Home /News /andhra-pradesh /

AP POLITICS TRS PRESIDENT AND TELANGANA CM KCR WILL CREATE NEW DISPUTE IN ANDHRA PRADESH POLITICS TROUBLE FOR YS JAGAN MOHAN REDDY CHANDRABABU NAIDU AND PAWAN KALYAN AK

KCR| Andhra Pradesh: ఏపీలో కొత్త పంచాయతీ పెట్టనున్న కేసీఆర్ ?

కేసీఆర్, ఏపీ మ్యాప్

కేసీఆర్, ఏపీ మ్యాప్

KCR| Andhra Pradesh: సీఎం కేసీఆర్ సారథ్యంలోని జాతీయ పార్టీని అసలు ఏపీ పార్టీలు పెద్దగా పరిగణనలోకి తీసుకుంటాయో లేదో కూడా ఇప్పుడే చెప్పలేమని అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్.. ఇందుకోసం తన సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్‌ను (TRS) బీఆర్ఎస్(భారత రాష్ట్ర సమతి)గా మార్చి దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తరించాలనే ఆలోచనతో ఉన్న కేసీఆర్.. ఎక్కువగా తనకు అవగాహన ఉన్న రాష్ట్రాలపైనే ఫోకస్ చేస్తారని.. అదే జరిగితే కేసీఆర్ కారణంగా ఏపీలో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చే అవకాశం ఉందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

    ఒకప్పుడు తెలంగాణలో(Telangana) బలమైన పార్టీగా ఉన్న టీడీపీ, 2014 తరువాత కూడా తెలంగాణలో కొన్ని సీట్లు గెలుచుకున్న వైసీపీ.. ప్రస్తుతం తెలంగాణలో లేకుండాపోయాయి. అయితే ఒకవేళ కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో ఏపీలో(Andhra Pradesh) తన పార్టీని విస్తరించాలని భావిస్తే.. ఆ పార్టీలు ఏం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కేసీఆర్ దూకుడుకు కళ్లెం వేసేందుకు ఈ పార్టీలు మళ్లీ తెలంగాణలో తమ పార్టీలను బలపర్చడంపై దృష్టి పెడతాయా ? లేక కేసీఆర్ ఏపీలో తన పార్టీని విస్తరించకుండా అడ్డుకోవడం మీదే ఫోకస్ చేస్తాయా ? అన్నది తేలాల్సి ఉంది.



    ప్రస్తుతం ఏపీలోని అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేనతో కేసీఆర్‌కు ఎలాంటి పంచాయతీ లేదు. అయితే వైసీపీ బీజేపీతో స్నేహంగా ఉండటంపై సీఎం కేసీఆర్ అంతర్గతంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వాదన ఉంది. ఈ కారణంగానే ఆయన వైఎస్ జగన్‌ను కూడా టార్గెట్ చేస్తారేమో అనే చర్చ సాగుతోంది. అయితే సీఎం కేసీఆర్ సారథ్యంలోని జాతీయ పార్టీని అసలు ఏపీ పార్టీలు పెద్దగా పరిగణనలోకి తీసుకుంటాయో లేదో కూడా ఇప్పుడే చెప్పలేమని అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    KCR New Strategy: జాతీయ పార్టీపై కేసీఆర్ లెక్కేంటి ?... బీజేపీకి అలా కౌంటర్ ఇస్తారా ?

    Telangana Congress: కాంగ్రెస్ రూటు మారుస్తోందా ?.. టీఆర్ఎస్‌తో సమానంగా బీజేపీ ?

    కానీ తెలంగాణ తరువాత కేసీఆర్ తన జాతీయ పార్టీని ఏపీలోనే ఎక్కువగా విస్తరించేందుకు ప్రయత్నిస్తారని.. కాబట్టి వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు కేసీఆర్‌ను ప్రతిఘటించకతప్పని పరిస్థితి రావొచ్చనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త పార్టీ ఏపీలో కొత్త పంచాయతీ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu, CM KCR, Pawan kalyan

    తదుపరి వార్తలు