హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

వైసీపీ ఎంపీపై రూ. 100 కోట్ల పరువునష్టం దావా

వైసీపీ ఎంపీపై రూ. 100 కోట్ల పరువునష్టం దావా

వైసీపీ ముఖ్యనేత, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిపై పరువునష్టం దావా వేయాలని టీవీ9 మాజీ సీఈవో కార్యాలయం నిర్ణయించింది.

    టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ అసందర్భమైన, అసత్య ఆరోపణలు చేసిన పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డిపై రూ.100 కోట్ల పరువునష్టం దావా వేయాలని రవిప్రకాష్ కార్యాలయం నిర్ణయించింది. ఏబీసీఎల్‌ సంస్థలో చట్టవ్యతిరేకంగా ప్రవేశించిన రామేశ్వరరావు, మెఘా కృష్ణారెడ్డి ద్వయం ఈ ఆరోపణలు చేయిస్తోందని ఆయన కార్యాలయం ఆరోపించింది. గతంలో ఇదే రకమైన ఆరోపణలను రామేశ్వరరావు, మెఘా కృష్ణారెడ్డి అనుచరుడైన రామారావు చేశారని... అవన్నీ అసత్యమని అధికారులు తేల్చారని గుర్తు చేసింది. రామారావు నెలక్రితం పంపిన లేఖ కాపీనే ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు తన లెటర్ హెడ్‌పై పంపించారని ఆరోపించింది.

    గతంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై మలేషియా, సింగపూర్ విదేశీ నిధులు తరలించారంటూ అబద్ధపు ఫిర్యాదు చేసిన రామారావు... తాజాగా రవిప్రకాష్‌పై ఆరోపణలు చేశారని ఆయన కార్యాలయం పేర్కొంది. వీటి వెనుక పెద్దల హస్తం ఉందని ఆరోపించింది. కంపెనీ షేర్ల వివాదంలో పైచేయి సాధించడం కోసం మై హోమ్ రామేశ్వర రావు, మెఘా కృష్ణారెడ్డి ఈ రకమైన చర్యలకు దిగుతున్నారని రవిప్రకాష్ కార్యాలయం మండిపడింది. ఈ నిరాధారమైన ఆరోపణలను అత్యుత్సాహంతో ప్రసారం చేసిన ఛానెళ్లపై కూడా చర్య తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపింది.

    First published:

    Tags: Ravi prakash, TV9, Vijayasai reddy, Ysrcp

    ఉత్తమ కథలు