Ugadi 2023: తెలుగు సంవత్సరాది ఉగాది అంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూసేది ఎవరి జాతకం (Horoscope) ఎలా ఉంటుంది అనే.. అయితే విశాఖపట్నం (Visakhapatnam) లోని శారదా పీఠం (Saradha Peetam)లోని జరిగిన పంచాంగ శ్రశణంలో తెలుగు రాష్ట్రాల సీఎంల జాతకాలు చెప్పారు.. దీనిబట్టి వచ్చే ఎన్నికలు అంటే 2024 ఎన్నికల్లో (Elections 2024) గెలవబోయేది ఎవరు.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కి మరో ఛాన్స్ ఇస్తారా..? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ఒక్క ఛాన్స్ ఇస్తారా..? తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కి ఆఖరి ఛాన్స్ దక్కేనా..? పండితులు ఏం చెప్పారంటే.. ఉగాది సందర్భంగా శారదాపీఠం గంటల పంచాంగాన్ని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాల సర్ప దోషం కారణంగా మూడేళ్లుగా దేశం ఇబ్బందులు పడిందన్నారు. అయితే ఈ ఏడాది చతుర్‌గ్రహ కూటమితో కొత్త సంవత్సరం ప్రారంభం అవుతోందన్నారు. దీని కారణంగా దేశానికి ఇబ్బందులు తప్పవు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాతకాలు బాగుండటంతో కొంత వరకు ఇబ్బందులు తొలగుతాయన్నారు. ఈ ఏడాదిలో ఎండలు, వడదెబ్బలు ఎక్కువగా ఉంటాయన్నారు. అలాగే జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగుతాయి అని స్పష్టం చేశారు. ఇంకా తెలుగు రాష్ట్రాల సీఎంల భవిష్యత్తుపైనా క్లారిటీ ఇచ్చారు.
మొదట రాజశ్యామల అమ్మవారికి నివేదించిన ఉగాది పచ్చడిని భక్తులకు పంచారు. జ్యోతిప్రజ్వలనతో విశాఖ శ్రీ శారదాపీఠంలో ఉగాది ఆస్థానం ప్రారంభమైంది. అంతకుముందు పీఠం ఆస్థాన సిద్ధాంతి తెన్నేటి శ్రీనివాస శర్మ పంచాంగ శ్రవణం చేసారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతాయన్నారు. సీఎం జాతకం దృష్ట్యా ఇబ్బంది ఉండదని తెలిపారు.
ఇదీ చదవండి : గంటా రాజీనామా ఆమోదం..? ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వైసీపీ రివర్స్ షాక్..!
ఈ ఏడాది అంతా సీఎం జగన్ అద్భుతమైన కాలం నడుస్తోంది.. అన్ని రంగాల్లో ఆయన విజయం సాధిస్తారు అన్నారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ , ప్రధాని మోదీ జాతకం కూడా బాగుంది న్నారు. అంతే మళ్లీ ఆ ముగ్గురు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అంటే ఈ ఏడాది ఎన్నికలు జరిగే ఆయనే మళ్లీ సీఎం అయ్యే అవకాశం ఉందని పరోక్షంగా సూచింరారు. ఉత్తరాది రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు అధికమై, మరణాలు సంభవిస్తాయని వివరించారు. అన్ని రాష్ట్రాల్లోను వాహన ప్రమాదాలు చోటుచేసుకుంటాయని తెలిపారు. ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బలు చూడాల్సి వస్తుందని తెలిపారు.
బ్రహ్మ సృష్టించిన రోజుగా ఉగాదిని జరుపుకుంటున్నామని, ఉగాది వేడుకలను నిర్వహించి పంచాంగ శ్రవణం వినిపించడం విశాఖ శ్రీ శారదాపీఠం సంప్రదాయంగా పాటిస్తోందని అన్నారు. ఉగాది వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Horoscope, Ugadi 2023