నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Actor Bandla Ganesh), వైసీపీ (YSRCP) ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) మధ్య ట్విట్టర్ (Twitter) ఫైట్ ఓ రేంజ్ లో సాగుతోంది. సాయిరెడ్డి చేసిన కామెంట్స్ కు బండ్ల గణేష్ చేసిన ట్వీట్స్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే బండ్ల ట్వీట్స్ కు విజయసాయి రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ల ఇచ్చారు. ఇద్దరి మధ్య ట్వీట్స్ వార్ తారాస్థాయికి చేరింది. ఇద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అనేలా చేసుకుంటున్న ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎక్కడ మొదలైన గొడవ ఎక్కడికి వెళ్తుందంటూ చర్చ కూడా జరుగుతోంది. మోసాలు, అవినీతి, జైళ్లు, సీబీఐ ఎంక్వైరీల వరకు ట్వీట్ వార్ వెళ్తోంది.
బండ్ల గణేష్ గతం, సినీకెరీర్, ఇతర అంశాలపై సాయిరెడ్డి ట్వీట్లు చేస్తే.. ఒకరిమీద ఒకరు సీబీఐ ఎంక్వైరీ వేయించుకుంటే ఎవరు మంచోళ్లో తేలిపోద్దంటూ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు ఈ గొడవలోకి ఎన్టీఆర్, రామ్ చరణ్, పూరీ జగన్నాథ్ పేర్లను ప్రస్తావిస్తూ బండ్ల వారిని మోసం చేశారని విజయసాయి ఆరోపించగా.. దమ్ముంటే వాళ్లతో స్టేట్ మెంట్ ఇప్పించాలని గణేష్ ఛాలెంజ్ చేశారు. ఇక చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నావంటూ సాయిరెడ్డి కౌంటర్ ఇస్తే.. అసలు చంద్రబాబుతోగానీ, టీడీపీతో గానీ తనకు సంబంధమే లేదని.. తాను వైఎస్ఆర్ అభిమానినన.. కావాలంటే ఆ విషయం కేవీపీని అడగాలని సూచించారు.
వెన్నుపోటు పేటెంటు నీ యజమాని చంద్రబాబుది. 28 ఏళ్లుగా చెక్కు చెదరని గిన్నెస్ రికార్డు. ఇంకో వందేళ్లయినా అది బాబు పేరనే ఉంటుంది. ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా బండ్లా? ప్రతి కుక్కా సింహం కావాలనుకుటుంది. నీలాంటి వాడే భౌ..భౌమని మొరిగి గర్జించా అనుకుని మురిసిపోతుంటాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 16, 2022
"బ్రోకర్లు, తార్పుడుగాళ్లు, మోసగాళ్లు, జేబులు కొట్టేవాళ్ళు ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తే పెద్దోళ్లు అయిపోతామని భ్రమపడుతుంటారు. బండ్లలాగా. ఎన్నిసార్లు తన్నులు తిన్నది, ఎవరెవరి కాళ్లుపట్టుకున్నదీ అతని జాతకం లైట్ బోయ్ నుంచి అందరికీ తెలుసు. కుక్కకాటుకు చెప్పుదెబ్బలు తప్పవు." అంటూ సాయి రెడ్డి హెచ్చరించారు.
నువ్వు అన్నావ్ చూడు రామ్ చరణ్, ఎన్టీఆర్, పూరి జగన్నాధ్ వీరిలో ఎవరితోనైనా స్టేట్మెంట్ ఇప్పి నేను వారిని మోసం చేశానని, నువ్వు మోసం చేశావు అని దేశం మొత్తం కోట్ల మంది కోడై కూస్తోంది. నువ్వు మోసగాడవి అని, నీవు ముద్దాయివి అని నిను బొక్కలు వేసి జైల్లో పెట్టారు.. ఇది అబద్దమా..?
— BANDLA GANESH. (@ganeshbandla) April 16, 2022
ఎవడో చెప్పిన మాటల్ని విని, ఎవరి దగ్గరో ఎంక్వైరీ చేసుకొని ట్వీట్లు పెట్టకు దొంగసాయి. ఎందుకంటే ఒకటి మనస్సాక్షి అనేది ఉంటది.. నేను తెలుగుదేశం.. నేను చంద్రబాబు మనిషనని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడబాకా.. నాకు బతుకునిచ్చింది, జీవితాన్ని ఇచ్చింది పవన్ కళ్యాణ్. నాకు కృతజ్ఞత ఉంటది…..
— BANDLA GANESH. (@ganeshbandla) April 16, 2022
"ఎవడో చెప్పిన మాటల్ని విని, ఎవరి దగ్గరో ఎంక్వైరీ చేసుకొని ట్వీట్లు పెట్టకు దొంగసాయి. ఎందుకంటే ఒకటి మనస్సాక్షి అనేది ఉంటది.. నేను తెలుగుదేశం.. నేను చంద్రబాబు మనిషనని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడబాకా.. నాకు బతుకునిచ్చింది, జీవితాన్ని ఇచ్చింది పవన్ కళ్యాణ్. నాకు కృతజ్ఞత ఉంటది..." అంటూ మరో ట్వీట్ చేశారు గణేష్.
నీకు ఒక ముఖ్య విషయం తెలియజేయాలి దొంగసాయి.. నేను ఎప్పటికీ తెలుగుదేశం కాదు, నేను వైయస్ రాజశేఖర్రెడ్డి గారి అభిమానిని అది నిజమో కాదో కావాలంటే గౌరవనీయులైన రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ బంధువు కెవిపి గారిని అడిగి తెలుసుకో.. దొంగసాయి.. నేను ఏపార్టీయో ఆయన చెబుతారు దొంగ సాయి
— BANDLA GANESH. (@ganeshbandla) April 16, 2022
ఆకులు..వక్కలు..పక్కలు...ఇదేగా నీ బతుకు! అంతే ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావ్. మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లవుతాయి గాని, బండ్లు ఓడలు కావు. అయ్యో...గణేశా!
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 16, 2022
ప్రస్తుతం వీళ్లిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధం.. ఏపీ పాలిటిక్స్ తో పాటు సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది. ఎప్పుడూ కులం గురించి, ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించని బండ్ల గణేష్.. ఇప్పుడు సడన్ గా కులం కార్డు బయటకు తీయడం, విజయసాయిపై ట్వీట్ల వర్షం కురిపించడం ఆసక్తికరంగా మారింది. ఈ ట్వీట్ వార్ చివరకు ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.