హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan-Nellore: నెల్లూరు జిల్లాలో వైసీపీకి వరుస షాక్‌లు.. కోటంరెడ్డి తరువాత మరో ఎమ్మెల్యే అసంతృప్తి గళం

YS Jagan-Nellore: నెల్లూరు జిల్లాలో వైసీపీకి వరుస షాక్‌లు.. కోటంరెడ్డి తరువాత మరో ఎమ్మెల్యే అసంతృప్తి గళం

ఏపీ సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

ఏపీ సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

AP Politics: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ అధినాయకత్వం తీరుపై అసంతృప్తి గళం వినిపించారు. పార్టీ పరిశీలకుడు ధనుంజయరెడ్డి తీరును ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తప్పుబట్టారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

నెల్లూరు(Nellore) జిల్లాలో అధికార వైసీపీకి సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి అసంతృప్తి గళాలు వినిపించడం ఇప్పుడప్పుడే తగ్గే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ తీరును తీవ్రంగా తప్పుబట్టి.. పార్టీకి దూరం జరిగారు. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే సైతం పార్టీ ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(Mekapati Chandrashekar Reddy) పార్టీ అధినాయకత్వం తీరుపై అసంతృప్తి గళం వినిపించారు. పార్టీ పరిశీలకుడు ధనుంజయరెడ్డి తీరును ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తప్పుబట్టారు. తన నియోజకవర్గంలో ధనుంజయరెడ్డి(Danunjaya Reddy) చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. నేతలను సమన్వయ పరచకుండా తన వ్యతిరేకులకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. ధనుంజయరెడ్డి సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని అన్నారు. ఆయన వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతోందని మండిపడ్డారు. నియోజకర్గంలో తమకు చాలా ఇబ్బంది కలుగుతోందని.. ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.

First published:

Tags: Andhra Pradesh, Nellore, Ysrcp

ఉత్తమ కథలు