Home /News /andhra-pradesh /

AP POLITICS UNEXPECTED CALL TO EX CHIEF MINSTER N KIRAN KUMAR REDDY FROM CONGRESS WILL HE ACCEPT NGS

Kirankumar ReddY: మాజీ సీఎంకు బంపర్ ఆఫర్.. సడెన్ గా తెరపైకి రావడం వెనుక వ్యూహం అదేనా?

మళ్లీ తెరపైకి మాజీ సీఎం

మళ్లీ తెరపైకి మాజీ సీఎం

Ex CM Kiran Kumar Reddy: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.. అలాంటి నేత పేరు ఒక్కసారి ఎవరూ ఊహించని విధంగా తెరపైకి వచ్చింది.. మరి ఆయన నిజంగానే యాక్టివ్ అవుతున్నారా..? కష్టాల్లో ఉన్న పార్టీ బాధ్యతలు మోయడానికి సిద్ధమవుతారా..?

ఇంకా చదవండి ...
  Ex CM Kiran Kumar Reddy: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. అధికార పార్టీతో సహా.. విపక్షాలు సైతం గెలుపు తలుపులు తెరిచేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి. వైసీపీ (YCP) ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది. ఇటు ప్రధాన ప్రతిపక్ష అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సైతం.. బాదుడే బాదుడు పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మరోవైపు మహానాడు నుంచి ప్రజా యాత్రలకు కీలక నేతలు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ (Ex Minster Nallari Kiran Kumar Reddy) రెడ్డి ఢిల్లీ పర్యటన (Delhi Tour)కు వెళుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం (Congress) నుంచి వచ్చిన పిలుపు మేరకు ఆయన ఢిల్లీ వెళుతున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజులపాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు పలువురు సీనియర్ నేతలతో ఆయన సమావేశం అవుతారని ప్రచారంలో ఉంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఢిల్లీ అధిష్టానం ఆయనతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దేశ వ్యాప్తంగా పార్టీ పటిష్టతపై ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే అధిష్టానం కీలక నిర్ణయాలను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా ఏపీపైనా ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం. 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలు తిరిగి పార్టీలోకి రప్పించేందుకుగాను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుంది. ఈ మేరకు మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిలను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ ఉమెన్ చాందీ ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలను ఆదేశించారు. పార్టీ రాస్ట్ర వ్యవహరాల ఇంచార్జీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రానికి చెందిన నేతలకు సూచించారు.

  ఇదీ చదవండి : ఎలన్ మస్క్ కు ఐడియాలు ఇచ్చే చందబ్రాబుకు.. జూనియర్ ఎన్టీఆర్ పేరు వింటే భయమేలా?

  గతంలోనే ఈ ప్రయత్నాలు జరిగాయి. మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డితో చర్చలు జరిపే బాధ్యతను మాజీ కేంద్రమంత్రి పళ్లంరాజుకు అప్పగించారు. 2014 ఎన్నికల తర్వాత క్రియాశీలక రాజకీయాలకు మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి దూరంగా ఉన్నారు. అయితే 2014 తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో BJP లో చేరుతారనే ప్రచారం కూడ కొంతకాలం సాగింది. అయితే ఆయన ఏ పార్టీలో కూడ చేరలేదు. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు  టిడిపిలో చేరారు.

  ఇదీ చదవండి: అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు.. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు? ఎక్కడంటే?

  కాంగ్రెస్ పార్టీలోనే కిరణ్ కుమార్ రెడ్డి చేరేందుకు మొగ్గుచూపినట్టు సమాచారం. తమ స్వగ్రామానికి చెందిన తన సన్నిహితులు, మిత్రులు, అనుచరులతో కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయమై చర్చించారని ప్రచారం సాగింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కిరణ్‌కుమార్ రెడ్డికి పీసీసీ చీఫ్ లాంటి పదవిని అప్పగించే అవకాశం ఉందని ప్రచారం కూడ లేకపోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కూడ ఆయనకు సూచించారని కిరణ్ సన్నిహితుల్లో అప్పట్లో ప్రచారంలో ఉంది. 2019 నవంబర్ 21న కూడా కిరణ్ కుమార్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై కూడా స్పష్టత ఇచ్చారు. తనకు PCC చీఫ్ పదవిపై అంతగా ఆసక్తి లేదని తేల్చి చెప్పేశారు.

  ఇదీ చదవండి : మూడు పార్టీలు ఫిక్స్ అయ్యాయా..? రెబల్ ఎంపీ సేఫ్ జోన్ లో ఉన్నారా..? త్రిముఖ వ్యూహం ఇదేనా..?

  ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే ఎందో భాదేస్తుందన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించానని గుర్తు చేశారు. పరిణామాలు చూసి తనకు రాజకీయాలపట్ల అసంతృప్తి కలిగిందన్నారు. ఇకపోతే ఏపీ పీసీసీ చీఫ్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Congress

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు