషన్‌లో 65శాతం వృద్ది..

కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి అందించిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో DPIIT ద్వారా స్టార్టప్‌లుగా గుర్తించబడిన సంస్థల సంఖ్య 2020లో 231 ఉండగా 2021లో 296 చేరింది. 2022లో 382 కాగా, 2023 ఫిబ్రవరి 28 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 110 స్టార్టప్‌లుగా గుర్తించబడ్డాయి. గడిచిన నాలుగేళ్లలో మొత్తం స్టార్టప్‌ సంస్థల సంఖ్య 1,019గా ఉందని కేంద్రమంత్రి పార్లమెంట్‌లో చెప్పడం జరిగింది.

లెక్కలతో సహా ఆధారాలు...

2016లో స్టార్టప్ ఇండియా ఇనీషియేటివ్ ప్రారంభించినప్పటికి నుండి DPIIT 28 ఫిబ్రవరి 2023 నాటికి 92,683 ఎంటిటీలను స్టార్టప్‌లుగా గుర్తించింది. (2021,2022,2023) గడిచిన మూడేళ్లతో పాటుగా ప్రస్తుత సంవత్సరం (28 ఫిబ్రవరి 2023) నాటికి (DPIIT) ద్వారా 67,223 స్టార్టప్‌లు గుర్తించబడ్డాయి. అన్నీ రంగాల వారీగా చూసుకుంటే అత్యధికంగా 7,587 ఐటి సర్వీసెస్‌లో 6,459 హెల్త్‌కేర్‌ మరియు లైఫ్ సైన్సెస్‌లోను అలాగే 4,164 ఎడ్యుకేషన్ స్టార్టప్‌లుగా రిజిస్ట్రేషన్‌ చేయబడ్డాయని కేంద్రమంత్రి పార్లమెంట్లో సమాచారం అందించారు.

పార్లమెంట్‌లో వెల్లడించిన కేంద్రమంత్రి..

గడిచిన మూడేళ్లతో పాటు ఈ ఏడాదిలో దేశంలో నమోదైన స్టార్టప్‌ల సంఖ్య అదే సమయంలో యూనికార్న్‌గా మారిన స్టార్టప్‌ల సంఖ్యతో పాటుగా దేశంలో స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న/తీసుకుంటున్న చర్యల గురించి పరమిళ్ నత్వానీ సమాచారాన్ని తెలుసుకోవాలని అనుకున్నారు.

Breaking News: శుభవార్త..ఖాతాల్లోకి 'వైఎస్సార్ ఆసరా' నిధులు జమ చేసిన సీఎం జగన్

కేంద్ర ప్రభుత్వం పాత్ర..

ఇందులో భాగంగానే కేంద్రమంత్రి ఇచ్చిన సమాచారం ప్రకారం స్టార్టప్ ఇండియా చొరవతోనే దేశంలో స్టార్టప్ మరియు పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరంగా వివిధ ప్రయత్నాలను చేపడుతుంది. స్టార్టప్‌ల కోసం ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్), స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (SISFS) మరియు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ (CGSS) స్టార్టప్‌ల ద్వారా వారి వ్యాపార వృద్ధి కావటానికీ వివిధ దశలలో స్టార్టప్‌కు మద్దతు ఇస్తాయని కూడా తెలియజేశారు. స్టార్టప్‌లు ఏంజిల్ ఇన్వెస్టర్లు లేదా వెంచర్ క్యాపిటలిస్టుల నుండి పెట్టుబడులను సేకరించ గలిగే స్థాయి లేదా వాణిజ్య బ్యాంకులతో పాటు ఆర్థిక సంస్థల నుండి రుణాలు పొందగలరు.

First published:

Tags: Andhra pradesh news, Parimal Nathwani

ఉత్తమ కథలు