Home /News /andhra-pradesh /

AP POLITICS TTD CHAIRMAN YV SUBBAREDDY MADE SENSATIONAL COMMENTS ON ANDHRA PRADESH CAPITAL ISSUE AND VISAKHAPATNAM AS ADMINISTRATIVE CAPITAL FULL DETAILS HERE PRN VSP

AP Capital Issue: మరోసారి తెరపైకి విశాఖ రాజధాని.. ఎవరూ అడ్డుకోలేరన్న వైసీపీ ముఖ్యనేత

వైవీ సుబ్బారెడ్డి (ఫైల్)

వైవీ సుబ్బారెడ్డి (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యే అంశం మూడు రాజధానులు. రాష్ట్రంలో వైసీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యే అంశం మూడు రాజధానులు. రాష్ట్రంలో వైసీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. విశాఖపట్నం (Visakhapatnam) ను రాష్ట్ర పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించింది. ఐతే అమరావతి రైతులు కోర్టుకు వెళ్లడం, హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునివ్వడంతో ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లును కూడా వెనక్కి తీసుకుంది. ఐతే అప్పటికి మూడు రాజధానుల పంచాయతీ ముగిసిందని అందరూ భావించారు. ఐతే ప్రభుత్వం మాత్రం అసెంబ్లీలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని ప్రకటించింది. త్వరలోనే మరో బిల్లును తెస్తామని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో ఆ అంశం మరుగనట్లే అనిపించినా మరోసారి తెరపైకి వచ్చింది.

    తాజాగా టీటీడీ ఛైర్మన్, వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి మూడు రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం విశాఖపట్నంలో పర్యటించిన ఆయన.. మూడు రాజధానుల అంశంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. విశాఖపట్నం రాష్ట్రానికి పరిపాలనా రాజధాని కావడం ఖాయమని తెలిపారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారాయన. దీనిపై ఇప్పటికే రాష్ట్ర సీఎం జగన్ స్పష్టం చేసిన సంగతిని వైవీ సుబ్బారెడ్డి గుర్తుచేశారు. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతే విశాఖ రాజధాని కావడానికి ఎలాంటి సమస్యా ఉండదన్నారు. దీనిని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదన్నారు.

    ఇది చదవండి: అయ్యో టమాటా..! ధర మరీ ఇలా పడిపోయిందేంటి..?


    వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్ తో మూడు రాజధానుల అంశం మరోసారి చర్చనీయాంశం అవుతోంది. అసెంబ్లీలో పాలనా వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వైవీ సంకేతాలిచ్చినట్లు చర్చ జరుగుతోంది. నిజానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లు వస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో.. ఈ సెషన్ లో రాజధానుల బిల్లు వస్తుందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.


    ఇది చదవండి: టీటీడీ కొత్త ఐడియా.. భక్తుల కోసం వర్చులవ్ క్యూలెన్.. రెండు గంటల్లోనే దర్శనం.. పూర్తి వివరాలివే..!


    మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు వైవీ సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు ప్రతి అంశాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. చౌకబారు రాజకీయాలు చేస్తున్నందునే గత ఎన్నికల్లో ప్రజలు ఈడ్చికొట్టారని.. వచ్చే ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందని ఆయన అన్నారు. 2024లో టీడీపీ అడ్రస్ గల్లంతవడం ఖాయమన్నారు. ఇక గాయని శ్రావణ భార్గవి వివాదంపైనా వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఈ వివాదం టీటీడీకి సంబంధించినది కాదన్న ఆయన.. సోషల్ మీడియాలో ఏవేవో వస్తే వాటిపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap capital, Visakhapatnam, YV Subba Reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు