రిపోర్టర్ :సంతోష్
లొకేషన్: వరంగల్
హనుమకొండ జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం చెలరేగింది. ఇంతటి హైటెక్ యుగంలో కూడా మూఢనమ్మకాలను కల్గి ఉండటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది.
గుప్తనిధుల తవ్వకాల పేరుతో క్షుద్ర పూజల ఘటన హనుమకొండలో వెలుగులోనికి వచ్చింది.
హనుమకొండ జిల్లా నడికుడ మండలం కౌకొండ, ధర్మారం, వెలంపల్లి గ్రామ సమీపంలోగుప్త నిధుల కోసం ఓ ముఠా తవ్వకాలు జరిపారు. అసలు ఈ గుప్త నిధులు ఉన్నాయో లేదో తెలియదు గాని హనుమకొండ జిల్లాలో తెగ తవ్వేస్తున్నారు. ఈ అంశం పోలీసులకు సవాల్ గా మారింది. పాత కోటలు, ఆలయ సమీప ప్రాంతాల్లో లక్ష్యంగా చేసుకొని కేటుగాళ్లు ఈ తవ్వకాలు జరుగుతున్నారు.
గుప్త నిధుల కోసం తవ్వే క్రమంలో చేస్తున్న క్షుద్ర పూజలు, బలుల ఆనవాళ్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వెలంపల్లి గ్రామ సమీపంలో గుప్తనిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్టు స్థానికులు గుర్తించారు. క్షుద్ర పూజల అనవాళ్లను చూసి స్థానికులు బయందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.
కొందరు అగంతకులు క్షుద్ర పూజలు చేయడం స్థానికుల్లో తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో నిర్మానుష్యమైన ప్రాంతంలో పాము పుట్టకు పసుపు, కుంకుమ జల్లి గుమ్మడికాయ, కొబ్బరికాయ కొట్టి సాంబ్రాణి, కర్పూరంతో పూజలు చేసి తవ్వకాలు జరిపారు. దుండగులు సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో దృశ్చర్యకు పాల్పడుతున్నారు.
అర్ధరాత్రి వేళలో పది మీటర్ల దూరం తవ్వకాలు కూడా జరిపారు. పసుపు కుంకుమలు చల్లి మిషన్లతో తవ్వకాలు చేసినట్లు గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఇలాంటి సంఘటనలు చూసి భయాందోళనకు ఉరవుతున్నారు చుట్టుపక్కల రైతులు. ఇప్పటికైనా ఈ గుప్త నిధుల తవ్వకాలను అరికట్టాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే రాత్రి సమయంలో పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal