AP POLITICS TRS VS YCP WAR OF WORDS CONTINUE TELANGANA MP RANJIT REDDY SLAMS BOTSA COMMENTS NGS
YCP vs TRS: మంత్రి బొత్స సత్యనారాయణ విద్యుత్ బిల్లు కట్టలేదా? అందుకేనా కరెంటు పోయింది?
మంత్రి బొత్స సత్యనారాయణ (ఫైల్)
YCP vs TRS: మొన్నటి వరకు భాయ్ భాయ్ అనుకున్నారు.. ఒకరికి ఒకరు సహకరించుకున్నారు. చిన్ని చిన్న వివాదాలు మినహా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేంత గ్యాప్ లేదు టీఆర్ఎస్-వైసీపీ మధ్య.. కానీ ఇప్పుడు మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
YCP vs TRS: మళ్లీ వైసీపీ (YCP) వర్సెస్ టీఆర్ఎస్ (TRS) పోరు మొదలైంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని మౌలిక వసతుల గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, మాజీ మంత్రులు, వైసీపీ నేతలు ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. డేట్, టైమ్ చెప్పు కేటీఆర్.. ఏపీ మొత్తం తిప్పి చూపిస్తా అని ఓ మంత్రి అంటే.. నాలుగు కాదు 400 బస్సుల్లో ఏపీకి వచ్చి చూడండి అని మరో మంత్రి సవాల్ విసురుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికార పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఏపీలో కంటే హైదారాబాద్ (Hydeabad) లోనే కరెంట్ కోతలు ఎక్కువగా ఉన్నాయని.. తాను స్వయంగా హైదరాబాద్ లోనే ఉండి వస్తున్నాని.. అక్కడ కరెంటే ఉండటం లేదన్నారు. అంతేకాదు జనరేటర్ వేసుకొని వచ్చానన్నారు. కేటీఆర్‌కు ఎవరో ఫోన్ చేసి చెప్పారని.., కానీ తాను మాత్రం స్వయంగా అనుభవించానన్నారు. బాధ్యత కలిగిన వ్యక్తి అలా మాట్లాడటం తప్పన్న బొత్స.., తమ ఘనత ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చన్నారు.
ఏపీ మంత్రులకు.. టీఆర్ఎస్ నేతలు కూడా అదే రేంజ్ లో కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ఎంపీ రంజిత్ రెడ్డి సెటైర్లు ఏపీ మంత్రులపై సెటైర్లు వేశారు. హైదరాబాద్‌లో కరెంట్ లేదన్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఒకవేళ బొత్స కరెంట్ బిల్లు కట్టలేదేమో.. అందుకే కట్ చేసి ఉంటారని ఎద్దేవ చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ కరెంట్ బిల్లు కట్టలేదేమో.. అందుకే కట్ చేసినట్లు ఉన్నారని సెటైర్ వేశారు. తెలంగాణలో 2 నిమిషాలు కూడా కరెంట్ పోదన్నారు. ఒకవేళ అరగంట లేకపోతే మనం తట్టుకోలేక పోతున్నాం. అప్పుడు ఏం ఉన్నాయో.. ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలుసు అని ఎంపీ రంజిత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సీఎం కేసీఆర్ పాలన బాగుందని వైసీపీ ఎంపీలే అంటున్నారన్న రంజిత్ రెడ్డి హైదరాబాద్‌లో మంచిగుందని మాకు ఫోన్ చేసి అడుగుతున్నరన్నారు. హైదరాబాద్‌లో ఉన్న వైసీపీ నేతలను అడిగితే నిజం తెలుస్తుందన్నారు. జగన్ కుటుంబం ఇక్కడే ఉంటుంది.. వాళ్లను అడిగినా నిజం చెప్తార కదా అన్నారు. కేసీఆర్ పాలన బాగుందని వైసీపీ ఎంపీలే నాతో అన్నారు. మా పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి. 2014లో రాష్ట్రం ఏర్పడితే మీకు పాలన చేతగాదు అన్నారని.. కానీ ఇప్పుడు వాళ్ల ఎంపీలే మమ్మల్ని ప్రశంసిస్తున్నారని గుర్తు చేశారు.
మాకు ఏపీతో పోటీ కానే కాదు అని రంజిత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నారనడం విడ్డూరమన్న ఎంపీ. తెలంగాణలో 2 నిమిషాలు కూడా కరెంట్ పోవడం లేదని ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. కేటీఆర్ వివాదానికి ఎండ్ కార్డు వేయాలని చూసినా.. టీఆర్ఎస్ వైసీపీ నేతల మధ్య దుమారం ఆగేలా కనిపించడం లేదు.. మరి ఎంపీ రంజిత్ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.