హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Roja vs Lokesh: దమ్ముంటే కొడుకుపై ప్రమాణం చేయాలి.. లోకేష్ కు మంత్రి రోజా సవాల్.. ఎందుకో తెలుసా?

Roja vs Lokesh: దమ్ముంటే కొడుకుపై ప్రమాణం చేయాలి.. లోకేష్ కు మంత్రి రోజా సవాల్.. ఎందుకో తెలుసా?

నారా లోకేష్ కు రోజా సవాల్

నారా లోకేష్ కు రోజా సవాల్

Minister Roja vs Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయ మంటలు సెగలు కక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, టీడీపీ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా దమ్ముంటే కొడుకుపై ప్రమాణం చేయగలవా అంటూ నారా లోకేష్ కు మంత్రి రోజా సవాల్ విసిరిరారు.. ఎందుకో తెలుసా?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Minister Roja vs Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Praedesh) లో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో పరిస్తితి వేడెక్కింది. చాలా ముందుగానే ఎన్నికల వాతావరణ కనిపిస్తోంది. విమర్శలు, ప్రతివిమర్శల విషయంలో ఇటు వైసీపీ,(YCP) అటు టీడీపీ (TDP) తగ్గేేదే లే అంటున్నాయి. ప్రస్తుతతం తిరుమలలో వైభంగా బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) తిరుమల (Tirumala) లో పర్యటిస్తున్నారు. శ్రీవారికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. రెండు రోజుల పాటు అక్కడే సీఎం జగన్ ఉంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) సంచలన ఆరోపణలు చేశారు. కాదంటూ తిరుమలలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.. లోకేష్ ఏమన్నారంటే..?

  వివేకా హత్య తో నాకు, నా కుటుంబానికి సంబంధం లేదని 14-4-21 న కలియుగ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేశాను. బాబాయ్ హత్య తో మీకు, మీ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చెయ్యడానికి సిద్ధమా జగన్ రెడ్డి అంటూ లోకేష్ ప్రశ్నించారు.. అక్కడితోనే ఆయన ఆగలేదు..

  దాన్ని కొనసాగిస్తూ మరో ట్వీట్ కూడా చేశారు. ప్రస్తుతం తిరుమల వెళ్తున్న మీరు.. నిజంగా ధైర్యం ఉంటే.. వెంకన్న స్వామిపై మీరు ప్రమాణం చేస్తారా? లేక బాబాయ్ పై గొడ్డలి పోటు జగనాసుర రక్త చరిత్ర అని ఒప్పుకుంటారా అంటూ ట్వీట్ల వర్షం కురిపించారు.

  లోకేష్ ట్వీట్లపై అదే స్థాయిలో మండిపడ్డారు మంత్రి రోజా .. అమ్మవారి గుడిలో కిరీటాలు ఎత్తుకుపోయిందెవరు? క్షుద్ర పూజలు చేయించిందెవరు? 40 గుడులను కూల్చేసింది ఎవరు? సదావర్తి భూముల్ని పప్పుబెల్లాలకు అమ్మేసిందెవరు? అంతర్వేది రథం తగలబెట్టిందెవరు? రాముడి విగ్రహం విరిచేసిందెవరు? నీ కొడుకు మీద ప్రమాణం చేసి నిజాలు చెప్పు అంటూ ప్రశ్నల వర్షంతోనే కౌంటర్ ఇచ్చారు..

  మరి రోజా ప్రశ్నలకు లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి..  రోజాకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా.. లేక రిప్లై ఇస్తారో చూడాలి..  ప్రస్తుతం  వీరిద్దరి మధ్య జరుగుతున్న ట్విట్టర్ వార్.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP Politics, Minister Roja, Nara Lokesh

  ఉత్తమ కథలు