హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Mekapati: ఎవరోస్తారో రండి.. వైసీపీ నేతలకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్.. నడ్డిరోడ్డుపై కూర్చుని..

Mekapati: ఎవరోస్తారో రండి.. వైసీపీ నేతలకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్.. నడ్డిరోడ్డుపై కూర్చుని..

రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చుకున్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చుకున్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

Udayagiri: వైసీపీ నుంచి మేకపాటిని సస్పెండ్ చేసిన తరువాత.. నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణుల ఆయనకు వ్యతిరేకంగా రోడ్డెక్కాయి. ఆయనను నియోజకవర్గం నుంచి తరిమికొడతామని వార్నింగ్ ఇచ్చాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైసీపీ పలువురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వారిలో నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrashekar Reddy) కూడా ఒకరు. వైసీపీ నుంచి మేకపాటిని సస్పెండ్ చేసిన తరువాత.. నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణుల ఆయనకు వ్యతిరేకంగా రోడ్డెక్కాయి. ఆయనను నియోజకవర్గం నుంచి తరిమికొడతామని వార్నింగ్ ఇచ్చాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. నేడు రోడ్డు మీదకు వచ్చారు. బస్టాండ్‌ సెంటర్‌లో కుర్చీ వేసుకొని కూర్చున్నారు. తాను వస్తే తరిమేస్తానని సవాల్ చేసిన వాళ్లు రావాలంటూ సవాల్ విసిరారు. బస్టాండ్‌ సెంటర్‌లో కలియతిరిగారు. వైసీపీ (Ysrcp) నాయకత్వం తనపై అభాండాలు వేసి సస్పెండ్‌ చేసిందని ఆరోపించారు. తాను. పార్టీలో లేనని చెప్పి కొందరు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే తనను ఇక్కడి నుంచి నుంచి తరిమికొట్టాలని సవాల్ విసిరారు.

వైసీపీ నాయకత్వం సస్పెండ్ చేసిన తరువాత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దూకుడు పెంచారు. తనను టార్గెట్ చేస్తున్న నేతలకు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. తనకు సవాల్ విసిరిన ఎమ్మెల్యే అనిల్‌కు సమాధానంఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తామని అన్నారు. గెలవలేకపోతే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సింగిల్ డిజిట్‌తో గెలిచిన అనిల్.. 35 వేల మెజార్టీతో గెలిచిన తనకు సవాల్ విసరడం ఏంటని చురకలంటించారు. వచ్చే ఎన్నికల్లో తనతో పాటు ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు.

వైసీపీ నాయకత్వం వేటు వేసిన తరువాత మీడియాతో మాట్లాడిన మేకపాటి..అసలు రాజకీయాలు చేయడం అనవసరం అనిపిస్తోందని అన్నారు. రాజకీయాలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని అన్నారు. రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నానని చెప్పారు. కోట్లు పెట్టి రాజకీయం చేయలేనని... రాజకీయాలు అంటే డబ్బుతో కూడుకున్న పని అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వలేమని అధిష్ఠానం కూడా చెప్పేసిందని చెపప్ారు. ఇప్పటికే ఓ వ్యక్తి దగ్గర కొన్ని హామీలతో తాను డబ్బులు తీసుకున్నానని..ఇంకా అప్పులు చేసి రాజకీయాలు చేయడం తన వల్ల కాదని అన్నారు.

Tirumala: ఏప్రిల్‌లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? వసతి టికెట్ల విడుదల

AP Half Day Schools: ఏపీ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. ఒంటిపూట బడులు ఎప్పటినుంచంటే?

తాను డబ్బులు పెట్టలేను కాబట్టి.. ఎవరైనా వ్యక్తిగానీ, పార్టీగానీ డబ్బులిచ్చి పోటీ చేయమంటే మాత్రం కచ్చితంగా చేస్తానని చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఇప్పటికే రెండుసార్లు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి హార్ట్ సర్జరీ జరిగింది. ఆయనకు ఆరోగ్యం కూడా పెద్దగా సహకరించట్లేదని అనుచరులు చాలా రోజులుగా చెబుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh

ఉత్తమ కథలు