హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: కొడాలి నాని, వంశీని భౌతికంగా తొలగిస్తే రూ.50 లక్షలు..! కమ్మ వనసమారాధనలో షాకింగ్ కామెంట్స్..

AP Politics: కొడాలి నాని, వంశీని భౌతికంగా తొలగిస్తే రూ.50 లక్షలు..! కమ్మ వనసమారాధనలో షాకింగ్ కామెంట్స్..

కొడాలి నాని, వల్లభనేని వంశీ (ఫైల్)

కొడాలి నాని, వల్లభనేని వంశీ (ఫైల్)

తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరలో జరిగిన కమ్మ కులస్తుల వనసమారాధనలో స్థానిక కౌన్సిలర్ మల్లాది వాసు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏకంగా మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani), ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ (MLA Vallabhaneni Vamsi), అంబటి రాంబాబును (Ambati Rambabu) హత్య చేయాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దుమారం రేగుతోంది.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇటీవల మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మోహన్, అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడారంటూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నానితో పాటు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భద్రత పెంచింది. ఆ తర్వాత వివాదం మెల్లగా సద్దుమణుగుతూ వస్తోంది. అసెంబ్లీలో అలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయలేదని మంత్రులతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా క్లారిటీ ఇచ్చారు.

  తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరలో జరిగిన కమ్మ కులస్తుల వనసమారాధనలో స్థానిక కౌన్సిలర్ మల్లాది వాసు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏకంగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబును హత్య చేయాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దుమారం రేగుతోంది.

  ఇది చదవండి: ఏపీలో వారందరికీ పెన్షన్లు కట్..? ఈ ఒక్కలేఖతో చిక్కుల్లో జగన్ సర్కార్..!


  భౌతికంగా తొలగిస్తే రూ.50 లక్షలు

  మల్లాది వాసు మాట్లాడుతూ.. “ఏపీలో 2004లో టీడీపీ ఓడిపోయే వరకు కమ్మవారికి, టీడీపీకి ధైర్యంగా ఉన్న పరిటాల రవిని మొద్దుశీను అనే వ్యక్తితో ఆయన్ను చంపించారు. పరిటాల రవి ఇప్పుడు బ్రతికి ఉంటే ఏపీలో ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇప్పుడు సమయం ఆసన్నమయైంది. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. కులంలో ఉన్న చీడపురుగులు కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి చీడపురుగులను భౌతికంగా నిర్మూలించాల్సిన అవసరముందన్నారు. అలాగే మదపుటేనుగులా ప్రవర్తిస్తున్న అంబటి రాంబాబును కూడా తొలగించాలి. ఇప్పటి నుంచే అలాంటి ఆపరేషన్ మొదలు పెట్టాల్సిన అవసరముంది. ఈ పనికి ఎవరన్నా ముందుకు వస్తే వారికి రూ.50 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఇటీవల జరిగిన వ్యక్తిహత హననం మంచిది కాదని.. దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరముంది. రాబోయే రోజుల్లో అలాంటి కార్యక్రమాలు జరుగుతాయి.. మీరే చూస్తారని మల్లాది వాసు అన్నారు. దీనిపై కులపెద్దలందరూ కూర్చొని సరైన నిర్ణయం తీసుకోవాలని” అన్నారు.

  ఇది చదవండి: ఏపీ మ‌రో కంపెనీ బిగ్ షాక్..? 2,200 కోట్ల పెట్టుబ‌డులు వెనక్కి..!


  ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. ఏకంగా మంత్రిని, ఎమ్మెల్యేలను హత్య చేయాలని.. అందుకు డబ్బులు కూడా ఇస్తానని బహిరంగంగా ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజాప్రతినిథుల పట్ల ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడాన్ని పలువురు తప్పుబడుతునారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని గానీ, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ గానీ, అంబటి రాంబాబు గానీ స్పందించలేదు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Politics, Kodali Nani, Vallabaneni Vamsi

  ఉత్తమ కథలు